![BJP Does Not Give MP Ticket To Paresh Rawal - Sakshi](/styles/webp/s3/article_images/2019/04/4/paresh.jpg.webp?itok=KlUfOIq6)
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ విలక్షణ నటుడు, తూర్పు అహ్మదాబాద్ ఎంపీ పరేష్ రావల్‌కు బీజేపీ అధిష్టానం ఈసారి టికెట్ నిరాకరించింది. ఆయనకు బదులుగా హస్ముక్ ఎస్ పటేట్‌కు తూర్పు అహ్మదాబాద్ టికెట్ కేటాయిస్త్నుట్లుగా బుధవారం ప్రకటించింది.
పటేల్ బీజేపీ తరఫున 2012, 2017 లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిధ్యం వహించారు. పటేల్ అనూహ్యంగా తూర్పు అహ్మదాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా ఈ సార్వత్రిక ఎన్నికల బరిలో దిగనున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాను తూర్పు అహ్మదాబాద్ బరిలో ఉండబోనని పరేష్ రావల్ తెలిపారు. గత నాలుగైదు మాసాల ముందు నుంచే ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన ఓ సందర్భంలో అన్నారు.
కానీ బీజేపీ పార్టీ అధిష్టానం ఎన్నికల బరిలో నిలవాలని ఆదేశిస్తే తప్పకుండా ఏ స్థానం నుంచి అయినా పోటీ చేయడనికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment