
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లోని బఫెల్లో చెరువులో అరుదైన బ్యాక్టీరియాను కనుగొన్నారు. రెండేళ్లుగా వర్సిటీలోని ప్లాంట్ సైన్సెస్ ల్యాబ్‌లో ప్లాంట్ సైన్సెస్ విభాగాధిపతి ప్రొఫెసర్ సీహెచ్ వెంకటరమణ చేస్తున్న పరిశోధనల్లో దీనిని కనుగొనడం విశేషం. దీనికి ‘ప్లాంటోపైరస్’అని నామకరణం చేసినట్లు ఆయన తెలిపారు.
అరుదైన యాంటీ బయాటిక్‌ను ఉత్పత్తి చేసే ఇలాంటి బ్యాక్టీరియాను కనుగొనడం దేశంలోనే మొదటిçసారని వెల్లడించారు. ఈ యాంటీ బయాటిక్ ద్వారా ప్లాంటోమైసిటీని ఉత్పత్తి చేసి నూతన ఔషధాల తయారీకి వినియోగించవచ్చని పేర్కొన్నారు. ప్రధానంగా పరిశ్రమల్లోని అమోనియా వ్యర్థాలను శుభ్రం చేయడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు. అరుదైన బ్యాక్టీరియాను వర్సిటీ చెరువులో కనుగొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, దీన్ని పెంచడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment