సాక్షి, గుంటూరు : గతంలో దళిత మహిళ నాయకురాలిపై దాడి చేసిన మంగళగిరి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) బహిష్కృత నాయకుడు పోలవరపు హరిబాబును పోలీసులు గురువారం అరెస్టు చేశారు. టీడీపీ నిర్వహించిన ‘దళిత తేజం’ అనే కార్యక్రమంలో పోలవరపు హరిబాబు, వనరాణి అనే దళిత మహిళ నాయకురాలిని కులం పేరుతో దూషించి, దాడి చేశారు. తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయ్యారు. దాడికి గురైన ఆ మహిళ నాయకురాలు కూడా టీడీపీ పార్టీకి చెందిన నేతే కావడం గమనార్హం.
దళిత తేజం అనే కార్యక్రమం నిర్వహిస్తూ ఒక దళిత మహిళను కులం పేరుతో దూషించి, దాడి చేసిన హరిబాబును కేవలం పార్టీ నుంచి సస్సెండ్ చేసి చేతులు దులుపుకుంది టీడీపీ. దీంతో వారు మహిళలకు ఇచ్చే గౌరవం ఎంటో తెలిసిపోతుంది. దాడి చేసిన నాయకుడు అధికార పార్టీకి చెందిన సామాజికవర్గం కావడంతో అప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. గతంలో కూడా ఒకసారి సస్పెండ్ చేసి మళ్లీ తిరిగి పార్టీలో చేర్చుకున్నారు. అధికారం వాళ్ల చేతుల్లో ఉంది కాబట్టి ఈ కేసు ఎంత వరకు నిలబడుతుందో చూడాలి. ఆ దళిత మహిళకు న్యాయం జరుగుతుందో లేదో.
Comments
Please login to add a commentAdd a comment