వేగంగా వెళ్తున్న క్రూజర్(తుఫాన్) వాహనం అదుపుతప్పి దవళేశ్వరం వద్ద గోదావరి నదిలో పడింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన శనివారం తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని దవళేశ్వరం వద్ద జరిగింది. విశాఖ జిల్లా అచ్యుతాపురం గ్రామానికి చెందిన వారు తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తిరగి తమ స్వస్థలానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. క్రూజర్ వాహనం అదుపు తప్పి బ్రిడ్జిపై నుంచి నదిలో పడటంతో నుజ్జునుజ్జయిందిది. దీంతో వాహనంలో ఉన్న 9 మంది మహిళలు, ఆరుగురు పురుషులు, 6 చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ల సహాయంతో వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదం నుంచి ఒక పాప, ఒక బాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతానికి పాప షాక్‌లో ఉన్నట్లు సమాచారం.
Published Sat, Jun 13 2015 7:28 AM | Last Updated on Thu, Mar 21 2024 6:38 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement