రౌడీ బాయ్స్‌: బృందావనం లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ | Rowdy Boys: Anupama Parameswaran Amazing In Brindavanam | Sakshi
Sakshi News home page

రౌడీ బాయ్స్‌: బృందావనం లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌

Published Mon, Jan 3 2022 3:32 PM | Last Updated on Mon, Jan 3 2022 7:04 PM

Rowdy Boys: Anupama Parameswaran Amazing In Brindavanam - Sakshi

Rowdy Boys: Anupama Parameswaran Amazing in Brindavanam: దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్‌ రెడ్డి తొలి డెబ్యూ సినిమా రౌడీ బాయ్స్‌. అనుపమ పరమేశ్వరన్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా బృందావనం అనే సాంగ్‌ను విడుదల చేశారు.

సుద్దాల అశోక్‌ లిరిక్స్‌ అందించగా, మంగ్లీ తన వాయిస్‌తో మరోసారి ఆకట్టుకుంది. హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement