దయనీయ స్థితిలో నటుడు ఫిష్ వెంకట్.. రెండు కిడ్నీలు ఫెయిల్ | Telugu Actor Fish Venkat Present Situation News | Sakshi
Sakshi News home page

Fish Venkat: దాతల సహాయం కోసం నటుడి ఎదురుచూపులు

Published Wed, Sep 4 2024 8:05 AM | Last Updated on Wed, Sep 4 2024 9:16 AM

Telugu Actor Fish Venkat Present Situation News

గత కొన్నాళ్లలో తెలుగు సినిమాల్లో విలన్ అంటే కొందరు గుర్తొస్తారు. అలాంటి వాడే ఫిష్ వెంకట్. మెయిన్ విలన్ పక్కన ఉండే పాత్రలో బోలెడన్ని మూవీస్ చేశారు. ఎన్టీఆర్ 'ఆది' మూవీలో తొడకొట్టు చిన్నా అనే డైలాగ్‌తో తెగ పాపులర్ అయ్యారు. టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలందరితోనూ చేసిన ఈ నటుడు.. ఇప్పుడు దయనీయ స్థితిలో ఉన్నాడు. దాతలు ఎవరైనా సరే సాయం చేస్తే ఆరోగ్యాన్ని కాస్త బాగుచేసుకుందామని చూస్తున్నాడు.

ఓ యూట్యూబ్ ఛానెల్ రీసెంట్‌గా ఫిష్ వెంకట్‌ని అతడి ఇంటికెళ్లి మరీ ఇంటర్వ్యూ చేసింది. అసలు ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదు? ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయాల్ని అడిగి తెలుసుకుంది. అలా సదరు నటుడి దయనీయ పరిస్థితి బయటపడింది. రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉండాల్సి వస్తోందని, ఖర్చులకు డబ్బుల్లేక ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలోనే వైద్యం చేసుకుంటున్నానని చెప్పాడు.

(ఇదీ చదవండి: Bigg Boss 8: మొదటి వారం నామినేషన్‌లో ఉన్నది వీళ్లే!)

'ఓ రోజు ఆయాసం బాగా వచ్చేసరికి ఆస్పత్రికి వెళ్లాను. వారం రోజుల ట్రీట్‌మెంట్ తర్వాత డయాలసిస్ అవసరమని డాక్టర్లు చెప్పారు. అదేంటో మాకు తెలీదు. దాంతో నిమ్స్‌‌లో జాయిన్ అయ్యాను. అక్కడే ఏడాదిన్నరగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. కాలికి చిన్న దెబ్బ తగిలింది. మరోవైపు బీపీ, షుగర్ రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఆపరేషన్ చేశారు. ఇదంతా నాలుగేళ్ల క్రితం మాట'

'అప్పటి నుంచి నా పరిస్థితి పూర్తిగా ఇలా అయిపోయింది. రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. అనారోగ్యం ఎన్ని సినిమా ఛాన్సులు వచ్చినా.. వెళ్లలేకపోతున్నాను. ఖర్చులకు డబ్బులు కూడా ఉండటం లేదు. దీంతో గాంధీ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నాను' అని ఫిష్ వెంకట్ చెప్పుకొచ్చాడు. ఇతడి దీనస్థితి చూసి నెటిజన్లు చలించిపోతున్నారు. ఎవరైనా సాయం చేస్తే బాగుండు అని కామెంట్లు చేస్తున్నారు.

(ఇదీ చదవండి: మరో స్టార్ హీరోపై లైంగిక ఆరోపణలు.. కేసు పెట్టిన నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement