Bigg Boss 8: చావు వరకు వెళ్లొచ్చా.. ఏడిపించేసిన నాగ మణికంఠ! | Bigg Boss 8 Telugu Day 3 Promo Naga Manikanta | Sakshi
Sakshi News home page

Bigg Boss 8 Promo: అపరిచితుడిలా ప్రవర్తిస్తున్న మణికంఠ.. ఒక్కోసారి ఒక్కోలా

Sep 4 2024 11:00 AM | Updated on Sep 4 2024 12:30 PM

Bigg Boss 8 Telugu Day 3 Promo Naga Manikanta

కిరాక్ సీత, బేబక్కని నామినేట్ చేసింది. రాత్రి చేసిన కూరల గురించి తిక్క పంచాయతీ పెట్టుకున్నారు. సోనియా.. విష్ణుప్రియని నామినేట్ చేసింది. అభయ్ నవీన్.. నాగ మణికంఠని నామినేట్ చేశాడు. ఇక ప్రేరణ కూడా నాగ మణికంఠనే నామినేట్ చేసింది. 'మీరు సీరియస్‌గా తీసుకోవట్లేదని నువ్వు ఎవరు చెప్పడానికి మా సీరియస్‌నెస్ మాకు తెలుసు' అని ప్రేరణ కౌంటర్ వేసింది.

ఇక అభయ్‌తో మాట్లాడుతూ.. నేను అన్‌ఫిట్ అయితే ఈ వారమే హౌస్ నుంచి వెళ్లిపోతాను అని మణికంఠ అన్నాడు. విష్ణుప్రియని నామినేట్ చేసిన నాగమణికంఠ.. ఈ మూడు రోజులతో నీతో ఎందుకు ట్రావెల్ చేశానంటే.. నువ్వు అసలు ఎలా మాట్లాడుతున్నావ్ అనేది చూస్తున్నా అని చెప్పగానే విష్ణుప్రియ షాకయింది. ఇందుకు నాతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నావ్ అని అవాక్కయింది.

(ఇదీ చదవండి: Bigg Boss 8 Day 2 Highlights: మొదటి వారం నామినేషన్‌లో ఉన్నది వీళ్లే!)

శేఖర్ భాషా అయితే నాగమణికంఠ అసలు రంగు బయటపెట్టాడు. ప్రతిదాన్ని రాజకీయం చేద్దామని చూస్తున్నావ్ అని చెప్పాడు. ఇలా అనేసరికి మనోడు కాస్త సైలెంట్ అయిపోయాడు. దీని తర్వాత నాగమణికంఠ ఎమోషనల్ అయ్యాడు. 'చావు దాకా వెళ్లి వచ్చా. మీరు చూడలేదు. నాన్నని పోగొట్టుకున్నా. సవతి తండ్రితో తిట్లు తిన్నాను. అమ్మ చనిపోయింది. కాల్చడానికి కట్టెలు లేక డబ్బులు అడుక్కున్నా' అని మణికంఠ ఎమోషనల్ కావడంతో యష్మి, ప్రేరణ ఏడ్చేశారు. అలా గొడవతో మొదలైన ప్రోమో.. ఏడుపులతో ఎండ్ అయింది.

ప్రోమో బట్టి చూస్తుంటే బుధవారం నాగమణికంఠ హైలైటె అయ్యేలా ఉ‍న్నాడు. అలానే అందరి టార్గెట్ కూడా మనోడే అయ్యాడనిపిస్తోంది. ఓవరాల్‌గా చూస్తే కష్టాలు పదే పదే చెప్పుకొని సింపతీ గేమ్ ఆడుతున్నాడనిపిస్తోంది. అసలేం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

(ఇదీ చదవండి: దయనీయ స్థితిలో నటుడు ఫిష్ వెంకట్.. రెండు కిడ్నీలు ఫెయిల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement