
హేమ కమిటీ.. మలయాళ ఇండస్ట్రీని గత కొన్నిరోజులుగా ఇరుకున పడేసింది. పలువురు ప్రముఖ నటులుపై లైంగిక ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై యాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్‌తో పాటు మిగతా సభ్యులు రాజీనామా చేయడం తదితర విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు 'ప్రేమమ్' సినిమాతో తెలుగోళ్లకు కూడా తెలిసిన హీరో నివీన్ పౌలీపై ఓ నటి పోలీస్ కేసు పెట్టింది.
(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం)
సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి గతేడాది నవంబరులో దుబాయి తీసుకెళ్లారట. అక్కడే లైంగికంగా వేధించారని సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు.. హీరో నివిన్ పౌలీ సహా ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఓ నిర్మాత కూడా ఉన్నారు. ఈ జాబితాలో నివిన్ ఆరో వ్యక్తి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్వయంగా నివిన్ స్పందించాడు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని చెప్పుకొచ్చాడు.
'ఓ అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెట్టాననే వార్తలు విన్నాను. వాటిలో ఏ మాత్రం నిజం లేదు. నాపై వచ్చిన నిరాధార ఆరోపణల్ని ఖండిస్తున్నాను. అవన్నీ నిజం కాదు. ఈ విషయమై నేను న్యాయంగా పోరాడుతా' అని ఇన్ స్టాలో నివిన్ పౌలీ పోస్ట్ పెట్టారు. 'ప్రేమమ్' మూవీతో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు.
(ఇదీ చదవండి: Bigg Boss 8: మొదటి వారం నామినేషన్‌లో ఉన్నది వీళ్లే!)
Comments
Please login to add a commentAdd a comment