
ఛావా సినిమాపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన ట్వీట్స్ వివాదానికి దారితీశాయి. దీంతో ఆమె తాజాగా వివరణ ఇచ్చింది. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన తాజా చిత్రం ఛావా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల గుండెలను తాకింది. అయితే, ఈ సినిమా గురించి ఆమె చేసిన పోస్టులపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మహాకుంభ్ మేళాలో జరిగిన తొక్కిసలాటను పోలుస్తూ ఛావా మూవీపై విమర్శలు చేసింది. కొద్దిరోజుల క్రితం మహాకుంభ్ మేళాలో జరిగిన తొక్కిసలాట కంటే దాదాపు 500 ఏళ్ల క్రితం హిందువులను హింసించినట్లు తెరకెక్కించిన కల్పిత కథలనే ప్రజలు నమ్ముతారంటూ స్వర భాస్కర్ ట్వీట్ చేసింది.
అంతేకాకుండా అలాంటి వాటిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారంటూ తన ట్వీట్‌లో పేర్కొంది. అది కాస్తా వివాదానికి దారితీయడంతో ఆమెపై తీవ్రస్థాయిలో నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఫైనల్లీ వాటికి వివరణ ఇస్తూ ఆమె పోస్ట్ చేసింది. ఛావా మూవీలో ఔరంగజేబు చేతిలో ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ అనుభవించిన హింస అంతా కల్పితం అని ఎలా అంటావ్ అంటూ ఆమెపై తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఆమె ఇలా విరణ ఇచ్చింది.
'నేను వ్యక్తపరిచిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. మన చరిత్రను నేను ఎంతగానో గౌరవిస్తాను. ఛత్రపతి శివాజీ ఘనతల్ని కీర్తించడంలో నేను గౌరవిస్తాను. కానీ, దయచేసి ప్రస్తుత కాలంలోని తప్పులు, వైఫల్యాలను దాచడానికి గత వైభవాన్ని దుర్వినియోగం చేయవద్దు. చారిత్రక అవగాహన ఎల్లప్పుడూ ప్రజలను ఏకం చేయడానికి ఉపయోగించాలి. ప్రస్తుత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కాదు. చరిత్ర అందర్నీ కలిపేలా ఉండాలి. కానీ, విడదీసేలా కాదు. నా మునుపటి ట్వీట్ ఏదైనా మీ మనోభావాలను దెబ్బతీస్తే.. నేను చింతిస్తున్నాను. అందరితో పాటు నేను కూడా మన భారత చరిత్ర గురించి తెలుసుకొని గర్వపడుతున్నాను.' అని ఆమె అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment