
హ్యాపీ బర్త్ డే- 30-05-15
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: పరేష్ రావల్ (నటుడు),
కె.ఎస్.రవికుమార్ (దర్శకుడు)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 7. వీరు ఈ సంవత్సరమంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. విదే శాలలో చదువుకోసం, ఉద్యోగాలకోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు ఇది మంచి సమయం. వేదపండితులకు, గురువులకు, న్యూమరాలజిస్టులకు, జ్యోతిష్యులకు మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
దీర్ఘకాలికంగా బాధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి బయట పడతారు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సంభాషణలలో సంయమనం పాటించడం మంచిది. మీ మాటకు విశేష ఆదరణ లభిస్తుంది. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి తగ్గి, ఆధ్యాత్మిక తపై అనురక్తి పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఆచితూచి వ్యవహరించడం అవసరం.
లక్కీ నంబర్స్: 1, 2, 3,7 లక్కీ కలర్స్: ఎల్లో, వైట్, సిల్వర్, గ్రే లక్కీ డేస్: ఆది, సోమ, గురువారాలు సూచనలు: గురువులను, పండితులను గౌరవించాలి. వేదపాఠశాలలకు, మదరసాలకు ఆర్థిక సాయం అందించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దక్షి ణామూర్తిని ఆరాధించాలి.
- డాక్టర్ మహమ్మద్ దావూద్, సంఖ్య, జ్యోతిష శాస్త్ర నిపుణులు