
హీరోయిన్ రిచా పల్లాడ్ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ నువ్వే కావాలి హీరోయిన్ అంటే టక్కున గుర్తుపడతారు. విజయభాస్కర్ దర్శకత్వంలో తరుణ్, రిచా జంటగా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రేమకథాచిత్రం వచ్చి దాదాపుగా 22 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఈ సినిమాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
ఇక నువ్వేకావాలి సినిమాలో పక్కింటి అమ్మాయిలా కనిపించిన రిచాకు ఈ సినిమాతోనే క్రేజ్ దక్కింది. అయితే ఆ తర్వాత ఆడపాదడపా సినిమాలు చేసినా కెరీర్‌లో నిలదొక్కుకోలేకపోయింది. ఇక 2011లో హిమాన్షు బజాజ్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. రిచాకు ఒప్పుడు ఒక బాబు కూడా ఉన్నాడు. 2016లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన రిచా చివరగా ఆది పనిశెట్టి నటించిన మలుపు అనే చిత్రంలో కనిపించింది.
ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు తెలుగులో ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం భర్తకు సాయంగా ఉంటూ కుటుంబ బాధ్యతలు పోషిస్తున్న రిచా సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ రిచా నిత్యం ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment