
సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. అమరరాజ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హీరో అనే టైటిల్ ఖారారు చేసింది చిత్రబృందం. శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, అశోక్ గల్లా సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. సూపర్ స్టార్ మహేశ్ విడుదల చేసిన ‘హీరో’ టీజర్‌కు మంచి ఆదరణ లబిస్తుంది. ఇప్పటికే టీజర్‌కు 4మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
Remarkable #𝐇𝐄𝐑𝐎TitleTeaser hits 4️⃣ Million Views!
— BARaju's Team (@baraju_SuperHit) June 24, 2021
▶️ https://t.co/OIenFMIfqL#Hero@AshokGalla_ @SriramAdittya #PadmavathiGalla @AgerwalNidhhi @IamJagguBhai @JayGalla @ravipatic @GhibranOfficial @amararajaent @WhackedOutMedia pic.twitter.com/54it7718FW
టీజర్‌లో అశోక్ కౌబాయ్ గెటప్‌లో కనిపించారు. గుర్రంపై ఆ ట్రైన్‌ను ఫాలో అవుతూ ఇచ్చిన అశోక్ ఎంట్రీ టీజర్‌కు హైలెట్‌గా చెప్పుకోవచ్చు. అంతేగాక హీరో జోకర్ గేటప్‌లో సైకోగా కనిపించగా మరోచోట రోమియోగా దర్శనం ఇచ్చాడు. టీజర్ మొత్తంలో అశోక్ మూడు పాత్రల్లో కనిపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. దాదాపు షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. జగపతిబాబు, నరేష్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment