
ఉత్పలదేవిగా మారిపోయారు మీరా జాస్మిన్. ఉత్పలదేవి దయాగుణం వల్ల రాణి కావాల్సిన ఆమెకు సింహాసనం దక్కదు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ‘శ్వాగ్’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలీ దర్శకత్వంలో ‘శ్వాగ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రంలో వింజమర వంశంలోని రాణి రుక్మిణి దేవిగా రీతూ వర్మ ఓ లీడ్ రోల్‌లో నటిస్తుండగా, మరో లీడ్ రోల్‌లో ఉత్పలదేవిగా మీరా జాస్మిన్ కనిపిస్తారు. ఆదివారం ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment