
రచయిత శ్రీధర్ సీపాన దర్శకునిగా పరిచయమవుతోన్న చిత్రం ‘బృందావనమది అందరిది’. హర్షవర్ధన్ రాణే, రిచా పణయ్, ఎంపీ శివప్రసాద్, హీరా సాహిలి ముఖ్య తారలుగా శ్రీనివాస్ వంగల, ప్రభాకర్‌రెడ్డి కూతురు (యన్.ఆర్. ఐ) నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శ్రీధర్ సీపాన మాట్లాడుతూ –‘‘వైజాగ్ బీచ్‌లో వేయించిన హీరోయిన్ ఇంటి సెట్‌తో పాటు, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ పూర్తి చేశాం. ఔట్‌పుట్ చాలా బాగా వచ్చింది.
పని పరంగా నాకు పూర్తి సంతృప్తి అనిపించింది. తొలి చిత్రం అనే భయం నాకు కలగకుండా నటీనటులు, సాంకేతిక నిపుణులు సహకరిస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. మా ఫస్ట్ షెడ్యూల్ మేకింగ్ అండ్ శాంపిల్ వీడియో టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్ నాకు మరింత ధైర్యం ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి బెంగళూర్‌లో ఓ షెడ్యూల్, ఆ తర్వాత హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ జరుపుతాం’’ అన్నారు. బెనర్జీ, పృ«థ్వీ, ‘సత్యం’ రాజేష్, ‘తాగుబోతు’ రమేష్, భద్రం, ‘అదుర్స్’ రఘు, రజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: తమ్మ శ్యామ్.
Comments
Please login to add a commentAdd a comment