Achyutha rao
-
అచ్యుతరావుకు కరోనా సోకిందిలా...
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ మహమ్మారికి బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు బలికావడం ఆయన కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. నలుగురు అన్నదమ్ములతో కలిసి ఉంటూ ఉమ్మడి కుటుంబాలకు ఆదర్శంగా నిలుస్తోన్న అచ్యుతరావు ఫ్యామిలీలో తొలుత అతడి కుమారుడు కోవిడ్ బారిన పడ్డారు. సమీపంలోనే నివాసం ఉండే అతను ప్రతిరోజూ రాత్రి డిన్నర్ సమయంలో ఉమ్మడి కుటుంబంలో ఉండే అచ్యుతరావు నివాసానికి వచ్చి భోజనం చేసి వెళ్లేవాడు. కుమారుడు జూన్ 15న కోవిడ్ బారిన పడినా..తొలుత ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ఆ తర్వాత స్వల్ప లక్షణాలు కనిపించడంతో హోం ఐసోలేషన్‌లో ఉండి పూర్తిగా కోలుకున్నారు. (మూగబోయిన ‘బాలల’ గొంతు) అచ్యుతరావుకు జూలై 13న కోవిడ్ నిర్ధారణ అయ్యింది. అస్తమాతో బాధపడుతున్న ఆయనకు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తడంతో చికిత్స కోసం మలక్‌పేట్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. పది రోజులు కోవిడ్‌తో పోరాడి బుధవారం తనువు చాలించారు. అతని సోదరుడు సైతం కరోనా బారిన పడి అదే ఆస్పత్రిలో రెండురోజులపాటు చికిత్సపొంది ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు. అయితే చింతలకుంటలో నివాసం ఉంటున్న అచ్యుతరావు కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు, వారి భార్యలు, పిల్లలు మొత్తంగా పది మంది ఉంటారు. వీరంతా కోవిడ్ బారినపడ్డారు. ప్రస్తుతం అందరూ హోం క్వారంటైన్లో ఉండి కోవిడ్‌ను జయించడం విశేషం. కొందరిలో కనిపించని లక్షణాలు.. కోవిడ్ మహమ్మారి చాపకింద నీరులా ప్రవేశించి పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. ఆయా కుటుంబాల్లో యువకులు, ఆరోగ్యవంతులకు కోవిడ్ సోకినా ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో వారంతా ఇతర కుటుంబ సభ్యులతో కలిసే ఉంటున్నారు. టిఫిన్, భోజనం, డిన్నర్ కలిసే చేస్తున్నారు. తద్వారా ఇంట్లో ఉన్న అందరూ కరోనా బారినపడుతున్నారు. ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధులు, అస్తమా తదితర శ్వాసకోశ వ్యాధులున్నవారికి కోవిడ్ ప్రాణాంతకంగా మారుతోంది. మరోవైపు కోవిడ్‌పై అన్ని ప్రసార మాధ్యమాల్లో వస్తున్న సమాచారంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న కోవిడ్ రోగులు సడెన్ కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు విడుస్తుండటం గమనార్హం. (వాడిన మాస్క్‌లను ఎలా పడేయాలంటే..) కలిసి భోజనం చేయడంతో... ప్రతిరోజూ అచ్యుతరావు కుటుంబ సభ్యులంతా రాత్రి భోజనం కలిసే చేస్తారు. ఈ సమయంలో తొలుత అతని కుమారుడు కోవిడ్ బారినపడటం, అతనికి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడంతో రోజూ అందరూ కలిసి భోజనానికి కూర్చోవడంతో కోవిడ్ ఆ కుటుంబం మొత్తానికి సోకినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కోవిడ్ లక్షణాలున్నవారు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని..హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటించడం ద్వారా కోవిడ్‌ను జయించవచ్చని చెబుతున్నారు. -
మూగబోయిన ‘బాలల’ గొంతు
సాక్షి, హైదరాబాద్ : చిన్నారులకు పెద్దదిక్కుగా ఉంటూ వచ్చిన హక్కుల గొంతు మూగబోయింది. పిల్లలపై జరిగిన ఎన్నో అఘాయిత్యాలు, దారుణాలపై పోరాడి విజయం సాధించిన ఆయన కరోనాపై పోరులో ఓడిపోయారు. బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు పి.అచ్యుతరావు (58) కరోనాతో బుధవారం కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా నిర్ధారణైంది. అప్పటి నుంచి హోం ఐసోలేషన్‌లోనే ఉన్న ఆయన.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ నెల 15న మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చేరారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో పాటు మూత్రపిండాల వైఫల్యం, మధుమేహం వంటి ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య అనురాధారావు, పిల్లలు ఉన్నారు. ఆయనతో పాటే వైరస్ బారినపడి సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన ఆయన సోదరుడు, కార్టూనిస్ట్ శ్రీధర్ కోలుకొని బుధవారమే డిశ్చార్జ్ అయ్యారు. బాలల హక్కుల గొంతై.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లికి చెందిన అచ్యుతరావు చిన్నతనంలోనే కమ్యూనిస్టు ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారు. ఏఐఎస్ఎఫ్లో పనిచేశారు. బాలల హక్కుల కమిషన్ సభ్యుడిగా పనిచేశారు. పిల్లలకు ఎక్కడ ఎలాంటి అన్యాయం జరిగినా సహించేవారు కాదు. 1985లో ఆయన బాలల హక్కుల సంఘాన్ని స్థాపించారు. బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. బాలల హక్కులపై న్యాయస్థానాల్లోనూ పోరాటం చేశారు. ఆయన లేవనెత్తిన పలు అంశాలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సహా హైకోర్టును కూడా కదిలించాయి. బాలల హక్కుల పరిరక్షణ కమిటీ (ఎస్సీపీసీఆర్) సభ్యుడిగానూ ఆయన సేవలందించారు. ప్రత్యూషకు అండగా నిలిచి.. ఎల్బీనగర్లో సవతి తల్లి చేతిలో శారీరక, మానసిక హింసకు గురైన ప్రత్యూషకు అండగా నిలిచారు. స్థానిక పోలీసులు, మీడియా సహకారంతో సవతి తల్లి బాధ నుంచి ఆమెకు విముక్తి కల్పించారు. అప్పట్లో ఇది జాతీయస్థాయిలో చర్చనీయాంశమైంది. మతపరమైన వేడుకల్లో భాగంగా ఉపవాసం ఉండటంతో మృతిచెందిన జైన్ సమాజానికి చెందిన 13 ఏళ్ల ఆరాధన సమాదరియా కేసు, యాదాద్రిలో పిల్లల అక్రమ రవాణా, నల్లగొండ జిల్లాలో జంటలకు పిల్లలను విక్రయించడం వంటి అనేక అంశాలను ఆయన వెలికితీశారు. నారాయణగూడలోని కుబేరా టవర్స్‌లో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి.. అక్కడి నుంచే చిన్నారులు ఎదుర్కొనే ఎన్నో సమస్యలను పరిష్కరించే వారు. దంపతుల గొడవల మధ్య నలిగిపోయే పిల్లలను చేరదీసేవారు. బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ముంబై, ఢిల్లీ, ఛండీఘర్ వంటి ప్రాంతాల నుంచి బాలలను రప్పించి పనుల్లో పెట్టుకునే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించేవారు. ప్రముఖల ఇళ్లలో 18 ఏళ్లులోపు బాలలు పనిచేస్తున్నట్టు తెలిస్తే ఆయన వెంటనే స్థానిక పోలీసుల సాయంతో రెస్క్యూ చేసి మరీ సంరక్షించేవారు. -
బాలల హక్కుల రక్షణకు రాజీలేని పోరాటం
బాలల హక్కుల పరి రక్షణ కోసం గత నలభై ఏళ్లుగా తన జీవితాన్ని అంకితం చేసిన కార్యకర్త అచ్యుతరావు. తను చేసే పనిపట్ల నమ్మకం, గౌరవం, నిజాయితీ, నిబ ద్ధత గల కార్యశీలుడు ఆయన. బాలల హక్కుల సంఘం స్థాపించి, ఎక్కడ బాలల హక్కులకు విఘాతం కలిగినా, బాలలకు అన్యాయం జరిగినా వెంటనే స్పందిం చేవారు. క్షణాల్లో అక్కడికి వెళ్లి, ఆ సమస్యను పరిష్కరించి, బాలలకు ఎలాంటి ఇబ్బంది కలగ కుండా తగిన చర్యలు తీసుకునేవరకు నిద్రపోని వ్యక్తిత్వం ఆయనది. అనేకమంది కష్టాలలో మగ్గిపోతున్న బాల కార్మి కుల వివరాలు తెలుసుకుని, వారికి విముక్తి కలిగిం చడంలో సాహసోపేతమైన అడుగులు వేసి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నప్పటికీ చెక్కు చెద రని ఆత్మ విశ్వాసంతో, ధైర్యంతో ముందడుగు వేసిన పట్టుదల అచ్యుతరావుది.బాలల హక్కుల కోసం నిర్విరామ పోరాటం చేస్తున్న అచ్యుతరావు సేవలను గుర్తించి బాలల హక్కుల కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం పదవిని కట్టబెట్టినా, తన ఆలోచనలకు, ఆశయాలకు ఆ పదవి అవరోధంగా ఉందని భావించి కొంతకాలం తరు వాత బాలల హక్కుల కమిషన్ సభ్యులుగా కొనసాగ లేక అచ్యుతరావు బయటికి వచ్చేశారు. బాలల హక్కుల సంఘం ఆధ్వర్యంలో అచ్యుతరావు తన భార్య అనూరాధతో కలసి ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరే కంగా అనేక కార్యక్రమాలు, కార్యశాలలు నిర్వ హించారు. ధర్నాలు జరిపారు. రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. వివిధ రంగాల లోని ప్రముఖులను ఒక వేదిక మీదకి తీసుకువచ్చి వారి అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. బాలల హక్కులకు విఘాతం కలి గించే సంస్థలకు, వ్యక్తులకు అచ్యుత రావు సింహ స్వప్నంగా తయారయ్యారు. బాలలను నిర్దాక్షి ణ్యంగా హింసించే, దండించే, లైంగిక వేధింపు లకు గురిచేసే వారి విషయంలో రాజీ పడటం, వెనుకంజ వేయటం అచ్యుతరావు నిఘంటువులోనే లేదు. ఆడపిల్లల లైంగిక వేధింపులు, ఈవ్‌టీజిం గ్లను నివారించటం కోసం ప్రత్యేకంగా షీటీమ్ లను ఏర్పాటు చేయించారు అచ్యుతరావు. జంట నగరాలలోని పాఠశాలల్లో పదివేలమంది ఆడపిల్ల లకు ఆత్మ రక్షణ కోసం కరాటే మాస్టర్ నరేందర్‌తో ఉచిత కరాటే శిక్షణా తరగతులు ఏర్పాటు చేయిం చారు. వారిలో ధైర్యాన్ని నింపారు. ప్రభుత్వం కూడా పట్టించుకోని నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని, జూన్ 1న అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని ప్రతి ఏడాది క్రమం తప్ప కుండా చేయడం అచ్యుతరావు నిబద్ధత. ఈ కార్యక్రమాల ద్వారా పిల్లల్లో, పెద్దల్లో బాలల హక్కులపట్ల అవగాహన కలిగించే పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక మంది యువతరం కార్యకర్తలను చైతన్యపరిచారు. వీధి బాలలు, మురికివాడల్లోని పిల్లల ఆరోగ్యంకోసం, ఆనందం కోసం హెల్త్ క్యాంపులు, అవగాహనా సదస్సులు, సాంస్కృతిక కార్యక్ర మాలు అచ్యుతరావుతో కలిసి నేను కూడా నిర్వ హణలో నలభై ఏళ్లుగా పాలు పంచుకోవటం మర చిపోలేని అనుభవం. బాలల హక్కుల సంఘంలో సాంస్కృతిక కార్యదర్శిగా నన్ను నియమించి పిల్ల లకు సేవ చేసే అవకాశం కల్పించారు అచ్యుత రావు. తాను నమ్మిన సిద్ధాంతాలను అమలు పరచ డంలో, బాలల హక్కుల రక్షణ కోసం ఉన్నత స్థాయిలో ఉన్నవారిని ఎదిరించడానికి సైతం వెను కాడకుండా రాజీలేని పోరాటం చేసిన అచ్యుతరావు లాంటి అత్యంత శక్తివంతమైన ఉద్యమ నేతలు చాలా అరుదుగా ఉంటారు. వ్యాసకర్త చొక్కాపు వెంకటరమణ ప్రముఖ బాలసాహిత్య రచయిత మొబైల్ : 92465 20050 -
కరోనాతో బాలల హక్కుల సంఘం నేత మృతి
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ బాలల హక్కుల సంఘం నేత పీ అచ్యుతరావు కరోనా బారిన పడి మరణించారు. ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో చికిత్స పొందుతున్న ఆయన మలక్ పేట యశోద ఆసుపత్రిలో బుధవారం తుది శ్వాస విడిచారు. అచ్యుత రావు అకాలమరణంపై పలువురు ప్రజా సంఘ నేతలు, ఇతరులు సంతాపం వ్యక్తం చేశారు. బాలల హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడైన అచ్యుతరావు బాలలు, శిశు హక్కుల సంరక్షణ నిమిత్తం అనేక పోరాటాలు నిర్వహించిన సంగతి విదితమే. భార్య అనూరాధతో బాలల హక్కుల సంఘాన్ని స్థాపించిన అచ్యుత రావు గతంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ (ఎస్సీపీసీఆర్) సభ్యుడుగా పనిచేశారు. చదవండి: అనాథల పట్ల ముందు జాగ్రత్త అవసరం -
పెళ్ళి పిల్లలని కనడం కోసమేనా?
మహిళలు సమాజంలో సగం ఐనప్పటికీ మహిళలు ఎలా వుండాలి, ఎవర్ని పెళ్ళి చేసుకోవాలి, ఉద్యోగం చేయవచ్చా లేదా, ఎంతమంది పిల్లలని కనాలి, ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలి వంటి విషయాలు పురుషులే నిర్ణయిస్తున్నారు. మన పురాణాలు పరిశీలించినా, ఆ పురాణాలు ప్రవచనాలు వుటంకించినా ఆ పురాణ పురుషులే స్త్రీల తలరాత రాస్తున్నారు. ఉదాహరణకి అమ్మాయిలు ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలి అనే విషయంపై వ్యాఖ్యానిస్తూ ఎనిమిది సంవత్సరాల బాలికను కన్యగా పరిగణించాలన్నారు. పురుషాధిక్య పెద్దలు ఇంకా ఓ అడుగు ముందుకేసి గర్భాష్టకాలు అంటే తల్లి కడుపులో పడ్డప్పటినుంచే వయసు ఎనిమిదేళ్ళుగా లెక్కించి కన్యగా ఎంచమన్నారు. నలభై యేళ్ళ క్రితం వరకు ఏడు, ఎనిమిది యేళ్ళకు పెళ్ళిళ్ళు జరగడం సర్వసాధారణం. ఇలా ఉండగా 1927లో లార్డ్ ఇర్విన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన రాయివిలాస్ హరిబచన్ శారద ఓ ప్రతిపాదన చేస్తూ అమ్మాయికి పద్నాలుగు, అబ్బాయికి పద్దెనిమిదేళ్ల వయసు వచ్చేదాక పెళ్ళిళ్ళు జరగకుండా చట్టం తేవాలని యోచించగా ఆ ప్రతిపాదన 1930లో చట్టరూపం దాల్చింది. కానీ ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో ఎటువంటి ప్రచారానికి నోచుకోలేదని ఫలితంగా ఆ చట్టం అమలు కాలేదనీ, పైగా కొన్ని వర్గాల మనోభావాలు దెబ్బతీసిందనీ భారత తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ 1950లో పార్లమెంటులో ఈ చట్టంపై మాట్లాడుతూ తన అసంతృప్తిని వ్యక్తం చేసి చిన్న మార్పులు చేస్తూ అమ్మాయిల కనీస వివాహ వయస్సు పదహారుగా మార్చి ఆ చట్టాన్ని అలాగే కొనసాగించి కొంత ప్రచారం కల్పించడంతో 1978 వరకు దాన్ని శారదా చట్టంగానే సంబోధిస్తూ వచ్చారు. ఇక 1978లో బాలికల కనీస వివాహ వయస్సు పద్దెనిమిదేళ్లకు మారుస్తూ బాలురకు మాత్రం ఇరవై ఒక్క సంవత్సరాలకు పెంచారు ఈ పరిణామాలు చూస్తే ఎప్పుడూ బాలికల వయస్సు కంటే అబ్బాయిల వయస్సు ఎక్కువ వుండేలా చూశారు కానీ దాంట్లో శాస్త్రీయత ఎంత అన్నది కనీసం పరిశీలించిన పాపాన పోలేదు. బాల్య వివాహాలు జరిగితే నష్టపోయేది బాలికలేననీ, అబ్బాయిలకు, అమ్మాయిలకు వయసులో తేడావుండాలన్నది.. పురుషాధిక్య సమాజం మహిళలపై పురుషులు పెత్తనం చేయడానికి చెబుతున్న కుయుక్తనీ, దానిలో ఏమాత్రం శాస్త్రీయత లేదని ఇప్పుడున్న పద్దెనిమిదేళ్ల షరతు బాలికలకు అన్యాయం చేసేదని ఆ వయసులో అమ్మాయిలు కనీసం పట్టభద్రులు కూడా కాలేరని బాలల హక్కుల సంఘం అభిప్రాయపడుతోంది. పిల్లలను కనడానికి ఈ వయసు సరైనది కాదని, ఈ వయసులో పిల్లలను కంటున్నదునే దేశంలో మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా వుందని బాలికకు పద్దెనిమిది,బాలురకు ఇరవైఒక్కయేళ్ళు అనే నిబంధన లింగ వివక్ష అనీ సమన్యాయం కాదని అనేక ర్యాలీలు ,సమావేశాలు, నివేదనలు బాలల హక్కుల సంఘం చేపట్టింది. పైగా కేంద్ర సర్కారు సమన్యాయం కోసం అబ్బాయిల వివాహ వయస్సు పద్దెనిమిదికి చేస్తామనడంతో ఇదెక్కడి నీతి అని పలువురు ప్రశ్నించడంతో వెనక్కి తగ్గింది. కానీ ఇటీవల ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టు ప్రస్తుత పద్దెనిమిది, ఇరవై ఒకటి అనే విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ పద్నాలుగు, పదిహేను,ఇరవై ఒకటికి విరుద్ధంగా వున్నాయని చెప్పటంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని పరిశీలించడానికి ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అమ్మాయిల కనీస వివాహ వయస్సు పెంచడానికి, అమ్మాయిలు గర్భధారణ చేయడానికి అనుకూల వయసుపై పరిశీలన జరపాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్‌కి చెప్పడం మళ్ళీ మనుధర్మ శాస్త్రాన్నే ప్రవచించినట్లు కాదా? అమ్మాయిలు కేవలం పిల్లల్ని కనడానికే వున్నట్లు, అమ్మాయిల పెళ్లి కూడ పిల్లల కనడానికే అన్నట్టు, పిల్లలని కనడం జీవితంలో ఓ భాగం కాకుండా అదే జీవితమన్నట్లుగా మళ్ళీ పురుషుడికే పట్టం కడుతున్న కేంద్ర ప్రభుత్వ ధోరణిని ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాలి. అచ్యుత రావు వ్యాసకర్త గౌరవ అధ్యక్షుడు,బాలల హక్కుల సంఘం 9391024242 -
అనాథల పట్ల ముందు జాగ్రత్త అవసరం
లాటిన్ భాషలో కరోనా అంటే కిరీటం అని అర్థం. ప్రపంచాన్ని ఇప్పుడు గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మైక్రోస్కోప్‌లో చూస్తే కిరీటం ఆకారంలో కనిపిస్తుంది. కావున దానికి కరోనా అని నామకరణం చేశారు. ఇప్పుడు ఇది కిరీటధారియై మహారాజు వలె ప్రపంచాన్ని ఏలుతున్నది. ధనిక, గొప్ప తేడా లేకుండా అందరినీ సంహరిస్తున్నది. ప్రపంచ యుద్ధాలకంటే అధికంగా కరోనా భయోత్పాతం సృష్టిస్తున్నది. చైనాలోని వుహాన్‌లో పుట్టి, చంఘిస్ఖాన్కి పదింతలు ప్రపంచాన్ని వణికిస్తున్నది. కోవిడ్ 19 వ్యాధితో ఇటలీ, ఇరాన్, స్పెయిన్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, బెల్జియం లాంటి ఎన్నో దేశాల్లో ఇప్పటికే వేలాది మంది చనిపోయారు. ఇంకా కొత్త కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఎప్పుడూ ప్రపంచానికి పెద్దన్నను నేనే, నా మాటే శాసనం, నా చేతలే అందరూ పాటించాలి అనే అమెరికా సైతం కరోనా ముందు మోకరిల్లక తప్పలేదు. విశ్వవ్యాప్తంగా విజృంభిస్తూ, పౌరుల ప్రాణాలను తీస్తూ, ప్రభుత్వాలను ఆర్థికంగా దెబ్బకొడుతూవున్న కరోనాను కట్టడి చేయలేమా? దీనికి తల పండిన వైద్య శిఖామణుల దగ్గర నుండి, అక్షర జ్ఞానం లేని సామాన్యులు సైతం చెబుతున్నది ఒకటే. ఒకరి నుండి ఇంకొకరికి సంక్రమించకుండా వుండాలంటే మనం బయటికి వెళ్లకుండా ఇంట్లోనే బందీ కావడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం. ఈ సూచనలు ఇల్లు, ఉద్యోగం వున్న వారికి సరిపోతాయి. కానీ ఏ ఇల్లు, ఏ దిక్కూ దిశా లేని, రెక్కాడితే కాని డొక్కాడని పేద జనానికి ఈ సలహా మాత్రమే చాలదు. అందుకని ప్రభుత్వాలు వస్తు, ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. ముందు ముందు ఎన్నో పనులు ఆగిపోయి సంస్థలే మూసివేయాల్సిన దుస్థితి. రాబోయే కాలంలో లఘు పరిశ్రమలూ, సంస్థలూ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడి నిరుద్యోగుల సంఖ్య పెరగవచ్చు. ఈ మహమ్మారితో పెద్దల పరిస్థితి ఇలా వుంటే పిల్లల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వారికి ఏమి జరుగుతుందో తెలియదు. తమ పాఠశాలలు ఎందుకు మూతపడ్డాయో తెలియదు. చదువే కాదు, ఇంటి పక్కనే ఉన్న ఆటస్థలాల్లో కూడా ఆడుకోలేని పరిస్థితి. ఎనిమిది, పదేళ్ల వయసు నుండీ తెలిసీ తెలియని పిల్లలకు ఏమీ చెప్పకుండా తోటివారితో కలవవద్దని కట్టడి చేస్తే వారు మానసికంగా దెబ్బతినే ప్రమాదం వుంటుంది. పిల్లలు సున్నితమైన మనసు కలిగి వుంటారు కావున వారికి ఒకటికి రెండు సార్లు విడమర్చి చెప్పాలి. వారికి వారే స్వీయ నియంత్రణ పాటించేలా చేయాలి. అలాగే బయట ఆడటానికి వెళ్లే అవకాశం లేనందున, కేవలం వారిని టీవీలకు పరిమితం చేయకుండా, వారి మేధస్సును పెంచే చదరంగం లాంటి ఆటలు ఆడించటం, బొమ్మలు వేయడంలో అభిరుచి వుంటే ఆ మేరకు బొమ్మలు వేయిం చడం, కథలు, కవిత్వం రాసేలా ప్రోత్సహించడం ద్వారా వారిని సహితం మానవ సమాజం కరోనాపై చేస్తున్న పోరాటంలో భాగస్వాములను చేయవచ్చు. ఇదంతా తల్లిదండ్రులు వున్న పిల్లల పరిస్థితి. ఎవరూ లేని వారి కష్టాలు మరీ ఘోరం. అనాథలుగా శిశుగృహాల్లో, అనాథ శరణాలయాల్లో, చట్టంతో విభేదించి బాలల, బాలికల గృహాల్లో మగ్గుతున్న పిల్లల క్షోభ కడు దయనీయం. జైళ్లలో వుండే ఖైదీలను పెరోల్ పైన వదిలేస్తే తమవారి వద్దకి చేరే అవకాశమైనా వుంది. కానీ ఈ అనాథ చిన్నారులు ఎక్కడికని పోతారు? ఏది ఏమైనా వారు ఆ గృహా ల్లోనే వుండాలి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొందరు దాతలు అనా«థాశ్రమాలను నడిపిస్తున్న వారి వద్ద వుండే పిల్లలకు ఏరోజుకు ఆరోజు ఆహారాన్ని అందిస్తూ ఉండేవారు. వారే కాదు, అప్పుడప్పుడు వచ్చి అనాథల మధ్య పుట్టిన రోజులు, పుణ్య దినాలు జరుపుకునే వారు సైతం రాలేని సందర్భం. అన్నం పెట్టే దాతలు లేక పిల్లలు పస్తులుండే పరిస్థితులు రాకుండా వుండాలంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా అన్ని అనాథ ఆశ్రమాలను, శిశు గృహాలను వెంటనే తనిఖీ చేయించాలి. కావాల్సిన ఆహారం, వసతి కల్పించాలి. అలాగే ఒక్కో గదిలో పదుల సంఖ్యలో ఉండకుండా విడివిడిగా వుండే ఏర్పాట్లు చేయాలి. ఎవ్వరికీ పట్టని పిల్లల గురించి ప్రభుత్వాలు పట్టించుకోవాలి, యుద్ధ ప్రాతిపదికన వారి స్థితిగతులను సమీక్షించాలి. ఆ పిల్లలని వెంటనే ఆదుకోవాలి. ఈ మహమ్మారికి ముందు జాగ్రత్తనే మందు కాబట్టి, అనా«థ పిల్లలపట్ల కూడా ఆ ముందు జాగ్రత్త అనే మందును తప్పనిసరిగా ప్రయోగించాలి. వ్యాసకర్త : అచ్యుతరావు బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు మొబైల్ : 93910 24242 -
అత్యాచారాల నిరోధానికి ‘దిశా’ నిర్దేశం
యావత్ భార తదేశాన్ని నిర్భయ ఘటన తర్వాత మళ్లీ ఉలిక్కిపడేలా చేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకున్న దిశ ఘటన. అమ్మాయిని పథకం ప్రకారం కదలనివ్వకుండా చేసి సామూహిక అత్యాచారం, ఆపై తగలబెట్టి హత్య చేసిన ఘటన ప్రజలందరికీ గల్లీ నుండి ఢిల్లీ దాకా వణుకు పుట్టించింది. అలాగే బాధితురాలికి న్యాయం చేయా లంటే నిందితులను చంపెయ్యాల్సిందే అని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో అన్నారు, చివరకు అదే జరిగింది. కానీ నిందితులను చంపడం ద్వారా నేరాలు అరికట్టలేమన్నది విజ్ఞతతో ఆలోచించిన ప్పుడే తెలుస్తుంది. చాలామంది అరబ్ దేశాల్లో నేరం చేసిన వాళ్లను అక్కడికక్కడే చంపేస్తారని చెబుతుంటారు కానీ అలా చంపేసినా నేరాలు ఆగడం లేదన్న నిజాన్ని గమ నించాలి. అంతేకాకుండా ఆ దేశాలు ఇంకా రాజరికపు ఫ్యూడల్ వ్యవస్థల్లోనే ఉన్నాయి. భారతదేశం అలా కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తున్న ఫెడరల్ యూనిటరీ వ్యవస్థగా కొనసాగుతున్న దేశం అలాంట ప్పుడు ఓ ప్రజాస్వామ్య దేశాన్ని రాచరికపు దేశాలతో పోల్చలేము. కానీ విజ్ఞతతో ఆలోచించి నేరాలకు పాల్ప డిన వారిని విచారణ లేకుండా అనాగరి కంగా చంపడం సరైన పద్ధతి కాదని గ్రహించి చట్టాలను మార్చాలి. పౌరులను విద్యావంతులను చేసే దిశగా అడుగులు వేస్తే నేరాలను నిరోధిం చవచ్చు. సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తితో తమ రాష్ట్రానికంటూ ఇలాంటి నేరాలు తగ్గించాలనే స్ఫూర్తితో ‘దిశ’ చట్టాన్ని తీసుకువచ్చింది. ఘటన తెలంగాణలో జరిగినా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ రాష్ట్రంలో జరగకుండా కట్టడి చేయడానికి దిశ చట్టాన్ని తెచ్చిన జగన్ సర్కారుకు జేజేలు. గణాంకాల ప్రకారం ఆడపిల్లలపై 2014లో 13,549 నేరాలు జరుగగా, వరుసగా 2015లో 13,088, 2016లో 13,948, 2017లో 14,696 ఘటనలు.. 2018లో 14,048 ఘటనలు చోటు చేసు కున్నాయి. ఇంకా ఈ నేరాల సంఖ్యను తగ్గించి సమస్యను పరిష్కరించే దిశగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 173, 309ని సవరించి, నేరం జరిగిన ఏడు రోజుల్లో విచారణ పూర్తి చేయడం పద్నాలుగు రోజుల్లో చార్జిషీట్, సాక్షుల విచారణ చేసి కేవలం మూడు వారాల్లో నిందితులకు శిక్ష ఖరారు చేసే దిశగా చట్ట సవరణ చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో వేధిస్తే రేండేళ్ల శిక్షపడేలా, అత్యాచారాలకు మరణదండన పడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, వెనువెంటనే శాసనసభ ఆమో దం హర్షించదగ్గది. ఈ చట్టాన్ని ఇతర రాష్ట్రాలలో సహితం అమలుచేస్తే మంచి ఫలితాలు ఇస్తుందన్న దాంట్లో అనుమానం లేదు. కేవలం శిక్షలు వేస్తామనడమే కాకుండా చిన్ననాటి నుండి ఉపయోగమైన ఇంగ్లిష్ మీడియం విద్యను పేద పిల్లలకు సహితం అందుబాటులోకి తేవడం, ప్రతి నేరం వెనుక మద్యం ఉత్ప్రేరకంగా ఉంటున్నం దున దశలవారీ మద్య నిషేధం బాలి కలకూ, మహిళలకూ శ్రీరామరక్షగా నిలు స్తుందనడంలో సందేహం లేదు. వ్యాసకర్త : అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం మొబైల్ : 93910 24242 -
నేటి బాలలు – రేపటి పౌరులేనా?
నేడు బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంద ర్భంగా మైకు పట్టిన ప్రతి ఒక్కరం బాలలే భావి భారత పౌరులం అని అంటారు. కానీ ఆ భావి భారత పౌరుల స్థితి గతులు చూస్తే మాత్రం తల్లి గర్భం నుండి బయటపడక ముందే వారు ఆడా, మొగా అనే వివక్షతో తల్లి గర్భంలోనే చిదిమేస్తున్నాం. ఇక ఈ అవాంతరాన్ని దాటుకొని భూమిపైకి వస్తే వారే కోరుకొని ఈ నేలపైకి వచ్చినట్లు పంచాంగ పండితులు ఈ ఘడియలో, ఆతిధిలో పుట్టారు వీరు వారికి అరిష్టం, అష్టదరిద్రం అని ఎలాంటి తల, తోకా లేని అశాస్త్రీయమైన శాస్త్రీయాన్ని ముందుకు తెచ్చి పూర్తి కుటుంబం ముక్కు పచ్చలారని ఆ చిన్నారులను ద్వేషించేలా చూస్తాం. ఇక పిల్లల ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో రాసుకున్నాము కానీ ఏ ఒక్కటీ ఆచరణలో పెట్టక వారిని సరైన వైద్యానికీ, పౌష్టికాహారానికీ, గౌరవంగా బతికే పరిస్థితికీ దూరం చేస్తున్నాం కనీసం వారికి రక్షిత మంచినీరు అందించడం చేత గాక అనేక వ్యాధుల పాలు చేస్తున్నాం. నినాదాల్లో మాత్రం ‘‘బేటీ పడావ్ – బేటీ బచావ్’’ అని కారు కూతలు పెడుతున్నాముగాని చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మంచి నీరు గానీ, శౌచాలయాలుగానీ లేకపోవడంతో బడి మధ్యలో మానేసి బాల కార్మికులుగా, బాలికా వధువులుగా మారుతున్నవారి శాతం దేశంలో 18పైగానే వుందంటే మీకు నినాదమే తప్ప ఈ సమస్యను అధిగమించడానికి విధానం లేదన్నది తెలుస్తున్నది. పిల్లల మీద పెద్దలకు ఎంత ప్రేమ వున్నదంటే గత ఆరు సంవత్సరాల నుండి బాలల దినోత్సవం నాడు మన ప్రధాని మోడీజీ విదేశాలలోనే వుంటున్నారు గాని కనీసం బాలల దినోత్సవం నాడు దేశంలోని చిన్నారులను ఆశీర్వదించడానికి మనసు రావడం లేదంటే ఆనినాదంలో నిజాయితీ లేదని ఇట్టే తెలసిపోతున్నది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు పిల్లల కోసం ఆలోచించి అక్షరాస్యత పెంపొందించడంతో పాటు బడా బాబుల పిల్లలతో సరితూగేలాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు బోధన మొదలు పెడతామంటే, పేదవారికి ఇంగ్లీషు ఎందుకు వారు బాలకార్మికులుగా బతకడమే సరి అనుకున్నారేమోగానీ కొందరు పెద్ద మనుషులు ఇంగ్లీషు బోధనకు అడ్డు చెబుతూ తెలుగు భాషపై ఎనలేని ప్రేమ ఒలక బోస్తున్నారు. పేద పిల్లలకు ఇంగ్లీషు బడులు వద్దంటే వద్దని మొండి వాదనలు చేస్తూ, వారు పెంచి పోషించిన ప్రైవేటు, కార్పోరేటు విద్యా సంస్థలకు కాపలా కుక్కలుగా నిలచిన వీరు పేద పిల్లలకు ఇంగ్లీష్ వద్దంటే వద్దని ఎక్కడ పడితే అక్కడ వాదిస్తున్నారు. ఇక పద్దెనిమిది సంవత్సరాలకే ఆడ పిల్లలకు వివాహం వద్దని, పద్దెనిమిది సంవత్సరాలకు కనీసం గ్రాడ్యుయేషన్ కూడా చేయలేరని పెళ్ళి జరిగితే భర్తపై పరాన్నజీవిగా బతకాల్సి వస్తుందని, స్త్రీకి ఆర్థిక సాధికారత వుండాలని స్త్రీ పురుషుల సమానత్వం కోసం అమ్మాయిల కనీక వివాహ వయస్సు ఇరువై ఒక్క సంవత్సరాలుగా చేయాలని బాలల హక్కుల సంఘం అరిచి గీ పెడితే, స్త్రీ, పురుష సమానత్వం పేరున పురుషుల వయస్సును పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గిస్తామని ఆలోచిస్తున్నారు. మన కేంద్ర పెద్దలు, ఇదే కనక జరిగితే పద్దెనిమిది సంవత్సరాలకే భార్యా భర్తలై, చదువుకు దూరమై సంపాదన లేక పిల్లల్ని మాత్రం కని బికారుల్లా రోడ్లపైన పడితే, వారందరికి సకుటుంబ అనాధ ఆశ్రమాలు కట్టించాల్సి రావడమే కాకుండా మాతా, శిశు మరణాలు పెరిగి, మానసిక శారీరక వికలాంగులైన పిల్లలు జన్మిస్తే ఇక రేపటి పౌరులు ఎలాంటి జవ సత్వాలు లేక మహాకవి గురజాడ చెప్పినట్లు ‘ఈసురోమని మనుషులుంటే – దేశమేగతి బాగుపడునోయ్’’ అన్నట్లు ఈ దేశం మరో ఇథోపియో కాకమానదు. కే్రంద ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేసేటప్పుడు దేశంలోని పిల్లలను దృష్టిలో పెట్టుకోకుండా కేవలం నాలుగు ఓట్లు సంపాదిస్తే చాలు సీట్లో కూర్చోవచ్చన్న ఆలోచనలు చేసి పెళ్ళి చేసుకోండి,డబ్బులిస్తాం అంటే, పెళ్ళి చేసుకోండి కానీ చదివి బాగుపడి స్వంత కాళ్ళపై నిలబడకండి మేము వేసే బిచ్చాలతో దంపతులై విద్యలేక, ఆరోగ్యం లేక ప్రజలందరూ కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా తయారవమని సలçహా ఇవ్వడమేకాని మరోటికాదు. చిన్న పిల్లల, విద్యార్థుల అభివృద్ధి కోసం పథకాలు చేపట్టి అమలు చేస్తున్న వారిని అడ్డుకోవడం పక్కన బెట్టి, ఆరోగ్యకరమైన సలహాలు ఇచ్చి, ఇటు పాలక పక్షం, అటు ప్రతిపక్షంలో వున్న వారు నిజాయితీగా ఆలోచించి పిల్లల విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆట పాటలు వారి గౌరవం కోసం పాటు పడిన నాడే నేటి బాలలే రేపటి పౌరులు అని నిజాయితీగా అనే రోజు వస్తుంది. లేదంటే కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితం అవుతాం. (నేడు బాలల దినోత్సవం) అచ్యుతరావు గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం 931024242 -
పిల్లల కన్నీళ్లు తుడిచేవారేరీ?
రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు అనేక బాధలకు గురవుతున్నారు. కానీ 18 ఏళ్లు దాటిన ఓటరులైన పౌరుల మీద దృష్టి పెట్టిన నేతలకు పిల్లల సమస్య పెద్దదిగా అనిపించడం లేదు. తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు పుణ్యమా అని సుమారు 20మంది బాలబాలికలు ఉరేసుకుని ఉసురు తీసుకున్నారు. కనీసం, పిల్లలను కోల్పోయిన దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను పరామర్శించడానికి కూడా ఈ నేతలకు మనసు రాలేదు. బాలల హక్కుల సంఘం పిటిషన్‌తో హైకోర్టు ములు గర్రతో గుచ్చితే తప్ప వీరిలో కదలిక రాలేదు. పిల్లలు పరీక్షల్లో ఫెయిల్ అయి నంత మాత్రాన నుయ్యో, గొయ్యో చూసుకోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పే విద్యా సంస్థ ఒక్కటి కూడా లేదు. పైగా, చదవనైనా చదవాలి లేదా చావాలి అన్న రీతిలో నిద్రాహారాలకు సైతం విద్యార్థులను దూరం చేస్తున్న సంస్థలు ఎన్నో. విద్యా వ్యవస్థ సంగతి అలా వుంచితే, బాలబాలికలకు కనీస రక్షణ కూడా కరువవుతోంది. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నాలుగు నెలల్లోనే వందకు పైగా అత్యాచారాలు జరిగినట్టు ఎఫ్ఐఆర్ నివేదికలే చెబుతున్నాయి. అనేక సందర్భాల్లో ఉపాధ్యాయులే కీచక పాత్ర పోషించడం విషాదకరం. హత్యల విషయంలో కూడా తెలుగు రాష్ట్రాలు రెండూ పోటీపడుతున్నాయి. ఇవన్నీ ఒకవైపు అయితే, మరోవైపు బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతు న్నాయి. హైటెక్ ముఖ్యమంత్రినని చెప్పుకునే చంద్రబాబు ఏలుబడిలోని అనంతపురం జిల్లాలో అన్నం దొరకక మట్టితిని బాలిక చనిపోయిన ఘటన అందరి హృదయాలను కలిచివేసినా, ఏలికలో మాత్రం ఎటువంటి స్పందన కలిగించలేదు. అన్నివిధాలుగా పిల్లలు హీనంగా, దీనంగా బతుకుతూ వుంటే ఏలినవారు మాత్రం ఓట్లవేటలో మునిగితేలుతున్నారు. ఓటు హక్కులేని ఈ పిల్లల గొడవ వారికి వినిపించడం లేదు. కానీ, పిల్ల లపై ప్రేమ ఉన్నవారు, వారి హక్కుల కోసం పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. -అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం మొబైల్ : 93910 24242 -
భద్రత లేని బాల్యం
బాల్యం బాగుంటేనే భవిష్యత్తులో పౌరులు బాగుంటారు. లేకుంటే ఆరోగ్యపరంగా, విద్యాప రంగా వెనుకబడిన పౌరులతో దేశం మొత్తం బల హీనంగా తయారౌతుందని అందరికీ తెలుసు కానీ ఈ బాల్యానికి భద్రత అనేది మాత్రం అందని ద్రాక్షలాగానే తయారైంది. ఈ బాధ్యత ఇక్కడ, అక్కడ అని కాకుండా తల్లి ఒడి నుంచి పాఠశాలల దాకా అవసరం కానీ మన చిన్నా రులకు తల్లి గర్భం నుండే భద్రత కరువౌతున్న వాదనకు రెండు తెలుగు రాష్ట్రాలలో బయటపడ్డ సరోగసీ రాకెట్, పిల్లల అక్రమ రవాణా కేసుల్లో ఈ రెండు రాష్ట్రాలు మొదటి, రెండు స్థానాల్లో నిలుస్తున్నాయని కేంద్ర నివేదికనే చెప్పింది. అలాగే యాదాద్రి ఘటన, హైదరాబాద్‌లో పాఠశాలలు కూలి పిల్లలు మృతి చెందడం, వీధి కుక్కల బారిన పడటం, పాఠశాల బస్సు ప్రమా దాల్లో మృతి చెందటం, బాల కార్మిక వ్యవస్థ మొదలగు అవలక్షణాలు ఓ వైపైతే, మైనర్‌గా ఉండి గర్భం రావ డమో, నమ్మినవాడు మోసం చేయ డమో, కట్టుకున్న వాడు గెంటేయ డమో ఇత్యాది కారణాలతో తల్లులు పసిబిడ్డలను మురికి కాలువల్లో, ముళ్ల పొదల్లో వేస్తుండటం మరో అవలక్షణం. అనాథలందరినీ అక్కున చేర్చుకోవడానికి ‘ఊయల’ పథకం ఉన్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆ ఊసే ఎత్తడం లేదు.. తెలంగాణ రాష్ట్రంలో 455 అనాథ పిల్లల పునరావాస కేంద్రాలున్నాయనీ 15,500 మంది పిల్లలు తలదాచుకుంటున్నారని తెలియజెప్పిన అధికారులు అనధికారికంగా రెండు వేలకు పైగా ఉన్న అనాథాశ్రమాల విధి, విధానాలన్నీ పక్కన బెట్టి వాటి జాడే మాకు తెలియదని నిస్సిగ్గుగా చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ స్త్రీ, శిశు సంక్షేమశాఖ కనీసం కాకి లెక్కలైనా ఇచ్చిందిగానీ, ఏపీ ప్రభుత్వం దగ్గర ఆ లెక్కలు కూడా లేవు. అనాథాశ్రమాల్లో పిల్లలతో బిచ్చం ఎత్తిం చడం, వ్యభిచార కలాపాలకు తరలించడం, కనీస వసతులు కల్పించకపోవడం యథేచ్ఛగా సాగు తుంటే ఆ ఆశ్రమ నిర్వాహకులకు అయినవారి అండదండలు ఉండటంతో పిల్లలకన్నా ఓటర్లు ముఖ్యమనే భావనతో పిల్లలందరినీ ప్రభు త్వాలు, అధికారులు గాలికి వదిలేశారు. ఇక విద్యారంగంలో చూస్తే, సేవా రంగంలో ఉండాల్సిన విద్యారంగం వ్యాపార రంగంగా మారిపోతే చదువు చెప్పకపోయినా పర్వాలేదు చంపకుంటే చాలు అనే భావన తల్లిదండ్రుల్లో కలి గినా విద్యాశాఖలు కార్పొరేటు విద్యాసంస్థల దరువుకు నృత్యం చేస్తున్నాయేగానీ ప్రభుత్వ నిబంధనలు అమలులో పెట్టడం లేదు. రెండు పేరొందిన కార్పొరేట్ పాఠశాలల్లో విరివిగా ఆత్మ హత్యలు, హత్యలు జరుగుతుంటే అధికారులు రక్షణ– పరిరక్షణ చట్టాన్ని ఎందుకు అమలు పరచడం లేదు? ఆ చట్టం తెలియకున్నా ఆ చట్టాన్ని అమలుచేసి ఆ సంస్థలను మూసివేస్తే అమాత్యులవారు ఆగ్రహి స్తారనా? ఈ విషయంలో స్పష్టత లేదు. ఆ పాఠశాలలతో ఆంధ్ర రాష్ట్ర అధినేత కుమ్మక్కైనారని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు అంటుంటే ఆ నేత ఎందుకు నోరు మెదపడం లేదు. మౌనం అంగీకారంగా భావించాలా? లేక నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని సరిపెట్టుకుంటున్నారా? అన్నది ప్రజలకు తెలియాల్సి ఉంది. మొత్తం ముఖ చిత్రం చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో పిల్లలు భద్రత కరువై, చదువు, పౌష్టికా హారం, కనీసం రక్షిత మంచినీరు సైతం లేకుండా ఎక్కడా, ఎప్పుడూ, ఎలాంటి భద్రత లేకుండా బిచ్చగాళ్లుగా, వ్యభిచార గృహాల్లో, బాల కార్మికు లుగా, మాఫియా ముఠా చేతుల్లో, ఎప్పుడు ఎలా మృత్యువు ముంచుకొస్తుందో తెలియక దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు లాగా అభద్రతలో బతు కీడుస్తుంటే ప్రభుత్వం, అధికారులు మాత్రం పిల్లల భద్రత ఏంటో? అన్నది తమకు తెలి యదన్నట్లు దీనమైన ముఖం వేసి కేవలం ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా– గతమెంతో ఘన కీర్తి కలవాడా’ అని గతాన్ని నెమరేసుకుంటూ రోజులు గడుపుతున్నారు. అచ్యుతరావు వ్యాసకర్త గౌరవ అధ్యక్షులు, బాలల హక్కుల సంఘం (93910 24242) -
అచ్యుతరావు @ ఆల్ రౌండర్
కడియం (రాజమహేంద్రవరం రూరల్): కడియం పరిసర ప్రాంతాల్లోని నర్సరీ రంగం అనేక మంది వలస కూలీలకు ఉపాధి కల్పిస్తోంది. అందుకోసం జిల్లాలు దాటి ఇక్కడికి వేలాది మంది వచ్చి స్థిరపడుతుంటారు. అలా స్థిరపడిన కుటుంబం నుంచి వచ్చిన బర్ల అచ్యుతరావు క్రికెట్లో తన నైపుణ్యంతో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నాడు. అండర్–19 విభాగంలో బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఏప్రిల్ 10వ తేదీ నుంచి 14 వరకు జరిగే మ్యాచ్‌కు 15 మంది ప్రాబబుల్స్‌లో ఎంపికయ్యారు. ఫస్ట్ ఆల్ రౌండర్‌గా ఎంపిక కావడంతో తుది జట్టులో తాను తప్పకుండా ఉంటానని ఆత్మస్థైర్యంతో చెబుతున్నాడీ పిడుగు. అచ్యుతరావు నేపథ్యమిదీ.. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన బర్ల సాంబయ్య, పోలమ్మల కుమారుడు అచ్యుతరావు. పార్వతీపురం ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు ప్రాథమిక విద్యను అభ్యసించాడు. అనంతరం ఉపాధి నిమిత్తం తల్లిదండ్రులు కడియం మండలం బుర్రిలంక చేరుకుని ఇక్కడే నర్సరీల్లో పని చేస్తున్నారు. 