ఆస్పత్రి ఉద్యోగి సస్పెన్షన్ | Hospital employee suspension | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి ఉద్యోగి సస్పెన్షన్

Published Thu, Feb 27 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM

Hospital employee suspension

 ఏలూరు(టూటౌన్), న్యూస్‌లైన్ : క్షతగాత్రుడి వద్ద బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించిన జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి అత్యవసర విభాగంలోని కాంపౌండర్ మద్దాల హరిబాబును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డీసీహెచ్‌ఎస్ డాక్టర్ శంకరరావు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 22న భీమడోలు రైల్వేస్టేషన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిలో ఏలూరు అశోక్‌నగర్‌కు చెందిన వెలమాటి నాగేశ్వరరావు కూడా ఉన్నారు. ఆస్పత్రిలో అతని వద్ద ఉండాల్సిన రూ.30 వేల నగదు, మెడలోని బంగారు గొలుసు, చేతి ఉంగరం చోరీకి గురయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement