‘రాజ రాజ చోర’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘శ్వాగ్’. టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమాలో సింగరేణి అలియాస్ సంగ పాత్రలో శ్రీవిష్ణు నటిస్తున్నట్లుగా వెల్లడించి, ‘సింగరో సింగ’ అనే పాట లిరికల్ వీడియోను కూడా విడుదల చేశారు. ‘సింగరో సింగ.. అబ్బో సింగరో సింగ...’ అంటూ మొదలై, ‘పక్కక్ జరుగుర్రి... దండల్ గుచ్చుర్రీ... దండాలు గిండాలు పెట్టుర్రి... ఆస్తండు సింగ... సింగరో సింగ..’ అంటూ సాగే ఈ పాటకు వివేక్ సాగర్ స్వరాలందించగా నిక్లేష్ సుంకోజీ సాహిత్యం అందించారు. బాబా సెహగల్–వైకోమ్ విజయలక్ష్మి పాడారు.
Comments
Please login to add a commentAdd a comment