'జబర్దస్త్' ప్రముఖ కమెడియన్.. ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోయాడని తాజాగా న్యూస్ బయటకొచ్చింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్న ఓ హస్యనటుడు ఇలాంటి పనులు చేస్తున్నాడా అని మాట్లాడుకున్నారు. ఇంకొందరైతే తిట్టుకున్నారు. ఇప్పుడు వీటన్నంటికీ చెక్ పెట్టేందుకు డైరెక్ట్ గా సదరు కమెడియన్ స్పందించాడు. ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.
(ఇదీ చదవండి: విశాల్‌పై కేసును కొట్టివేసిన కోర్టు)
'జబర్దస్త్'లో కమెడియన్ గా చేసిన హరిబాబు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో కీలకపాత్రధారి. గత కొన్నేళ్ల నుంచి పరారీలో ఉన‍్న ఇతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాజాగా హరిబాబుపై మరో కేసు నమోదైంది. దీంతో మీడియాలో న్యూస్ వచ్చింది. అయితే ఇక్కడ చిన్న పొరపాటు జరగడంతో ఓ వ్యక్తికి బదులు మరోవ్యక్తి ఫొటోలతో వార్తలు రాసేశారు. ప్రస్తుతం ఇదే షోలో హరికృష‍్ణ అనే కమెడియన్ చేస్తున్నాడు. అతడి బదులు ఇతడి గురించి అందరూ రాశారు. దీంతో కమెడియన్ గంపా హరికృష్ణ ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది.
'స్మగ్లింగ్ కేసులో ఉంది నేను కాదు. నాకు దీనితో ఎలాంటి సంబంధం లేదు. 2013లో షకలక శంకర్ టీమ్ లో హరిబాబు పనిచేశాడు. తర్వాత అతడు ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో దొరికిపోయాడు. అప్పటికే నేను ఫేమ్ లో ఉండటంతో గూగుల్ లో ఆ పేరు కొడితే నా ఫొటోలు వచ్చాయి. నా ఫొటో పెట్టి వార్తలు రాసేశారు. నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు' అని 'జబర్దస్త్' హరికృష్ణ అన‍్నాడు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ ఈ విషయాలన్నీ బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: టాంగో ఇక లేదు.. సాయి తేజ్ ఎమోషనల్ పోస్ట్)
Comments
Please login to add a commentAdd a comment