brindavanam
-
హోలీ, రంగుల కేళి : ఇక్కడ పండుగ సంబరాల లెవలే వేరు!
#Holi2024హోలీ పండుగ అంటేనే ఉత్సాహభరితమైన పండుగ. 'రంగుల పండుగ'. చిన్నా పెద్దా అంతా దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగల్లో హోలీ కూడా. వసంతం రాకను తెలియ చెప్పే పండుగ. చెడుపై మంచి విజయానికి సూచిక. ఈ ఏడాది మార్చి 25, సోమవారం హోలీ జరుపుకుంటాం. అసలు హోలీ అంటే ఇలా ఉండాలి అనేలా జరుపుకునే ప్రదేశాల గురించి మీకు తెలుసా? హోలి అంటే వివిధ రకాల రంగులు, చక్కటి సంగీతం, కుటుంబం , స్నేహితులతో మంచి సమయం గడపటం, చక్కటి స్వీట్లు. ప్రతీ రెండు రోజుల వేడుకల కోసం సన్నాహాలు వారాల ముందుగానే షురూ అయిపోతాయి. రంగుల పొడులు (గులాల్), వాటర్ గన్లు , స్వీట్లను కొనుగోలు చేసే వ్యక్తులతో మార్కెట్లు నిండిపోతాయి. రాధా కృష్ణుల దైవిక ప్రేమకు గుర్తుగా జరుపుకోవడం ఒక ఆనవాయితీ. మన దేశంలోని కొన్ని చోట్ల అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఉత్తర్ ప్రదేశ్: యూపీ,మథురలోని బర్సానా లత్మార్ హోలీకి ప్రసిద్ధి చెందింది, ఇక్కడ ఈ హోలీ వేడుకలు ఏటా ప్రతిష్ఠాత్మకంగా జరుపుకుంటారు. స్త్రీలు సంప్రదాయబద్ధంగా గోపికల వేషధారణతోనూ, పురుషులు గో పురుషులుగానూ మారి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. మథురలోని రాధా కృష్ణుల ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతారు. భజనలు, సంకీర్తనలతో వీధులన్నీ మార్మోగుతుంటాయి. స్థానికులు మాత్రమే కాదు, విదేశీయులు కూడా హోలీ వేడుకలతో సందడి చేయడం విశేషం. బృందావన్: ఇక్కడ హోలీ వేడుక వారం రోజుల పాటు సాగుతుంది. పువ్వులు, రంగులతో హోలీని ఆడతారు. బృందావన్‌లోని బాంకీ బిహారీ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ హోలీ అనేది ఒకరోజు కార్యక్రమం కాదు. రంగుల్లో మునిగి తేలడంతోపాటు,పురాణ ఇతిహాసాలు, స్థానిక జానపద కథల ప్రస్తావనలతో వారం పాటు వేడుక కొనసాగుతుంది. శాంతినికేతన్: పశ్చిమ బెంగాల్, బోల్పూర్లో ఉన్న శాంతినికేతన్ హోలీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఇక్కడ దీనిని బసంత ఉత్సవ్ అని కూడా పిలుస్తారు. రవీద్ర భారతి యూనివర్శిటీలో నోబెల్ గ్రహీత రవీద్రనాథ్ ఠాగూర్ ఈ పండుగను నిర్వహించడం మొదలెట్టారట. ఈ ప్రేరణతోనే సాధారణ వేడుకలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి. పంజాబ్: పంజాబ్‌లో హోలీ పండుగను హోలా మొహల్లాగా జరుపుకుంటారు. 'హోలా-మొహల్లా' అంటే 'యుద్ధ-నైపుణ్యాల సాధన' అని అర్థం. అందుకే హోలీ వేడుకలో కత్తులతో విన్యాసాలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు, నిహాంగ్ సిక్కులు ఉత్సాహంగా జరుపుకుంటారు. హోలీని పౌరుషానికి ప్రతీకగా, ధైర్యవంతుల హోలీగా వేడుక చేసుకుంటారు. ఉదయపూర్, రాజస్థాన్: రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోనూ హోలీ వేడుకలకు పెట్టింది పేరు. అక్కడ ఉండే మేవార్ రాజ వంశస్థులు ఈ పండుగను హోలికా దహన్ కార్యక్రమంతో ప్రారంభిస్తారు. రాజస్థాన్‌లోని పుష్కర్‌లో కూడా హోలీ వేడుకలు ఎంతో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడుపుతారు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో ఉత్సాహంగా హోలిని జరుపుకుంటారు. కాగా దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై నగరాల్లో కూడా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. అటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా తెలంగాణాలో చిన్నా, పెద్ద అంతా,ముఖ్యంగా యువత ఈ రంగుల హోలీని బాగా ఎంజాయ్ చేస్తారు. -
రౌడీ బాయ్స్: బృందావనం లిరికల్ సాంగ్ రిలీజ్
Rowdy Boys: Anupama Parameswaran Amazing in Brindavanam: దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్ రెడ్డి తొలి డెబ్యూ సినిమా రౌడీ బాయ్స్. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా బృందావనం అనే సాంగ్‌ను విడుదల చేశారు. సుద్దాల అశోక్ లిరిక్స్ అందించగా, మంగ్లీ తన వాయిస్‌తో మరోసారి ఆకట్టుకుంది. హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
5 కోట్ల కరెన్సీ నోట్లు.. కిలోల కొద్దీ బంగారు, వెండితో అమ్మవారి అలంకరణ
నెల్లూరు(బృందావనం): కోట్ల రూపాయల కొత్త కరెన్సీ రెపరెపల తోరణాలు.. కిలోల కొద్ది బంగారు, వెండి బిస్కెట్లు.. విద్యుద్దీప కాంతుల నడుమ సింహపురి సీమలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందుతున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నుడా చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆర్యవైశ్య సంఘీయులు, భక్తుల సహకారంతో ఐదోరోజు సోమవారం శ్రీవాసవికన్యకాపరమేశ్వరి అమ్మవారిని, ఆలయాన్ని రూ.ఐదు కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు, రూ.3.5కోట్ల విలువైన ఏడు కిలోల బంగారు బిస్కెట్లు, రూ.3.5 కోట్ల విలువైన 60 కిలోల వెండిబిస్కెట్లు, ఆభరణాలతో అలంకరించారు. (చదవండి: ఏపీపీఎస్సీలో 190 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు) ఇందుకోసం మహబూబునగర్ జిల్లా బందరుకు చెందిన వేమూరిచంద్రశేఖర్ నేతృత్వంలో 120 మంది నిపుణులు పనిచేసి అమ్మణ్ణి ఆలయానికి మరింత శోభను సంతరింపజేశారని ముక్కాల ద్వారకానాథ్ వివరించారు. ఈ సందర్భంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు బారులుతీరారు. (చదవండి: కర్రల సమరం: ‘గట్టు’ మీద ఒట్టు! ) -
మదిలో మోహన గీతం...
బృందావనం చిత్రంలోని ‘మధురమే సుధాగానం/ మనకిదే మరోప్రాణం/మదిలో మోహన గీతం మెదిలే తొలి సంగీతం’ పాట నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నేను చిత్రపరిశ్రమకు వచ్చిన కొత్తల్లో సింగీతం శ్రీనివాసరావుగారి సినిమాలకు కీబోర్డు ప్లేయర్‌గా పనిచేసేవాడిని. అప్పటికే ఆయన తీసిన పంతులమ్మ చిత్రంలో మోహన రాగంలో చేసిన ‘సిరిమల్లె నీవే విరిజల్లు తావే’ పాట బాగా పాపులరయ్యింది. ఈ పాటలో చరణాల మధ్యలో హమ్మింగ్ ఉంటుంది కాబట్టి నేను చేయబోయే పాటలో కూడా హమ్మింగ్ పెట్టాలనుకున్నాను. అలాగే ‘విజయా’ వారికి మోహన రాగమైతే సమ్మోహనంగా ఉంటుందనుకున్నాను. ‘చరణాలు ఎన్ని ఉన్నా పల్లవొకటే కదా/కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా/ శతకోటి భావాలను పలుకు ఎద మాటున/సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా’ అనే చరణానికి అనువుగా అనుభూతి ప్రధానంగా చే శాను. లిరిక్ – ట్యూన్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లాగ ఉండాలి. ‘సంగీతానికి ఇంటిపేరు సాహిత్యం’ అని నా నమ్మకం. సహజ నటుడు రాజేంద్రప్రసాద్, విలక్షణ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, ప్రముఖ సంస్థ ‘విజయా’... వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని సంగీతం జాగ్రత్తగా చేశాను. ‘వేవేల తారలున్నా నింగి ఒకటే కదా/ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా/ఎనలేని రాగాలకూ నాదమొకటే కదా/అనుభూతులెన్ని ఉన్నా హృదయమొకటే కదా’ చరణంలో కూడా భావాన్ని ప్రతిబింబించాను. మా అమ్మగారు వీణ విద్వాంసురాలు కనుక ఈ పాటలో వీణకు ప్రాధాన్యత ఇచ్చాను. ఈ చిత్రంలో హీరోయిన్ సంగీతం టీచర్ కనుక మోహనరాగంలో ఉన్న ‘వరవీణా మృదుపాణి’ గీతం ట్యూన్ తీసుకున్నాం. పిల్లలకు నేర్పుతుండగా హీరో వచ్చి ఇంకో రకంగా సంగీతం తెలిసినట్లుగా పాడుతుంటే, ఇలా పాడతావేంటని ప్రశ్నిస్తుంది హీరోయిన్. అందరూ ఒకేలా పాడితే మిలిటరీ సంగీతం అవుతుంది అంటాడు హీరో. ఆ మాటలను ఆధారంగా చేసుకుని, ఆబ్లిగేటర్స్ చేశాను. అంటే ఒకరు గాంధారంలో పాడుతుంటే, ఒకరు షడ్జమం, మరొకరు పంచమంలో పాడుతుంటారు. ఇన్ని శృతుల్లో పాడినా చెవికి ఇంపుగా ఉండేదే సంగీతం అని చెప్పడానికి ఇలా చూపాం. ఆర్కెస్ట్రాలో సుమారు 40 మందిని వాడుకున్నాం. ఈ పాటకు ఆర్కెస్ట్రయిజేషన్ చేసిన ‘దిన’ ఇప్పుడు తమిళంలో పెద్ద సంగీత దర్శకులు అయ్యారు. చెన్నై ‘విజయా గార్డెన్ డీలక్స్’ లో పాట రికార్డు చేశాం. పియానో సౌండ్‌తో ప్రారంభించి, వీణా నాదంలోకి అనుసంధానం చేయడం ఒక కొత్త ప్రయోగం. విజయా వారు బాపు దర్శకత్వంలో ‘రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్’ తీసిన పదిహేడేళ్ల విరామం తరవాత ‘బృందావనం’ చిత్రం తీశారు. ప్రముఖ నటులు రావికొండలరావుపూనుకొని... కెవిరెడ్డి దగ్గర అసోసియేట్‌గా చేసిన సింగీతం, నాగిరెడ్డి గారి పిల్లలు విశ్వనాథ రెడ్డి, మాధవపెద్ది వంశంలో మా రెండో తరం అందరినీ ఒక గ్రూప్ చేశారు. ‘చందమామ’ నాగిరెడ్డి, చక్రపాణిగారల మానసపుత్రిక కనుక ‘విజయా చందమామ’ బ్యానర్‌గా ఈ సినిమా విడుదల చేశారు. ఈ చిత్రంలోని పాటలు ఎస్. రాజేశ్వరరావుగారికి నివాళిగా చేశాం. ఈ ఆడియోని నా కోరిక మేరకు ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు. ‘విజయా వారి పాటలను, సంగీతాన్ని దృష్టిలో పెట్టుకుని, మాధవపెద్ది బాగా చేశాడు’ అని ఆయన నన్ను ప్రశంసించారు. ఈ పాట నాకు మరచిపోలేని గొప్ప పేరు సాధించి పెట్టింది. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
కనువిందు చేస్తున్న.. ఏనుగుదంతం చెట్లు
పర్లాకిమిడి : మహేంద్రతనయ వద్ద ఉన్న బృందావన ప్యాలెస్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న అతి పురాతన ఏనుగుదంతం చెట్లు చూపరులు, వ్యాయామానికి వెళ్లే పాదచారులకు కనువిందు చేస్తున్నాయి. అప్పట్లో కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ జమిందారీ హయాంలో ఈ ఏనుగుదంతం మొక్కలను బీఎన్.ప్యాలెస్ రోడ్డుకు ఇరువైపులా నాటించారు. 160 ఏళ్లకు పైగానే ఈ చెట్లు జీవించాయి. ప్రపంచంలో అతి ఎక్కువ కాలం జీవించే చెట్టు ఇదే. ఈ చెట్టుకు కాయలు కాస్తాయి. వాటిలో పుష్కలంగా విటమిన్స్, ఐరన్ ఉంటాయి. ఈ కాయల్లో లభించే పప్పు అతి ఎక్కువగా తినరాదని బొటానికల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో కొన్ని చెట్లు నేలకొరగగా మరికొన్ని చెట్లు ఇప్పుటికీ జీవించేఉన్నాయి. రాజావారి కోట ఎడమ వైపున సంస్థానం గుర్రపుశాల ప్రాంగణంలో కూడా ఏనుగుదంతం చెట్లు ఉన్నాయి. ఎటువంటి గాలివానలనైనా తట్టుకుని నిలబడే ఈ చెట్లు భూమిలో చాలా మీటర్ల లోతుకు వీటి వేర్లు పాతుకుపోతాయి. పాదచారులకు నీడనివ్వడమే కాకుండా కాయలు కూడా ఇస్తున్నాయి. బృందావనం ప్యాలెస్‌లో ఇలాంటి అరుదైన చెట్లు పదులకొద్దీ ఉన్నాయి. వాటి ఆలనాపాలనా చూసేవారు లేకపోవడంతో కొందరు దుండగులు చెట్లను నరికి తీసుకుపోతున్నారు. బృందావనం ప్యాలెస్ చుట్టూ ఇప్పుడిప్పుడే కంచె వేయడంతో చెట్ల నరికివేతను కొంతవరకు అరికడుతున్నారు. ప్రస్తుతం టూరిస్టులకు, ఒడియా చలనచిత్ర దర్శక నిర్మాతలను షూటింగ్‌ల నిమిత్తం బృందావన ప్యాలెస్‌లోకి అనుమతిస్తున్నారు. -
బీచ్‌లో బృందావనం
రచయిత శ్రీధర్ సీపాన దర్శకునిగా పరిచయమవుతోన్న చిత్రం ‘బృందావనమది అందరిది’. హర్షవర్ధన్ రాణే, రిచా పణయ్, ఎంపీ శివప్రసాద్, హీరా సాహిలి ముఖ్య తారలుగా శ్రీనివాస్ వంగల, ప్రభాకర్‌రెడ్డి కూతురు (యన్.ఆర్. ఐ) నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శ్రీధర్ సీపాన మాట్లాడుతూ –‘‘వైజాగ్ బీచ్‌లో వేయించిన హీరోయిన్ ఇంటి సెట్‌తో పాటు, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ పూర్తి చేశాం. ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. పని పరంగా నాకు పూర్తి సంతృప్తి అనిపించింది. తొలి చిత్రం అనే భయం నాకు కలగకుండా నటీనటులు, సాంకేతిక నిపుణులు సహకరిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. మా ఫస్ట్ షెడ్యూల్ మేకింగ్ అండ్ శాంపిల్ వీడియో టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్ నాకు మరింత ధైర్యం ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి బెంగళూర్‌లో ఓ షెడ్యూల్, ఆ తర్వాత హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ జరుపుతాం’’ అన్నారు. బెనర్జీ, పృ«థ్వీ, ‘సత్యం’ రాజేష్, ‘తాగుబోతు’ రమేష్, భద్రం, ‘అదుర్స్’ రఘు, రజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: తమ్మ శ్యామ్. -
జయేంద్ర సరస్వతి మహాసమాధి
కాంచీపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శివైక్యం చెందిన కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి (82) బృందావన ప్రవేశం (అంత్యక్రియలు) గురువారం ముగిసింది. మఠంలోని బృందావనంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయపద్ధతిలో ఆయన భౌతికకాయాన్ని మహాసమాధి చేశారు. శిష్యులు, వేదపండితులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అశ్రునయనాల మధ్య స్వామి ‘బృందావన ప్రవేశ’ (అధిష్టానం అని కూడా అంటారు) కార్యక్రమం ముగిసింది. గురువారం ఉదయం 7.45 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం మూడున్నర గంటలసేపు కొనసాగింది. ఉదయం అభిషేకంతో ప్రారంభమైన అంతిమసంస్కారం హారతితో ముగిసింది. దీంతో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మఠ పీఠాధిపతిగా దేశ, విదేశాల్లో కీర్తించబడిన శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య భౌతిక శరీరం పంచభూతాల్లో కలిసి పోయింది. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్, కేంద్ర మంత్రులు రాధాకృష్ణన్, సదానంద గౌడ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అంతిమసంస్కారం జరుగుతున్నంతసేపు కైలయ వాద్యం (శివారాధన సందర్భంగా గుళ్లలో వాయించే తమిళ సంప్రదాయ వాయిద్యం) మోగుతూనే ఉంది. రాత్రంతా మఠంలో ప్రార్థనలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, శిష్యులు, వైరాగ్య పండితులు బుధవారం రాత్రంతా మండపాల్లో స్వామీజీ పార్థివదేహం ముందు ప్రార్థనలు చేశారు. ఉదయం 7 గంటలకు బృందావన ప్రవేశ కార్యక్రమం ప్రారంభమైంది. స్వామీజీ భౌతికకాయాన్ని సమాధి చేసే తంతును మఠం నిర్వాహకులు బృందావన ప్రవేశ కార్యక్రమంగా పేర్కొన్నారు. గురువారం నుంచి మఠం పీఠాధిపతి బాధ్యతలు చేపట్టిన శ్రీ విజయేంద్రసరస్వతి పర్యవేక్షణలో అధిష్టాన పూజాధికాలు ప్రారంభమయ్యాయి. ఉద్విగ్నం.. ఉద్రిక్తం జయేంద్ర సరస్వతిని కడసారి చూసేందుకు మందిర ప్రాంగణంలోకి వచ్చిన వారిని అంతిమసంస్కారం సమయంలో కాసేపు పోలీసులు ఆపివేశారు. అప్పటివరకు ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా మొత్తం కార్యక్రమాన్ని భక్తులకోసం మఠం నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. అయితే అలంకరణ సమయంలో కాసేపు ప్రత్యక్షప్రసారాన్ని నిలిపేశారు. దీంతో పోలీసుల వలయాన్ని దాటుకుని లోపలకు వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడున్న వాలంటీర్లు కొందరు కిందపడిపోవటంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే కాసేపటికే అభిషేకం, అలంకరణ తర్వాత స్వామీజీ భౌతికకాయాన్ని మండపంలోకి తీసుకురావటంతో మళ్లీ భక్తులందరూ చూసేందుకు అవకాశం లభించింది. కడసారి స్వామీజీని చూసిన భక్తుల ఆవేదనతో మండపం, మఠం ప్రాంగణం ఒక్కసారిగా ఉద్వేగంగా మారిపోయింది. జయేంద్ర సరస్వతి శివైక్యంపై నటుడు రజనీకాంత్ ట్వీటర్లో సంతాపం వ్యక్తం చేయగా.. కమల్ çహాసన్ పార్టీ మక్కల్ నీతి మయ్యం కూడా ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేసింది. శంకరాచార్యుని బోధనలతో.. గురువు శంకరాచార్య జయేంద్ర సరస్వతి బోధనలను భక్తులు అలవర్చుకుని.. ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని కంచిమఠం కొత్త పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఉపదేశించారు. శివైక్యం పొందిన జయేంద్ర సరస్వతి స్వామీజీకి ప్రజలు, దేశం నాడీ బాగా తెలుసన్నారు. ప్రజల మధ్య వివక్ష చూపకుండా అందరం ఒకటేననే భావనను ఆయన ప్రచారం చేశారన్నారు. బృందావన ప్రవేశం ఇలా స్వామీజీ భౌతిక కాయానికి శాస్త్రబద్ధంగా చందన, పుష్ప, క్షీరాభిషేకాలు జరిపారు. ఆపైన వేదపండితులందరూ కలిసి చంద్రమౌళేశ్వర పూజ నిర్వహించారు. అనంతరం పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, పరిమళాలు వెదజల్లే పూలమాలలతో స్వామీజీని అలంకరించారు. పట్టువస్త్రాలు చుట్టి, అమ్మవారి కుంకుమను దిద్దారు. భక్తులందరూ చూసేందుకు వీలుగా ఎత్తైన బల్లపై భౌతిక కాయాన్ని కూర్చోబెట్టారు. చుట్టూ విజయేంద్ర స్వామీజీ, పండితులు, ముఖ్యమైన శిష్యులు నిలబడి అధిష్టాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మఠం ఆచారాల ప్రకారం, సనాతన సంప్రదాయాల ప్రకారం 13 అడుగుల లోతు, 15 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో గొయ్యి తీశారు. ధ్యానముద్రలో ఉన్న స్వామి పార్థివదేహాన్ని సింహాసనం లాంటి కుర్చీలో కూర్చోబెట్టి గొయ్యిలోకి మెల్లిగా దించారు. ఈ సమాధిలో పూలు, వాసంబు (ఔషధ మొక్క), చందనం చెక్కలతోపాటు పలు సుగంధ ద్రవ్యాలు, ఉప్పు, ఇసుక వంటి వాటితో నింపేశారు. ఆపైన రాహుకాలం ప్రవేశించే 10.30 గంటలకు ముందే అశేష భక్త జనావళి సమక్షంలో స్వామీజీ భౌతిక కాయాన్ని బృందావన ప్రవేశం చేశారు. ఈ ప్రక్రియకు ముందు స్వామీజీకి ప్రియ శిష్యుడిని ఎంపిక చేసి ఆయన చేతుల మీదుగా నారికేళంతో కపాలమోక్షం చేయించారు. కార్యక్రమానికి హాజరైన వందలాది మంది ప్రజలు -
హరిసర్వోత్తమ.. వాయుజీవోత్తమ
– శ్రీమఠంలో కనుల పండువగా మధ్యారాధన – పవిత్రంగా మహా పంచామృతాభిషేకం – రమణీయంగా సాగిన బంగారు రథోత్సవం మంత్రాలయం : హరిసర్వోత్తమ.. వాయుజీవోత్తమ నామస్మరణతో శనివారం శ్రీమఠం మారుమోగింది. శ్రీరాఘవేంద్రస్వామి సప్తరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం మధ్యారాధన ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు నేతృత్వంలో రాఘవేంద్రుల మూల బృందావనానికి మహా పంచామృతాభిషేకం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయల పాదాలకు కనకాభిషేకం, మూల,జయ, దిగ్విజయ రాముల పూజోత్సవం మైమరిపించింది. భక్తజనం రాయరు నామస్మరణ పఠిస్తుండగా రాయరు బందావన ప్రతిమ, పరిమళ న్యాయ సుధాగ్రంథాన్ని బంగారు రథంపై కొలువుంచారు. పీఠాధిపతి హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. భారీ భక్తజన సందోహం మధ్య రథయాత్ర శ్రీమఠం మాడవీధుల్లో రమణీయంగా సాగింది. భక్తులు రాఘవేంద్రస్వామి దర్శనార్థం 5 గంటల పాటు క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. రాత్రి గజవాహనంపై ఉత్సవమూర్తిని అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఊంజల సేవ, దివిటీ సేవలో పీఠాధిపతి తరించారు. రాఘన్నకు వెంకన్న పట్టు వస్త్రాలు .. ఆనవాయితీ ప్రకారం శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రాఘవేంద్రస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపం నుంచి గజరాజు, పూర్ణకుంభం, మంగళవాయిద్యాలతో పట్టువస్త్రాలకు ఘన స్వాగతం పలికారు. ఊరేగింపుగా శ్రీమఠం చేరుకోగా పీఠాధిపతి ఎదురుగా వెళ్లి సాదరంగా ఆహ్వానించారు. టీటీడీ అధికారి గురురాజారావు నుంచి పట్టువస్త్రాలు స్వీకరించి శిరస్సుపై ఉంచుకుని ఊరేగారు. కనువిందు చేసిన కళా ప్రదర్శనలు.. మధ్యారాధన సందర్భంగా కర్ణాటక డప్పువాయిద్య కళాకారుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యోగీంద్ర మండపంలో మోహన్ ఆలపించిన భక్తిగేయాలు ఆధ్యాత్మికంలో ముంచెత్తాయి. కార్యక్రమంలో ఆప్తకార్యదర్శి సుయమీంద్రాచార్, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, ధార్మిక సహాయక అధికారి వ్యాసరాజాచార్ పాల్గొన్నారు.