త్వరలోనే సారా ఎంట్రీ : సైఫ్ | Sara ali khan debut movie with Ranveer singh | Sakshi
Sakshi News home page

త్వరలోనే సారా ఎంట్రీ : సైఫ్

Published Sat, Feb 18 2017 1:55 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

త్వరలోనే సారా ఎంట్రీ : సైఫ్

త్వరలోనే సారా ఎంట్రీ : సైఫ్

గతంలో సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వారసురాళ్లు పెద్దగా వచ్చే వారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ హీరోల కూతుళ్లు కూడా వెండితెర మీద సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే సోనాక్షి సిన్హా, సోనమ్ కపూర్ లాంటి తారలు వెండితెర మీద మెరుపులు మెరిపిస్తుండగా ఇప్పుడు మరో తార తెరంగేట్రానికి రంగం సిద్దమవుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ వెండితెర అంరంగేట్రానికి రెడీ అవుతోంది. ఈ విషయాన్ని సారా అలీఖాన్ తండ్రి ప్రముఖ బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కన్ఫామ్ చేశాడు. ఈ సినిమాను కర్ణ్ జోహార్ నిర్మించనున్నాడని ప్రకటించాడు సైఫ్.  బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ సరసన సారా వెండితెరకు పరిచయం అయ్యే చాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.  ఇప్పటికే పబ్లిక్ అపియరెన్స్లలో తన గ్లామర్ తో ఆకట్టుకుంటున్న సారా తొలి సినిమాతోనే సత్తా చాటేందుకు రెడీ అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement