తెలుగులో తొలి మూవీ ప్లాఫ్.. ఇప్పుడు మరో క్రేజీ ఛాన్స్ | Bhagyashri Borse Pairs Up With Ram Pothineni For RAPO 22 Movie, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Bhagyashri Borse In RAPO22: సూపర్ బ్యూటీ.. ఫెర్‌ఫెక్ట్ హీరోతో

Nov 20 2024 12:56 PM | Updated on Nov 20 2024 1:21 PM

Bhagyashri Borse Into Ram Pothineni New Movie

సాధారణంగా హీరోయిన్లు నటించిన సినిమాలు ప్లాఫ్ అయితే కొత్తగా అవకాశాలు రావడం తక్కువ. అలాంటిది 'మిస్టర్ బచ్చన్' బ్యూటీకి మాత్రం క్రేజీ ప్రాజెక్టుల్లో ఛాన్సులు వస్తున్నాయి. భాగ్యశ్రీ.. తొలుత 'యారియన్ 2' అనే హిందీ మూవీలో చిన్న క్యారెక్టర్ చేసింది. రవితేజ మూవీతో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ అయిపోయింది. మూవీ డిజాస్టర్ అయినప్పటికీ.. భాగ్యశ్రీ డ్యాన్సులు, గ్లామర్‌కి మార్కులు పడ్డాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)

ఇప్పుడదే గ్లామర్ మరికొన్ని అవకాశాలు తీసుకొస్తోంది. ఇప్పటికే దుల్కర్ 'కాంత' సినిమాలో భాగ్యశ్రీ నటిస్తుండగా.. తాజాగా రామ్ పోతినేని కొత్త మూవీలోనూ ఈమెనే హీరోయిన్‌గా తీసుకున్నారు. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి మరీ ప్రకటించారు.

'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మూవీతో ఆకట్టుకున్న డైరెక్టర్ మహేశ్ బాబు.. రామ్-భాగ్యశ్రీ సినిమాని తీస్తున్నాడు. నవంబర్ 21న ఈ ప్రాజెక్ట్ లాంచ్ కాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 

(ఇదీ చదవండి: 'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ))

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement