
బర్త్ డేకి శ్రీ విష్ణు డబుల్ ట్రీట్ అందుకున్నారు. గురువారం (ఫిబ్రవరి 29) శ్రీవిష్ణు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన నటించనున్న రెండు కొత్త చిత్రాలను అధికారికంగా ప్రకటించారు ఆయా మేకర్స్. ‘నిను వీడని నీడను నేనే’ ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది.
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్‌పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తారు. ప్రేమకథతో కూడిన ఫన్ రోలర్ కోస్టర్ మూవీ ఇది. మరోవైపు ‘రాజ రాజ చోర’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత శ్రీవిష్ణు, హసిత్ గోలి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకు ‘శ్వాగ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ స్వరకర్త.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment