సీబీఐ దర్యాప్తునకు ఆదేశించండి | permition to CBI probe on ap cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

సీబీఐ దర్యాప్తునకు ఆదేశించండి

Published Sat, Apr 30 2016 3:04 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM

permition to CBI probe on ap cm chandrababu naidu

సీఎం చంద్రబాబుపై లోకాయుక్తకు ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగంచేస్తూ పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడుతున్నారని, ఆయన అవినీతి, అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఏపీ వెనుకబడిన తరగతుల సంఘం లోకాయుక్తను ఆశ్రయించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌కిరణ్ శుక్రవారం లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డిని కలసి ఫిర్యాదు చేశారు.    

రాజ్యాంగం కల్పించిన హక్కులు అమలుకు పోరాటం చేస్తున్నందుకు తనను చంపాలని చూస్తున్నారని,తన కుమార్తెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. అయితే సీఎంను విచారించే పరిధి తమకు లేదని ఉదయ్‌కిరణ్‌కు లోకాయుక్త తెలిపారు. ‘‘ఇతర రాష్ట్రాల్లో లోకాయుక్త సమర్థంగా ఉంది. ఇక్కడ మాత్రం సీఎంను విచారించే పరిధి మాకు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించలేం. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించండి’’అని లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ఈ సందర్భంగా సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement