దగ్గుబాటి పురందేశ్వరి
హైదరాబాద్: ఇటీవల బిజెపిలో చేరిన కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ దగ్గుబాటి పురందేశ్వరికి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఆమెకు టికెట్ ఇచ్చే విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కచెల్లెళ్ల మధ్య గొడవలే పురందేశ్వరి టికెట్ గల్లంతుకు కారణంగా చెబుతున్నారు. టిడిపి సీనియర్ నేత కేశినేని నానికి టిడిపి బిఫామ్ ఇచ్చినప్పటికీ విజయవాడ లోక్సభ టికెట్ జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యక్తికే ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బిజెపికి 4 లోక్సభ, 14 శాసనసభ స్థానాలు, రెండు ఎమ్మెల్సీలు ఇచ్చేవిధంగా టీడీపీ-బీజేపీ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఏర్పాట్లు చేస్తున్నారు.