Bigg Boss 8: మొదటి వారం నామినేషన్‌లో ఉన్నది వీళ్లే! | Bigg Boss 8 Telugu Sep 3rd Full Episode Review: Nominated Contestants List | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Day 2 Highlights: ఫస్ట్‌ వీక్‌ నామినేషన్‌లో ఉంది వీళ్లే! అతడికే ఎక్కువ ఓట్లు..

Published Tue, Sep 3 2024 11:22 PM | Last Updated on Wed, Sep 4 2024 9:42 AM

Bigg Boss 8 Telugu Sep 3rd Full Episode Review: Nominated Contestants List

బిగ్‌బాస్‌ హౌస్‌ను కంటెస్టెంట్లు మొదటిరోజే చేపలమార్కెట్‌ చేసేశారు. టాస్కులు గెలిచి చీఫ్‌లుగా అధికారంలోకి వచ్చిన నిఖిల్‌, సోనియా.. ఏకాభిప్రాయంతో యష్మిని మూడో చీఫ్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే! స్నేహితురాలన్న కారణంతోనే యష్మిని చీఫ్‌గా ఎన్నుకున్నారని సోనియా చాలాసేపు వాదించింది.

గగ్గోలు పెట్టిన సీత
మరోవైపు ఎగ్‌ బుర్జీ చేసుకుంటానంటే బేబక్క ఒప్పుకోవడం లేదని సీత బుంగమూతి పెట్టింది. అలాగే తనను కిచెన్‌ టీమ్‌లో నుంచి కావాలనే సైడ్‌ చేశారని గగ్గోలు పెట్టింది. అలాంటిదేమీ లేదని నిఖిల్‌ నచ్చజెప్పినా అస్సలు వినిపించుకోలేదు. ఇంతలో బిగ్‌బాస్‌ నామినేషన్‌ అనే ప్రక్రియతో అసలైన గొడవ మొదలుపెట్టాడు. నామినేట్‌ చేయాలనుకున్న వ్యక్తుల ఫోటోలను బండరాయికి తగిలించాలని చెప్పాడు.

చీఫ్‌లకు మినహాయింపు
చీఫ్‌లకు నామినేషన్‌ నుంచి మినహాయింపు ఇచ్చాడు. అలాగే హౌస్‌మేట్స్‌ ఇద్దరిని చొప్పున నామినేట్‌ చేస్తే అందులో ఒకరి సేవ్‌ చేస్తూ మరొకిరిని నామినేట్‌ చేసే అధికారం చీఫ్‌లకు ఉందని పేర్కొన్నాడు. మొదటగా సోనియా... కిచెన్‌లో బాధ్యతారాహిత్యంగా ఉన్నారంటూ బేబక్కను నామినేట్‌ చేసింది. కుక్కర్‌ పని చేయకపోయినా అది నా తప్పేనా? అని బేబక్క సమాధానమిస్తుంటే తననసలు మాట్లాడనివ్వలేదు. బేబక్కను పూర్తిగా మాట్లాడనివ్వు అని చీఫ్‌లు కలగజేసుకున్న పాపానికి మీరేమీ జడ్జిలు కాదంటూ వారి నోరు కూడా మూయించింది.

సోనియా వర్సెస్‌ ప్రేరణ
అనంతరం ప్రేరణను నామినేట్‌ చేస్తూ.. ఇదేం పిక్నిక్‌ కాదు, ఇక్కడ నువ్వు ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నావేమో.. కానీ, అవతలివారికి కోపం వచ్చినప్పుడు మధ్యలో వచ్చి ఆపే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఈ క్రమంలో ప్రేరణ.. తనతో పెద్ద గొడవే పెట్టుకుంది. చీఫ్‌ యష్మి.. వారిద్దరిలో బేబక్క నామినేషన్‌కు పచ్చజెండా ఊపింది.

నాగమణికంఠకు ఎక్కువ ఓట్లు
నబీల్‌.. ఎవరితో కలిసిపోవట్లేదంటూ నాగమణికంఠను, తనతో ఎక్కువ కనెక్ట్‌ కాలేదంటూ బేబక్కను నామినేట్‌ చేశాడు. యష్మి పరిగెత్తుకుంటూ వచ్చి నాగమణికంఠ ఫోటోపై కత్తిగుచ్చి అతడి నామినేషన్‌ను ఫైనలైజ్‌ చేసింది. అనంతరం శేఖర్‌ బాషా.. నాగమణికంఠ, బేబక్కల ఫోటోలను బండరాయిపై అతికించాడు. చీఫ్‌ నైనిక.. వీరిలో నాగమణికంఠను నామినేట్‌ చేసింది.

సాయం చేయలేదంటూ
తర్వాత బేబక్క.. నబీల్‌ను నామినేట్‌ చేసింది. తనకు కిచెన్‌లో సాయం చేయలేదంటూ పృథ్వీ ఫోటోను బండరాయికి అతికించింది. అయితే సీత.. అతడు కిచెన్‌లో బోళ్లు తోమాడంటూ పక్కనుంచి ఉప్పందించింది. ఇది చూసిన నిఖిల్‌.. మధ్యలో నువ్వు మాట్లాడొద్దని ఫైరయ్యాడు. అనంతరం అతడు పృథ్వీ నామినేషన్‌ను ఫైనల్‌ చేశాడు.

నామినేషన్స్‌లో ఎవరంటే?
ఈ నామినేషన్‌ పర్వం రేపటి ఎపిసోడ్‌లోనూ కొనసాగనుంది. అయితే ఈపాటికే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ ప్రక్రియ ముగియడంతో నామినేషన్‌ లిస్టు బయటకు వచ్చేసింది. అందులో పృథ్వి, నాగమణికంఠ, శేఖర్‌ బాషా, విష్ణుప్రియ, సోనియా, బేబక్క ఉన్నట్లు తెలుస్తోంది. మళ్లీ వీరిలో ఒకరిని సేవ్‌ చేసే అధికారం ఏమైనా చీఫ్స్‌కు ఇస్తారా? లేదంటే వీళ్లే నామినేషన్‌లో ఉంటారా? అనేది రేపు తేలనుంది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement