సాక్షి, అమరావతి: టీడీపీ సర్కార్ అవినీతి, నిర్వహణ లోపంతో తుప్పుపట్టి వరద ఉధృతికి కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు స్థానంలో అధికారులు సీఎం జగన్ ఆదేశాల మేరకు ఆదివారం హుటాహుటిన స్టాప్‌లాగ్ గేటును ఏర్పాటుచేశారు. దీంతో ప్రాజెక్టులో 0.75 టీఎంసీలు కడలిపాలు కాకుండా అడ్డుకట్ట వేశారు. ప్రాజెక్టులో 1.1 టీఎంసీల నిల్వకు మార్గం సుగమం చేశారు.
నీరు నిల్వ ఉన్నా.. వరద కొనసాగుతున్నా..
మిచాంగ్ తుపాను ప్రభావంవల్ల ప్రకాశం జిల్లాలో విస్తారంగా కురిసిన వర్షాలతో గుండ్లకమ్మ వరదెత్తింది. ఈ ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరగడంతో అప్పటికే తుప్పుపట్టిన రెండో గేటు 8న కొట్టుకుపోయింది. నిజానికి.. ఇలా కొట్టుకుపోయిన గేటు స్థానంలో స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటుచేయాలంటే సాధారణంగా ప్రాజెక్టులో నీటిని ఖాళీచేస్తారు.
డెడ్ స్టోరేజీ స్థాయికి నీటినిల్వ చేరాక.. వరద ప్రవాహం తగ్గాక స్టాప్‌లాగ్ గేటును ఏర్పాటుచేస్తారు. కానీ.. ప్రాజెక్టులో నీరునిల్వ ఉన్నా.. వరద కొనసాగుతున్నా.. సీఈ మురళీనాథ్‌రెడ్డి సారథ్యంలో అధికారులు శ్రమించి కొట్టుకుపోయిన రెండో గేటు స్థానంలో ఒక్కో ఎలిమెంట్‌ను దించుతూ స్టాప్‌లాగ్ గేటును విజయవంతంగా ఏర్పాటుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment