Swag
-
శ్రీవిష్ణు ‘స్వాగ్’ మూవీ టీజర్ లాంచ్ (ఫొటోలు)
-
శ్రీవిష్ణు 'శ్వాగ్' టీజర్.. హ్యాట్రిక్ కొట్టేలా ఉన్నాడే
‘రాజ రాజ చోర’ వంటి హిట్ సినిమా తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘శ్వాగ్’. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఎంతో వినోదాత్మకంగానే కాకుండా ఆసక్తిగా కూడా ఈ టీజర్ మెప్పిస్తుంది. రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.తాజాగా విడుదలైన టీజర్‌ను బట్టి చూస్తే సినిమాపై మంచి అంచనాలు పెట్టుకోవచ్చు. సినిమా కాన్సెప్ట్ కూడా అందరినీ మెప్పించేలా ఉంది. శ్వాగణిక వంశానికి చెందిన వాడిగా శ్రీవిష్ణు విభన్న గెటప్పులతో అలరించాడు. సామజవరగమన, ఓం భీమ్ బుష్ సినిమాల తర్వాత ‘శ్వాగ్’తో శ్రీవిష్ణు హ్యాట్రిక్ హిట్ అందుకునేలా ఉన్నాడు. -
సింగరో సింగ
‘రాజ రాజ చోర’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘శ్వాగ్’. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలో సింగరేణి అలియాస్ సంగ పాత్రలో శ్రీవిష్ణు నటిస్తున్నట్లుగా వెల్లడించి, ‘సింగరో సింగ’ అనే పాట లిరికల్ వీడియోను కూడా విడుదల చేశారు. ‘సింగరో సింగ.. అబ్బో సింగరో సింగ...’ అంటూ మొదలై, ‘పక్కక్ జరుగుర్రి... దండల్ గుచ్చుర్రీ... దండాలు గిండాలు పెట్టుర్రి... ఆస్తండు సింగ... సింగరో సింగ..’ అంటూ సాగే ఈ పాటకు వివేక్ సాగర్ స్వరాలందించగా నిక్లేష్ సుంకోజీ సాహిత్యం అందించారు. బాబా సెహగల్–వైకోమ్ విజయలక్ష్మి పాడారు. -
మీకు ఏం గుర్తొస్తుంది?
‘మగాడంటే మీకు ఏం గుర్తొస్తుంది’ అని శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌తో ‘శ్వాగ్’ మూవీ టీజర్ రిలీజ్ అయింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ చిత్రంలో రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు కీలక పాత్రల్లో నటించారు. హసిత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మించారు.ఈ చిత్రంలోని అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసిన మేకర్స్ శుక్రవారం టీజర్‌ని రిలీజ్ చేశారు. ‘ఆడవాళ్లని ఏం అడుక్కోనక్కర్లేదు... మగవాడినే అనుసరించాలి. వంశాలైనా, ఆస్తులైనా, ఆడవాళ్లయినా..’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగులు ఈ టీజర్లో ఉన్నాయి. ‘‘ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ‘శ్వాగ్’ రూపొందింది. శ్రీవిష్ణు హిలేరియస్ రోల్లో కనిపించనున్నారు. త్వరలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు మేకర్స్. -
సింహాసనం దక్కాలి కానీ...
ఉత్పలదేవిగా మారిపోయారు మీరా జాస్మిన్. ఉత్పలదేవి దయాగుణం వల్ల రాణి కావాల్సిన ఆమెకు సింహాసనం దక్కదు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ‘శ్వాగ్’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలీ దర్శకత్వంలో ‘శ్వాగ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో వింజమర వంశంలోని రాణి రుక్మిణి దేవిగా రీతూ వర్మ ఓ లీడ్ రోల్లో నటిస్తుండగా, మరో లీడ్ రోల్లో ఉత్పలదేవిగా మీరా జాస్మిన్ కనిపిస్తారు. ఆదివారం ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. -
డబుల్ ట్రీట్
బర్త్ డేకి శ్రీ విష్ణు డబుల్ ట్రీట్ అందుకున్నారు. గురువారం (ఫిబ్రవరి 29) శ్రీవిష్ణు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన నటించనున్న రెండు కొత్త చిత్రాలను అధికారికంగా ప్రకటించారు ఆయా మేకర్స్. ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్‌పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తారు. ప్రేమకథతో కూడిన ఫన్ రోలర్ కోస్టర్ మూవీ ఇది. మరోవైపు ‘రాజ రాజ చోర’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాకు ‘శ్వాగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ స్వరకర్త. -
మట్టి.. లూటీ
సాక్షి, కడప సిటీ : అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదాయం కోసం తొక్కని అడ్డదారి లేదు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా అధికారాన్ని ఉపయోగించి అక్రమార్జనకు తెరలేపుతున్నారు. పాతకడప చెరువులో మట్టి దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. పేరుకేమో అధికారుల వద్ద అనుమతులు తీసుకున్నామన్న సాకుతో మట్టిని వ్యాపార వనరుగా మార్చుకున్నారు. క్యూబిక్ మీటరు ప్రభుత్వ జీఓ ప్రకారం రూపాయి లెక్కన చెల్లిస్తున్నారు. మూడు క్యూబిక్ మీటర్లయితే ఒక ట్రాక్టర్ మట్టి అవుతుంది. ఈ నేపథ్యంలో పాతకడపకు చెందిన టీడీపీ నాయకుడు, ఆ చెరువు సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి మూడు క్యూబిక్ మీటర్లకు రూ. 3 చెల్లించి.. ఒక్కొక్క ట్రాక్టర్ మట్టికి రూ. రూ.300–రూ.400 అక్రమార్జనకు శ్రీకారం చుట్టారు. ఇలా ఇంతవరకు దాదాపు రూ. కోటి రూపాయల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది. రెండున్నరేళ్లుగా ఈ తంతు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడు లేడు. భూములకు మట్టిని తరలించేందుకు అనుమతులు తీసుకుని వ్యాపార ధోరణిలో తతంగం కొనసాగుతోంది. ప్రైవేటు వ్యక్తుల పునాదులకు, టవర్ల చదునుకు, ఇతర అవసరాలకు ఒప్పందం కుదుర్చుకుని కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చెరువును అభివృద్ది చేస్తారని అక్కడి ప్రజలు ఆశతో అధ్యక్షుడిని చేస్తే ఆ నాయకుడు ఆ చెరువును ఆదాయ వనరుగా మార్చుకుని ముందుకు సాగడంపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన సొంత పొక్లెయిన్ పెట్టుకుని కొన్ని ట్రాక్టర్లు బాడుగకు సమకూర్చుకుని ఈ అవసరాలకు మట్టిని తరలిస్తూ కొనసాగుతున్నారు. కేసీ కెనాల్ కింద అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. పొలాలకు మట్టిని తోలుకోవాలని అనుమతులు ఇచ్చామని, మేమేం చేయలేమని అధికారులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మరి అధికార పార్టీ నాయకులని భయపడుతున్నారా? లేక చేయి తడిపినందువల్ల మిన్నకున్నారా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. అనుమతులు ఇచ్చిన అధికారులు మట్టిని పొలాలకు తరలిస్తున్నారా? లేక ఇతర ప్రాంతాలకు తరలించి వ్యాపారం చేస్తున్నారా? అనే విషయాన్ని తనిఖీ చేయకుండా తమకేం సంబంధం లేనట్లుగా మాట్లాడటం పలు విమర్శలకు తావిస్తోంది. చెరువును కాపాడేవారే చెరబట్టారు మామూలుగా నీటి సంఘాలు చెరువుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినవే. ఈ నీటి సంఘాల వల్ల ఆ చెరువులకు మరమ్మతులుగానీ, పూడికతీత పనులుగానీ నిబంధనల ప్రకారం చేపట్టాల్సి ఉంటుంది. అలాంటిది ‘కంచె చేను మేస్తే కాపు ఏమి చేయగలడు?’ అన్న చందంగా పాతకడప చెరువు నీటి సంఘం అధ్యక్షుడిగా పాతకడపకు చెందిన కృష్ణారెడ్డి కొనసాగుతున్నారు. ఈయన చెరువు అభివృద్ధి పనులను తుంగలో తొక్కి చెరువును చెరబట్టే విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మట్టి తరలింపునకు అనుమతులు ఇచ్చాం పాతకడప చెరువు నుంచి పొలాలకు మట్టి తోలుకునేందుకు అనుమతులు ఇచ్చాం. జల వనరులశాఖ ఇందుకు సంబంధించిన జీఓ ఎంఎస్ నంబర్. 40ని జారీ చేసింది. క్యూబిక్ మీటరుకు రూపాయి చొప్పున చెల్లిస్తే ఎవరికైనా అనుమతులు ఇస్తాం. అలాంటి అనుమతులను కృష్ణారెడ్డి తీసుకున్నారు. నిబంధనల ప్రకారం మట్టిని తరలించాలి. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – జిలానీబాషా, డీఈ, కేసీ కెనాల్, కడప -
సీబీఐ దర్యాప్తునకు ఆదేశించండి
సీఎం చంద్రబాబుపై లోకాయుక్తకు ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడి ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగంచేస్తూ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నారని, ఆయన అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఏపీ వెనుకబడిన తరగతుల సంఘం లోకాయుక్తను ఆశ్రయించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ శుక్రవారం లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డిని కలసి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలుకు పోరాటం చేస్తున్నందుకు తనను చంపాలని చూస్తున్నారని,తన కుమార్తెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. అయితే సీఎంను విచారించే పరిధి తమకు లేదని ఉదయ్‌కిరణ్‌కు లోకాయుక్త తెలిపారు. ‘‘ఇతర రాష్ట్రాల్లో లోకాయుక్త సమర్థంగా ఉంది. ఇక్కడ మాత్రం సీఎంను విచారించే పరిధి మాకు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేం. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించండి’’అని లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ఈ సందర్భంగా సూచించారు. -
మీరు.. మేము పంచుకుందాం
మద్యం ధరలకు రెక్కలు తెప్పించిన ఎక్సైజ్‌శాఖ అధిక రే ట్లకు విక్రయించుకోవాల్సిందిగా ఆదేశాలు మద్యం వ్యాపారులను ప్రోత్సహిస్తున్న వైనం నెలకు రూ. కోట్లు దండుకుంటున్న యంత్రాంగం కడప:మద్యం వ్యాపారులు అధిక ఆదాయమే లక్ష్యంగా ఏకమయ్యారు. జిల్లాలో మందుబాబుల జేబులకు వ్యూహత్మకంగా చిల్లులు పెట్టేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్సైజ్‌శాఖ సమర్థవంతమైన పాత్ర పోషించింది. ఎమ్మార్పీ రేట్ల ఉల్లంఘనకు పాల్పడ్డారు. అడ్డు చెప్పిన నాయకుల్ని సైతం మనీతో మాట్లాడకుండా చేస్తున్నారు. అవకాశం ఉన్న మేరకు అక్రమార్జన కోసం కొత్తపద్దతిలో అక్రమ ఆదాయానికి మద్యం వ్యాపారుల్ని ఏకం చేశారు. ఆదాయం పంచుకుందాం... అన్న రీతిలో మందుబాబుల జేబులకు చిల్లుపెట్టేందుకు ప్లాన్ చేశారు. ఎమ్మార్పీ రేట్లు ఉల్లంఘించినా చూసీచూడనట్లు ఉంటాం... మా వాటా మాకు పంపండి.. అని ఓ ఉన్నతాధికారి తెలియజేసినట్లు సమాచారం. ఇంకేముంది వెంటనే జిల్లాలో మద్యం రేట్లుకు రెక్కలు వచ్చాయి. ఇదేమి అన్యాయం అని ప్రశ్నించిన నాయకుల్ని సైతం నోట్ల కట్టలతో కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నారుు. అధికరేట్లుకు మద్యం విక్రయాలు... జిల్లాలో 269 మద్యం షాపులకు 209 టెండర్లులో దుకాణాలు కేటాయించారు. తక్కిన దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. నిబంధల మేరకు మద్యం విక్రయాలు నిర్వహించాలని ముందుగా ఎక్సైజ్ యంత్రాంగం ఆంక్షలు పెట్టింది. ఆపై నెలమామూళ్లు కోసం పరితపిస్తోంటే మద్యం వ్యాపారులు తిరగబడ్డట్లు సమాచారం. ఇలా అయితే ఎలా.. మీరు ఆదాయం గడించడండి, మాకు ఇవ్వండని కొందరు అధికారులు మద్యస్థం చేశారు. దీంతో ఎమ్మార్పీ రేట్లుకు మంగళం పలికారు. ఉన్నత స్థాయి అధికారుల జోక్యం వల్ల ఇది ఓ కొలిక్కి వచ్చింది. దాంతో కడప కేంద్రంగా రూ.15 అధికంగాను, ప్రొద్దుటూరు కేంద్రంగా రూ.10 అధిక రేట్లుకు విక్రయాలు నిర్వహిస్తున్నారు. అంటే ఒక్కోక్క షాపులో ప్రతిరోజు 1000 నుంచి 1500 మద్యం బాటిళ్లు విక్రయాలుంటాయి. బాటిల్ మీద ఎమ్మార్పీ కంటే రూ.10 అధికంగా విక్రయించినా ఒక్కోక్క మద్యం షాపు నుంచి ప్రతినెలా సుమారు రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరక ఆదాయం గడించే అవకాశం ఉంది. అందులో రూ.50వేలు మాత్రమే మాకు అప్పగించండని జిల్లా స్థాయి అధికారి ఒకరు పేర్కొన్నట్లు సమాచారం. ఈ లెక్కన ప్రతినెలా సరాసరి విక్రయాలు ద్వారా అధనంగా మందుబాబులు సుమారు రూ.12కోట్లు భరించాల్సిన పరిస్థితి కల్గుతోంది. అధికార పార్టీ నేతలు అడ్డగించడంతో.... అధిక రేట్లుకు మద్యం విక్రయాలు చేయడానికి అధికారపార్టీకి చెందిన నాయకులు కొందరు అడ్డుపడ్డట్లు తెలుస్తోంది. ఎమ్మార్పీ రేట్లుకే మద్యం విక్రయాలు చేపట్టాలని, ఎందుకు మద్యం వ్యాపారుల్ని, ప్రోత్సహిస్తోన్నారంటూ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులపై ఆగ్రహం వెలిబుచ్చినట్లు సమాచారం. వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టాలా అంటూ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని బెదిరించడంతో ఎక్సైజ్ ఉన్నతాధికారులు కడప, ప్రొద్దుటూరులలో ఇరువురు నాయకులకు నెల మామూళ్లు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. డీప్యూటీ క మిషనర్ ఎమ్మన్నారంటే... అధికరేట్లుకు మద్యం విక్రయాలపై దాడులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే కొన్ని షాపులపై కేసులు నమోదు చేశాం. ఎమ్మార్పీ రేట్లు కంటే అదనంగా మద్యం విక్రయాలు ఉంటే సిబ్బందిపై సైతం చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ విజయకుమారి పేర్కొన్నారు. కాగా జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధిక రేట్లుకు పోత్సహిస్తున్న విషయాన్ని ఎన్ఫోర్సుమెంటు డెరైక్టర్ సూర్యనారాయణరావుతో సంప్రదించగా అలా చేయడం నేరమని తెలిపారు. ఫిబ్రవరిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, అధిక రేట్లుకు విక్రరుుంచే వ్యాపారులు, అందుకు సహకరిస్తోన్న బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.