'అహింస' నుంచి మరో లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ | Kammaguntadhey Lirical Song From Ahimsa Movie Out | Sakshi
Sakshi News home page

Ahimsa Movie : 'అహింస' నుంచి మరో లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌

Published Sun, Oct 16 2022 10:19 AM | Last Updated on Sun, Oct 16 2022 10:20 AM

Kammaguntadhey Lirical Song From Ahimsa Movie Out - Sakshi

దగ్గుబాటి అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు డైరెక్టర్‌ తేజ. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో అహింస అనే చిత్రం తెరకెక్కతుతున్న సంగతి తెలిసిందే. ప్రేమ‌క‌థ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో గీతికా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై పీ కిర‌ణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే టీజర్‌ను విడుదల చేసిన మేకర్స్‌.. తాజాగా ఈ చిత్రం నుంచి కమ్మగుంటదే పిల్లా అనే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు.

చంద్ర బోస్ సాహిత్యం అందించిన ఈ పాటని కాలభైరవ – కీర్తన శ్రీనివాస ఆలపించారు. గ్రామీణ ప్రాంత నేపథ్యంలోని లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకుంటుంది. సదా, సముద్రఖని ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement