మనది కాక, సోమాలియా జాతీయగీతం వింటారా?
న్యూఢిల్లీ: దేశంలోని థియేటర్లన్నింటిలోనూ సినిమా ప్రదర్శించేముందు తప్పకుండా జాతీయగీతాన్ని ప్రదర్శించాలని సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో థియేటర్ తెరపై జాతీయ జెండాను చూపించాలని, థియేటర్‌లోని ప్రతి ఒక్కరూ లేచినిలబడి జాతీయ గీతాన్ని గౌరవించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
థియేటర్లలో జాతీయ గీతం విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు స్వాగతిస్తుండగా.. దేశభక్తి ప్రదర్శించుకోవడానికి థియేటర్ల వేదిక కావాలా? అని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ పరేశ్ రావల్ స్పందించారు. ‘థియేటర్లలో జాతీయగీతాన్ని ప్రదర్శించాల్సిందే. జాతీయ జెండా చూపించాల్సిందే. మనది కాకుంటే సోమాలియా జాతీయగీతాన్ని వినిపించాలా?’ అని ఆయన ప్రశ్నించారు.