జోరు పెంచిన వెంకటేశ్‌.. మరో మల్టీస్టారర్‌కి రెడీ! | Director Venu Udugula Do Film With Venkatesh | Sakshi
Sakshi News home page

జోరు పెంచిన వెంకటేశ్‌.. మరో మల్టీస్టారర్‌కి రెడీ!

Published Sat, Jul 13 2024 10:20 AM | Last Updated on Sat, Jul 13 2024 10:24 AM

Director Venu Udugula Do Film With Venkatesh

హీరో వెంకటేశ్‌ మంచి జోరు మీద ఉన్నారు. ‘ఎఫ్‌ 2, ఎఫ్‌ 3’ సినిమాల తర్వాత దర్శకుడు అనిల్‌ రావిపూడితో వెంకటేశ్‌ చేస్తున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) చిత్రీకరణ ప్రారంభమైంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అలాగే హిట్‌ ఫిల్మ్‌ ‘సామజవరగమన’ ఫేమ్‌ రైటర్‌ నందు రెడీ చేసిన ఓ కథలో వెంకటేశ్‌ హీరోగా నటిస్తారనే ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే.

 ఈ రెండు చిత్రాలు ఇలా ఉండగానే... వెంకటేశ్‌ మరో కథ విన్నారట. ఇటీవల ఓ మల్టీస్టారర్‌ ఫిల్మ్‌ కథను రెడీ చేశారట వేణు ఉడుగుల. ముగ్గురు హీరోలకు స్కోప్‌ ఉండే ఈ సినిమాలో మెయిన్‌ హీరోగా వెంకటేశ్‌ నటించనున్నారట. ఆల్రెడీ వెంకటేశ్‌ కథ విన్నారని, వేణు ఉడుగులతో ‘విరాటపర్వం’ సినిమాను నిర్మించిన నిర్మాణ సంస్థల్లో ఒకటైన సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మించనుందని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. 

ఈ సంగతలా ఉంచితే... రానా–సాయి పల్లవి కాంబినేషన్‌లో వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన ‘విరాటపర్వం’ మంచి సినిమా అనిపించుకుంది. ఈ చిత్రానికి తాజాగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు దక్కాయి. ఉత్తమ నటిగా (క్రిటిక్స్‌) సాయి పల్లవి అవార్డు అందుకోనుండగా ఇదే సినిమాకి ఉత్తమ సహాయ నటి అవార్డుకి నందితా దాస్‌ ఎంపికయ్యారు. 

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement