
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో నేడు (సోమవారం) లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ ఓటింగ్ కొనసాగుతోంది. దేశంలోని ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ తన ఓటు హక్కు వినియోగంచుకోవడంతో పాటు ఓటర్లందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
నటుడు పరేష్ రావల్ తన నటనతో కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన పరేష్ రావల్ ఓటు వేయని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చాలామంది ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఆరోపిస్తుంటారు. అయితే మన వంతుగా ఓటు వేయడం అనేది మన బాధ్యత. ఓటు వేయకుంటే దాని పర్యవసానం కూడా మనమే ఎదుర్కొంటాం. దానికి ప్రభుత్వం బాధ్యత వహించదు’ అని పరేష్ రావల్ పేర్కొన్నారు.
#WATCH | Bollywood actor Paresh Rawal says, "...There should be some provisions for those who don't vote, like an increase in tax or some other punishment." pic.twitter.com/sueN0F2vMD
— ANI (@ANI) May 20, 2024