కొత్త పాయింట్‌తో... | Gopichand, Srinu Vaitla next movie new shedule starts | Sakshi
Sakshi News home page

కొత్త పాయింట్‌తో...

Published Thu, Mar 28 2024 5:01 AM | Last Updated on Thu, Mar 28 2024 5:52 PM

Gopichand, Srinu Vaitla next movie new shedule starts - Sakshi

గోపీచంద్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయిన విషయం తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్‌తో కలిసి చిత్రాలయం స్టూడియోస్‌పై డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌ వేణు దోనేపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ బుధవారం ్రపారంభమైంది. ఈ సందర్భంగా వేణు దోనేపూడి మాట్లాడుతూ – ‘‘ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్‌ చేశాం.

దాంతో టాకీ పార్ట్‌ మొత్తం పూర్తవుతుంది. శ్రీను వైట్ల మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఒక కొత్త పాయింట్‌తో ఈ చిత్రం రూ΄÷ందుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్‌ ఒక కొత్త అవతారంలో కనిపిస్తారు. శ్రీను వైట్ల తీసిన బ్లాక్‌బస్టర్స్‌ చిత్రాలకు రచయితగా చేసిన గోపీ మోహన్‌ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు’’ అన్నారు. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్‌ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement