కమ్‌బ్యాక్ కోసం ట్రైన్ కామెడీనే నమ్ముకున్న శ్రీనువైట్ల! | Srinu Vaitla's 'Viswam' Movie Telugu Teaser | Sakshi
Sakshi News home page

Srinu Vaitla: 'విశ్వం' మూవీ.. హిట్ కోసం వింటేజ్ ప్లానింగ్!

Published Wed, Jul 31 2024 11:46 AM | Last Updated on Wed, Jul 31 2024 12:07 PM

Srinu Vaitla's 'Viswam' Movie Telugu Teaser

తెలుగులో కొన్ని క్లాసిక్ సినిమాలు తీస్తే 'వెంకీ' ఇందులో కచ్చితంగా ఉంటుంది. ఈ మూవీలోని కామెడీ సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ట్రైన్‌లో వెంకీ తన గ్యాంగ్‌తో చేసే కామెడీ అయితే నెక్స్ట్ లెవల్. ఎవరికైనా బోర్ కొడితే ఇ‍ప్పటికీ యూట్యూబ్‌లో ఎక్కువగా చూసే కామెడీ సీన్ ఏదైనా ఉందా అంటే అది 'వెంకీ ట్రైన్ కామెడీ'నే. ఇప్పుడు హిట్ కొట్టడం కోసం శ్రీనువైట్ల మళ్లీ దీన్ని నమ్ముకున్నారా అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న స్టార్ హీరో అజిత్.. రేటు తెలిస్తే బుర్ర తిరిగిపోద్ది!)

'వెంకీ', 'ఢీ', 'రెడీ', 'దూకుడు' లాంటి సినిమాల్లో కామెడీతో తనకంటూ సెపరేట్ ట్రేడ్ మార్క్ సృష్టించిన శ్రీనువైట్ల.. ఆ తర్వాత వరస ప్లాఫులతో డౌన్ అయిపోయారు. ఓ దశలో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయాడా అనుకున్నారు. కానీ ప్రస్తుతం గోపీచంద్‌తో 'విశ్వం' సినిమా తీస్తున్నాడు. తాజాగా 'జర్నీ ఆఫ్ విశ్వం' పేరుతో నిమిషం నిడివి ఉన్న వీడియోని రిలీజ్ చేశారు.

వీడియో చూస్తుంటే ఫారెన్ లొకేషన్స్, ఫైట్స్ లాంటి కమర్షియల్ అంశాలు కనిపించాయి. కానీ ట్రైన్‌ కామెడీ సీన్స్ కూడా కనిపించాయి. టీటీఈతో హీరో అండ్ గ్యాంగ్ చేసే కామెడీ తరహా విజువల్స్ చూపించారు. అయితే హిట్ కోసం తహతహలాడుతున్న శ్రీనువైట్ల.. మళ్లీ తనకు అచ్చొచ్చిన ట్రైన్ కామెడీనే నమ్ముకున్నాడా అనిపిస్తుంది. 'వెంకీ' వచ్చినప్పటితో పోలిస్తే జనాల మైండ్ సెట్ మారిపోయింది. మరి వింటేజ్ శ్రీనువైట్ల తరహాలో ఈ ట్రైన్ కామెడీ బిట్ ఉంటుందా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే!

(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement