బీజేపీ ‘లోక్‌సభ’ జాబితా సిద్ధం
జాబితాలో పురందేశ్వరి, హరిబాబు.. పలు స్థానాలకు ఇద్దరు ముగ్గురి పేర్లు
సాక్షి, హైదరాబాద్: పొత్తుల విషయంలో ఏదైనా జరగొచ్చని, ఒంటరిగా పోటీకి సిద్ధంగా ఉండాలని పార్టీ జాతీయ నేతల సూచనల మేరకు లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను బీజేపీ దాదాపు పూర్తి చేసింది. సీమాంధ్రలో 25 లోక్‌సభ స్థానాలకు 23 చోట్ల, 175 అసెంబ్లీ స్థానాలకు 138 నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. లోక్‌సభ స్థానాల్లో విజయనగరం, చిత్తూరు మినహా అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారు. సీమాంధ్ర బీజేపీ అధ్యక్షుడు హరిబాబు విశాఖపట్నం లోక్‌సభకు పోటీ చేయనున్నారు. పురందేశ్వరి పేరును విశాఖ, విజయవాడనుంచి పరిశీలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పార్టీ ఖరారు చేసిన జాబితా..
అరకు- జీకే బాబు; శ్రీకాకుళం - వి.బాలకృష్ణ; అనకాపల్లి - కె.జనార్ధనరావు, జె.రెడ్డి బాలాజీ; కాకినాడ - టి.వి.సర్వారాయుడు, యూవీ రమణ, వి.సత్యనారాయణ; అమలాపురం (ఎస్సీ)- ఎం.ఎ వేమ, ఎం.రాణాప్రతాప్; రాజమండ్రి - ఆకుల సత్యనారాయణ; నరసాపురం - గంగరాజు, పి.పుల్లారావు, కె.రఘురామకృష్ణంరాజు; ఏలూరు- కోటగిరి శ్రీధర్; మచిలీపట్నం - బాడిగ రామకృష్ణ; విజయవాడ - పురందేశ్వరి, ఎర్నేని సీతాదేవి; గుంటూరు - ప్రభాకరరావు, శివనారాయణ; నరసరావుపేట - ఎం.శ్రీనివాస్, ఎన్.విష్ణు; బాపట్ల (ఎస్సీ)- దార సాంబయ్య; ఒంగోలు- ఎం.వెంకటేశ్వర్లు, గోపీనాథరెడ్డి; నంద్యాల - ఆదినారాయణ; కర్నూలు - కె.నీలకంఠ, బి.వెంకటరామయ్య; అనంతపురం- కె.బి.సిద్దప్ప, ఎం.టి.చౌదరి, ఎ.రామకృష్ణారెడ్డి; హిందూపురం- విష్ణువర్ధన్‌రెడ్డి, ఎన్.టి.చౌదరి; కడప- ఎస్.రామచంద్రారెడ్డి, ఎ.ప్రభావతి; నెల్లూరు- ఎస్.సురేష్‌రెడ్డి; తిరుపతి (ఎస్సీ)- ముని సుబ్రమణ్యం, సి.రాసయ్య, జి.ఆర్ గోపీనాథ్, గౌతమ్; రాజంపేట- శాంతారెడ్డి, హరినాథరెడ్డి పేర్లు జాబితాలో ఉన్నాయి. మచిలీపట్నం నుంచి ఖరారైన బాడిగ రామకృష్ణ ఇంకా పార్టీలో చేరకపోవడం విశేషం.