
గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం విశ్వం. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా బ్యానర్స్‌పై వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజైన టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఫస్ట్ సింగిల్ 'మొరాకో మగువా' కూడా మంచి హిట్‌గా నిలిచింది.
తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ సాంగ్ ని రిలీజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ మదర్ ఎమోషన్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసే హార్ట్ టచ్చింగ్ నంబర్ గా ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు.
(చదవండి: ఓటీటీలో 'దేవర'.. అన్ని రోజుల తర్వాతేనా?)
'అడుగే తడబడితే.. ఇదిగో.. నీ వెనకే ఉంటానులే.. చిన్నారి తల్లి! కలకో భయపడకు.. ఎపుడూ.. నీ కునుకై ఉంటానులే ..చిన్నారి తల్లి! మొండి తల్లి పిల్ల నువ్వు' అంటూ శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ మనసుని హత్తుకున్నాయి. సాహితీ చాగంటి తన లవ్లీ వోకల్స్ తో కట్టిపడేశారు.
మదర్, డాటర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ కథలోని ఎమోషనల్ డెప్త్ ని తెలియజేస్తోంది. ఈ పాటలో పాపతో హీరో గోపిచంద్ కు వున్న బాండింగ్ ని రివిల్ చేయనప్పటికీ వారి మధ్య వుండే ఎమోషన్ చాలా క్యురియాసిటీని పెంచింది. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment