బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ఇది శనివారం తీరం దాటనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని సముద్రతీర జిల్లాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు అప్రమత్తమయ్యూరు. సహాయక చర్యల్లో నిమగ్నమయ్యూరు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు అక్టోబర్ 21 నుంచి ప్రారంభమయ్యూరుు. నెలరోజులు కావస్తున్నా చెప్పుకోతగ్గ వర్షాలు కురవలేదు. ఇదిలావుండగా బంగాళాఖాతంలో రెండురోజుల క్రితం చెన్నైకి ఆగ్నేయంలో 550 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమేణా తుపానుగా రూపాంతరం చెందింది. శుక్రవారం నాటికి నాగపట్నం నుంచి ఈశాన్య దిశగా పయనించి 420 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయువ్య దిశగా పయనించి శనివారం నాటికి నాగపట్నం వద్ద తీరందాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలోని సముద్ర తీర జిల్లాల్లో 48 గంటల పాటు భారీ వర్షాలు కురవనున్నారుు. 45 కిలో మీటర్ల నుంచి 60 కి.మీ వేగంతో ఈదురు గాలులతో పాటు 25 సెం.మీ వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఈ నేపథ్యంలో చెన్నై, ఎన్నూరు, కడలూరు, నాగపట్నం, పుదుచ్చేరిల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని అంచనావేసింది. ఈ మేరకు ఆయూ జిల్లాల కలెక్టర్లు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. పాఠశాలలు, కాలేజీలు, కల్యాణ మండపాలను వరద బాధితులకు సిద్ధం చేశారు. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సముద్రతీర గస్తీ దళాలు, పోలీసు స్టేషన్లు, విమాన సిబ్బందికి ఆదేశాలు అందాయి. నాగపట్నం జిల్లా కలెక్టర్ మునుస్వామి శుక్రవారం అధికారులతో సమావేశమయ్యూరు. తుపాను పరిస్థితిపై సమీక్షించారు. కలెక్టర్ కార్యాలయంలో సమాచార కేంద్రాన్ని ప్రారంభించారు. బాధితుల సహాయూర్థం 1077 ఫోన్ నంబరును సమకూర్చారు. కారైక్కాల్ జిల్లా కలెక్టర్ ముత్తమ్మ తుపాను పరిస్థితిపై సమీక్షించారు. 1077, 222707 ఫోన్ నంబర్లతో సహాయక కేంద్రాలను ప్రారంభించారు. పుదుచ్చేరీలో 16 సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయి. నాగపట్నం ఒకటో నంబరు, కడలూరు, పుదుక్కొట్టై, కారైక్కాల్‌లలో రెండవ నంబరు తుపాను హెచ్చరికను ఎగురవేశారు. సముద్రతీర జిల్లాల్లోని జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని నిషేధాజ్ఞలు జారీచేశారు.
తుపాను టెన్షన్
Published Sat, Nov 16 2013 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
Advertisement
Advertisement