‘రాజ రాజ చోర’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘శ్వాగ్’. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఎంతో వినోదాత్మకంగానే కాకుండా ఆసక్తిగా కూడా ఈ టీజర్ మెప్పిస్తుంది. రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
తాజాగా విడుదలైన టీజర్‌ను బట్టి చూస్తే సినిమాపై మంచి అంచనాలు పెట్టుకోవచ్చు. సినిమా కాన్సెప్ట్ కూడా అందరినీ మెప్పించేలా ఉంది. శ్వాగణిక వంశానికి చెందిన వాడిగా శ్రీవిష్ణు విభన్న గెటప్పులతో అలరించాడు. సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాల తర్వాత ‘శ్వాగ్’తో శ్రీవిష్ణు హ్యాట్రిక్ హిట్ అందుకునేలా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment