జంజీర్, తుఫాన్ ప్రదర్శన కేంద్రాలకు భదత్ర కల్పించాలి
ఈ నెల 6న విడుదల కానున్న జంజీర్, తుఫాన్ సినిమాల ప్రదర్శన కేంద్రాలకు తగిన భద్రత కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రిలయన్స్ బిగ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది. ‘విభజన’ ఆందోళన వల్ల ఈ సినిమాల ప్రదర్శనకు ఆందోళనకారులు ఇబ్బందులు సృష్టిస్తే, తాము తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని బుధవారం దాఖలు చేసిన పిటిషన్లో ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శిబాశిష్ సర్కార్ ఆందోళన వ్యక్తం చేశారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను ప్రతివాదులుగా చేర్చారు. చట్ట వ్యతిరేక శక్తులు ఈ సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటామని ప్రకటించాయన్నారు.