బాలల హక్కుల పరి రక్షణ కోసం గత నలభై ఏళ్లుగా తన జీవితాన్ని అంకితం చేసిన కార్యకర్త అచ్యుతరావు. తను చేసే పనిపట్ల నమ్మకం, గౌరవం, నిజాయితీ, నిబ ద్ధత గల కార్యశీలుడు ఆయన. బాలల హక్కుల సంఘం స్థాపించి, ఎక్కడ బాలల హక్కులకు విఘాతం కలిగినా, బాలలకు అన్యాయం జరిగినా వెంటనే స్పందిం చేవారు. క్షణాల్లో అక్కడికి వెళ్లి, ఆ సమస్యను పరిష్కరించి, బాలలకు ఎలాంటి ఇబ్బంది కలగ కుండా తగిన చర్యలు తీసుకునేవరకు నిద్రపోని వ్యక్తిత్వం ఆయనది.
అనేకమంది కష్టాలలో మగ్గిపోతున్న బాల కార్మి కుల వివరాలు తెలుసుకుని, వారికి విముక్తి కలిగిం చడంలో సాహసోపేతమైన అడుగులు వేసి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నప్పటికీ చెక్కు చెద రని ఆత్మ విశ్వాసంతో, ధైర్యంతో ముందడుగు వేసిన పట్టుదల అచ్యుతరావుది.బాలల హక్కుల కోసం నిర్విరామ పోరాటం చేస్తున్న అచ్యుతరావు సేవలను గుర్తించి బాలల హక్కుల కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం పదవిని కట్టబెట్టినా, తన ఆలోచనలకు, ఆశయాలకు ఆ పదవి అవరోధంగా ఉందని భావించి కొంతకాలం తరు వాత బాలల హక్కుల కమిషన్ సభ్యులుగా కొనసాగ లేక అచ్యుతరావు బయటికి వచ్చేశారు.
బాలల హక్కుల సంఘం ఆధ్వర్యంలో అచ్యుతరావు తన భార్య అనూరాధతో కలసి ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరే కంగా అనేక కార్యక్రమాలు, కార్యశాలలు నిర్వ హించారు. ధర్నాలు జరిపారు. రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. వివిధ రంగాల లోని ప్రముఖులను ఒక వేదిక మీదకి తీసుకువచ్చి వారి అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. బాలల హక్కులకు విఘాతం కలి గించే సంస్థలకు, వ్యక్తులకు అచ్యుత రావు సింహ స్వప్నంగా తయారయ్యారు. బాలలను నిర్దాక్షి ణ్యంగా హింసించే, దండించే, లైంగిక వేధింపు లకు గురిచేసే వారి విషయంలో రాజీ పడటం, వెనుకంజ వేయటం అచ్యుతరావు నిఘంటువులోనే లేదు.
ఆడపిల్లల లైంగిక వేధింపులు, ఈవ్‌టీజిం గ్‌లను నివారించటం కోసం ప్రత్యేకంగా షీటీమ్ లను ఏర్పాటు చేయించారు అచ్యుతరావు. జంట నగరాలలోని పాఠశాలల్లో పదివేలమంది ఆడపిల్ల లకు ఆత్మ రక్షణ కోసం కరాటే మాస్టర్ నరేందర్‌తో ఉచిత కరాటే శిక్షణా తరగతులు ఏర్పాటు చేయిం చారు. వారిలో ధైర్యాన్ని నింపారు. ప్రభుత్వం కూడా పట్టించుకోని నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని, జూన్ 1న అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని ప్రతి ఏడాది క్రమం తప్ప కుండా చేయడం అచ్యుతరావు నిబద్ధత. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లల్లో, పెద్దల్లో బాలల హక్కులపట్ల అవగాహన కలిగించే పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక మంది యువతరం కార్యకర్తలను చైతన్యపరిచారు.
వీధి బాలలు, మురికివాడల్లోని పిల్లల ఆరోగ్యంకోసం, ఆనందం కోసం హెల్త్ క్యాంపులు, అవగాహనా సదస్సులు, సాంస్కృతిక కార్యక్ర మాలు అచ్యుతరావుతో కలిసి నేను కూడా నిర్వ హణలో నలభై ఏళ్లుగా పాలు పంచుకోవటం మర చిపోలేని అనుభవం. బాలల హక్కుల సంఘంలో సాంస్కృతిక కార్యదర్శిగా నన్ను నియమించి పిల్ల లకు సేవ చేసే అవకాశం కల్పించారు అచ్యుత రావు.
తాను నమ్మిన సిద్ధాంతాలను అమలు పరచ డంలో, బాలల హక్కుల రక్షణ కోసం ఉన్నత స్థాయిలో ఉన్నవారిని ఎదిరించడానికి సైతం వెను కాడకుండా రాజీలేని పోరాటం చేసిన అచ్యుతరావు లాంటి అత్యంత శక్తివంతమైన ఉద్యమ నేతలు చాలా అరుదుగా ఉంటారు.
వ్యాసకర్త
చొక్కాపు వెంకటరమణ
ప్రముఖ బాలసాహిత్య రచయిత
మొబైల్ : 92465 20050
Comments
Please login to add a commentAdd a comment