400 ఏళ్లు వెనక్కి! | Mammootty Kunjali Marakkar IV teaser for Eid? | Sakshi
Sakshi News home page

400 ఏళ్లు వెనక్కి!

Published Sat, May 26 2018 12:25 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Mammootty Kunjali Marakkar IV teaser for Eid? - Sakshi

మోహన్‌లాల్

సముద్రయానం చేయడం అంత ఈజీ కాదు. ప్రకృతి ప్రభావం వల్ల సముద్రంలో ఎప్పుడు ఆటుపోట్లు వస్తాయో ఊహించడం కష్టం. ఫర్లేదు... అంతా సిద్ధం చేసుకునే రంగంలోకి దిగుతాం అంటున్నారు డైరెక్టర్‌ ప్రియదర్శన్‌. ఆయన దర్శకత్వంలో రూపొందనునున్న సినిమా ‘మరక్కార్‌: ద లయన్‌ ఆఫ్‌ అరేబియన్‌ సీ’. నావెల్‌ చీఫ్‌ కుంజాలి మరక్కార్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందనుంది. ఇందులో మోహన్‌లాల్, నాగార్జున, పరేష్‌ రావల్, సునీల్‌ శెట్టి నటించనున్నారని సమాచారం.

‘‘16వ శతాబ్దం నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా ఈ సినిమాపై వర్క్‌ చేస్తున్నాను. మోస్ట్‌ ఎక్స్‌పెన్సీవ్‌ ఫిల్మ్‌. ఎక్కువ శాతం నీటిపై చిత్రీకరించనున్నాం. సినిమాలో బ్రిటిష్‌ యాక్టర్లు కీలక పాత్రలు చేయనున్నారు. చైనీస్‌ యాక్టర్స్‌  కూడా ఉంటారు. ఇండియన్‌ నేవీకి ఈ సినిమా నా ట్రిబ్యూట్‌’’ అన్నారు ప్రియదర్శన్‌. ఈ నెలాఖర్లో నటీనటులందరికీ ఫైనల్‌ నరేషన్‌ ఇచ్చిన తర్వాత, జూలైలో చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందట. అంతేకాదు ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కించాలని చిత్రబృందం అనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement