మీకు ఏం గుర్తొస్తుంది? | Sree Vishnu Swag Movie Release Teaser | Sakshi
Sakshi News home page

మీకు ఏం గుర్తొస్తుంది?

Published Sat, Jun 15 2024 4:04 AM | Last Updated on Sat, Jun 15 2024 12:42 PM

Sree Vishnu Swag Movie Release Teaser

‘మగాడంటే మీకు ఏం గుర్తొస్తుంది’ అని శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌తో ‘శ్వాగ్‌’ మూవీ టీజర్‌ రిలీజ్‌ అయింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ చిత్రంలో రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు కీలక పాత్రల్లో నటించారు. హసిత్‌ గోలి దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ సినిమా నిర్మించారు.

ఈ చిత్రంలోని అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసిన మేకర్స్‌ శుక్రవారం టీజర్‌ని రిలీజ్‌ చేశారు. ‘ఆడవాళ్లని ఏం అడుక్కోనక్కర్లేదు... మగవాడినే అనుసరించాలి. వంశాలైనా, ఆస్తులైనా, ఆడవాళ్లయినా..’ అంటూ శ్రీవిష్ణు చెప్పే డైలాగులు ఈ టీజర్‌లో ఉన్నాయి. ‘‘ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా ‘శ్వాగ్‌’ రూపొందింది. శ్రీవిష్ణు హిలేరియస్‌ రోల్‌లో కనిపించనున్నారు. త్వరలో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు మేకర్స్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement