
సాక్షి, హైదరాబాద్ : తిత్లీ తుపాను కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలను తక్షణం ఆదుకోవాలని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ రెండు జిల్లాల్లో తిత్లీ తుపాను తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిందని, ప్రాణ నష్టం కూడా సంభవించిందని ఆయన అన్నారు. తక్షణమే సహాయ, పునరావాస చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని జగన్ పిలుపు నిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment