ప్రముఖ నటుడు పరేశ్ రావల్ అత్తయ్య డాక్టర్ మృదుల సంపత్(92) ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సోమవారం (ఏప్రిల్ 3న) నాడు ఆమె మరణించగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పరేశ్ రావల్ సతీమణి సంపత్ రావల్.. సోషల్ మీడియాలో తల్లిని గుర్తు చేసుకుంటూ ఆమె ఫోటో షేర్ చేసింది.
కాగా పరేశ్ రావల్ విషయానికి వస్తే.. అతడు 'అర్జున్' సినిమాతో వెండితెరపై తెరంగేట్రం చేశాడు. 'నామ్' చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. 1980-90 మధ్య కాలంలో దాదాపు వంద చిత్రాలు చేశాడు. రూప్‌కీ రాణి చరణ్ కా రాజా, కబ్జా, కింగ్ అంకుల్, రామ్ లకణ్, దావూద్, బాజీ సినిమాల్లో విలన్‌గానూ నటించాడు. హీరా ఫేరి సినిమాతో మంచి మార్కులు పట్టేశాడు. హిందీలో ఎన్నో సినిమాలు చేసిన ఆయన తెలుగులో శంకర్‌దాదా ఎంబీబీఎస్ సహా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. సినీరంగంలో ఆయన చేసిన సేవలకుగానూ 2014లో ఆయనకు పద్మశ్రీ అవార్డు వరించింది.
Comments
Please login to add a commentAdd a comment