చిత్తూరు జిల్లా గంగవరం మండలం పత్తికొండలో సోమవారం ఉదయం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
చిత్తూరు జిల్లా గంగవరం మండలం పత్తికొండలో సోమవారం ఉదయం ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటరమణ, లక్ష్మి(24)కు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వారికి పిల్లల్లేరు. గత కొంతకాలంగా వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో లక్ష్మి ఉరి వేసుకుని చనిపోయింది. కొద్దిసేపటి తర్వాత గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.