ముంచుకొస్తున్న ‘వార్దా’
Published Fri, Dec 9 2016 2:54 AM | Last Updated on Mon, Sep 4 2017 10:14 PM
జంగారెడ్డిగూడెం : వార్దా తుపాను నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సెలవుల ను కలెక్టర్ కాటంనేని భాస్కర్ రద్దుచేశా రు. రెండో శనివారం (10వ తేదీ), ఆది వారం (11వ తేదీ)సెలవులను కలెక్టర్ రద్దుచేసి అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం బలపడి వాయిగుండంగా ఏర్పడి తుపానుగా మారనున్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది. దీనికి వార్దాగా నామకరణం చే శారు. తుపాను అవకాశాలు బలంగా ఉ న్న నేపథ్యంలో చేపలవేటకు వెళ్లరాదని మత్స్యకారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు సమాచారం కోసం కలెక్టరేట్‌లో 08812 230050 నంబరుతో కం ట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ని అన్ని తహసిల్దార్ కార్యాలయాల్లో కం ట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఒకవేళ తుపాను ఉధృతమైతే ఎదుర్కొనేం దుకు అవసరమైన సామగ్రి, నిత్యావసర వస్తువులు సిద్ధం చేసుకోవాలని ముం దస్తు చర్యలకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
రైతుల్లో ఆందోళన
వార్దా తుపాను నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో వరి పంట చాలా చోట్ల పనలపైనా, కుప్పలపైనా ఉంది. 90 శాతం వరికోతలు పూర్తవగా మరో 10 శాతం కోతలు కోయాల్సి ఉంది. కోసిన పంట కళ్లాలపై ఉంది. సుమారు 11 వేల హెక్టార్లలో వరి పంట కళ్లాలపైనా, కుప్పలపైనా ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 23 వేల హెక్టార్లలో వరి కోతలు జరగాల్సి ఉంది. దీంతో రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. మొక్కజొన్న, పప్పు ధా న్యాలు, పత్తి పంటలకూ నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. మెట్ట ప్రాంతంలో వర్జీనియా, నాటు పొగాకును సుమారు 20 వేల హెక్టార్లలో రైతులు వేశారు. వర్షం తీవ్రత అధికంగా ఉంటే ఈ పంటలకు నష్టం సంభవిస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉద్యానశాఖ పంటలకు కూడా నష్టం సంభవించే అవకాశం ఉంది. గాలులు అధికంగా వీస్తే గెలలపై ఉన్న అరటి, తాత్కాలిక పందిళ్లపై ఉన్న కూరగాయల పంటలకు కూడా నష్టం సంభవించే అవకాశం ఉంది.
రైతులు అప్రమత్తం కండి
ఏలూరు (మెట్రో): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో రెండు రోజుల్లో జిల్లాకు తుపాను వచ్చే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి ఓ ప్రకటనలో సూచించారు. వాతావరణ కేంద్రం సూచనల మేరకు రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు తమ పొలాల్లో వరి కుప్పలను నూర్చుకుని దగ్గరలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలని లేదా జాగ్రత్త చేసుకోవాలని పేర్కొన్నారు. రైతులు తమ పంటలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిత్యావసరాలు నిల్వ ఉంచాలి: డీఎస్‌వో
ఏలూరు (మెట్రో): బంగాళాఖాతంలో ఏర్పడిన వార్దా తుపాను బలపడి పెను తుపానుగా మారనున్న నేపథ్యంలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉం దని, ఈ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డీలర్లు నిత్యావసరాల నిల్వలు ఉంచుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి డి.శివశంకరరెడ్డి ఓ ప్రకటనలో కోరారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ రిటైల్ డీలర్లు పూర్తిస్థాయిలో నిల్వలు ఉంచుకోవాలని, ప్రతి బంకులో 500 లీటర్ల పెట్రోల్, 2 వేల లీటర్ల డీజిల్ ప్రభుత్వ అవసరాలకు రిజర్వుగా ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో సముద్ర తీర ప్రాంతమైన నరసాపురం డివిజ¯ŒSలోని అన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాలు రెవెన్యూ అధికారుల సూచనలు పాటించాలన్నారు. జిల్లాలో ఎల్‌పీజీ డీలర్లు కనీసం వారం రోజులకు సరిపడా గ్యాస్ సిలెండర్ల రీఫిల్స్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కిరోసి¯ŒS డీలర్లు కూడా నిల్వలను ఉంచుకోవాలని సూచించారు.
Advertisement