6వ తరగతి నుంచి కడియపులంక హైస్కూల్లో చదువుకున్నాడు. ప్రస్తుతం రాజీవ్‌గాంధీ కళాశాలలో డిగ్రీ బీఎస్సీ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పార్వతీపురంలో రాజశేఖర్ అనే కోచ్ అచ్యుతరావులోని క్రికెట్ ఆసక్తిని గమనించి ప్రోత్సహించగా, కడియపులంకలో పీఈటీ జయకుమార్ స్వయంగా టోర్నమెంట్లకు తీసుకువెళ్లి తనలో ఉన్న ప్రతిభను వెలికితీశారని అచ్యుతరావు తెలిపారు. రాజీవ్‌గాంధీ కళాశాలలో మహేంద్ర, రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల కోచ్ ఎం.రాజశేఖర్‌లు తన ఆటకు మరింత మెరుగులు దిద్దారన్నారు. దాతల సాయం కోసం అచ్యుతరావుది క్రికెట్లో ఆల్ రౌండ్ ప్రతిభ అని, అతడికి మంచి భవిష్యత్తు ఉంటుందని కోచ్‌లు చెబుతున్నారు. గుంటూరులో జరిగిన స్టేట్ లెవెల్ సెలక్షన్స్‌లో ఫస్ట్ ఆల్ రౌండర్‌గానే తుదిజట్టుకు ఎంపిక చేశారు. అనంతరం డయ్యూ, డామన్‌లో నిర్వహించిన నేషనల్స్‌లో అచ్యుతరావు చూపిన ప్రతిభ ఆధారంగా అండర్–19 ప్రాబబుల్స్‌లో నిలిచాడు. బంగ్లాదేశ్ వెళ్లేందుకు సుమారు ఎనభైవేల రూపాయలు అవసరం కానున్న నేపథ్యంలో దాతలు సాయం అందిస్తే మరింత ముందుకు వెళ్లగలనని అచ్యుతరావు అన్నారు. -
వివాహ వయస్సులో వెనకడుగు
సందర్భం శాసనాలు చేసేవారు బాలికలపట్ల వివక్షతో కూడిన భావజాలంతో ఉంటే బాలికలకు అనుకూలమైన చట్టాలు వచ్చేది ఎప్పుడు? బాలికలను చిన్న వయస్సులో వివాహ బలిపీఠం బారినుండి కాపాడటం అత్యంత ఆవశ్యం. మా సంస్థ లక్ష అమ్మా యిల సంతకాలు సేకరిం చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు రాష్ట్ర గవర్నర్ గారికి ఆ సంతకాలు సమర్పించడా నికి సహకరించాల్సిందిగా నాకు అత్యంత సన్నిహితు డైన ఓ ఎంపీ గారిని కోరగా, అమ్మాయిల వివాహ వయస్సు 21కి మార్చాలా, పురు షులపై అమ్మాయిలు చేస్తున్న అకృత్యాలు చాలవా అంటూ హేళనగా మాట్లాడారు. సరే పురుషుల అభి ప్రాయం దాదాపు ఇలానే ఉంటుందనుకుని, ఒక రాజ్యాంగ సంస్థకు అధినేతగా ఉన్న ఓ మహిళా నాయ కురాలిని అడిగాను ‘తల్లీ, అమ్మాయిల కనీస వివాహ వయస్సు 21 సంవత్సరాలకు మార్చాలని లక్ష సంత కాలు సేకరించాం తీసుకుంటారా’ అనగానే వెంటనే వచ్చిన సమాధానం ‘నాకు వల్లమాలిన పనులు న్నాయి కానీ మరి పురుషుల కనీస వివాహ వయస్సు 30 ఏళ్లకు చేయాలంటారా’ అని ప్రశ్నించారు. ఈపై రెండు ఉదాహరణలు ఎందుకిచ్చానంటే ఒకరు పార్లమెంటులో చట్టం చేయగలిగిన వ్యక్తి, మరొకరు స్త్రీల సమస్యలను ఎత్తిచూపి పరిష్కారం చూపగలిగిన వ్యక్తి, వీరి భావజాలమే ఇలా ఉంటే ఇక సామాన్యుల సంగతి ఏంటి? పురుషుల కన్నా స్త్రీల వయస్సు పెళ్లి విషయంలో కచ్చితంగా తక్కువకే ఉండాలా? ఇది ఏ శాస్త్ర ప్రకారం? ఇది పురుషాధిక్య సమాజంలో కరడుగట్టిన భావజాలం తప్ప ఎలాంటి శాస్త్రీయత లేదు, పైగా వివాహ వయస్సులో స్త్రీ, పురుషులకు తేడా ఉండాలన్నది అశాస్త్రీయమైన పురు షాధిక్య భావజాలం తప్ప మరోటి కాదు. 1929లో బ్రిటిష్ ఇండియా పార్లమెంట్లో రావ్ సాహెబ్ హరవిలాస్ శారద.. కనీస వివాహ వయస్సు అమ్మాయిలకు 14 సంవత్సరాలు, అబ్బాయిలకు 16 సంవత్సరాలు ప్రవేశ పెట్టకముందు, అసలు కనీస వివాహ వయస్సు అనేదే లేకుండా అష్ట వర్షాత్, భావేత్ కన్య అంటే 8 సంవత్సరాల అమ్మాయిని కన్యగా భావించి పెళ్లిళ్లు చేయాలన్నది నాటి ఆచా రంగా ఉండేది. అలాగే 8 ఏళ్లను గర్భాష్టకాలుగా అంటే తల్లి కడుపులో బిడ్డ పడ్డప్పటినుండి లెక్కించి అంటే 7 సంవత్సరాల వయస్సును 8 ఏళ్లుగా పరి గణించవచ్చని సెలవిచ్చారు. ఇది సైన్స్ శాస్త్ర సాంకేతిక విద్యారంగాల్లో ఎలాంటి అభివృద్ధిలేని రోజులనాటి మాట, అలాగే స్త్రీకి ఎలాంటి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లేని సమా జంలో భావన, కానీ నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి అంటున్నారు, స్త్రీ పురుషులకు లింగభేదం లేదు అంటున్నారు. స్త్రీ జనోద్ధరణ, స్త్రీ విద్యను ప్రోత్సహి ద్దామని, ఆకాశంలో సగం అవకాశాల్లో సగం లింగ భేదాలు లేవు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడు తున్నారు. కానీ అసలు విషయానికి వచ్చేసరికి లింగ వివక్షతో పెళ్లిళ్ల కనీస వయసును అమ్మాయిలకు 18 సంవత్సరాలుగా, అబ్బాయిలకు 21 సంవత్సరాలుగా నిర్ణయించుకున్నాం. కానీ దీనికేమైనా శాస్త్రీయత ఉందా, 18 సంవత్సరాలకు పెళ్లైతే కనీసం గ్రాడ్యు యేషన్ విద్య అయినా బాలికలు పూర్తి చేసుకోగలుగు తున్నారా? గ్రాడ్యుయేషన్ వరకైనా చదవంది తమ జీవితంలో వచ్చే విపత్కర పరిస్థితుల్లో, సొంత కాళ్లపై ఆర్థికంగా నిలబడగలరా? ఇక వ్యక్తిగత సమస్యలకు వస్తే 18 ఏళ్ల వయస్సులో లైంగిక సంపర్కానికి మానసికంగా సంసిద్ధులై ఉండరని మానసిక నిపు ణులు చెబుతుంటే, ఈ వయసులో పెళ్లైతే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్లు అధికమని గైనకాలజిస్ట్లు చెబుతున్నారు. 18 ఏళ్లకు పెళ్లైతే వెంటనే పిల్లలు పుట్టిన పిల్లల్లో 47 శాతం మంది పురిటిలోనే చని పోతున్నారని, 69 శాతం మంది తల్లులు ప్రసవ సమ యంలో చనిపోతున్నారని.. ఇది అన్ని అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాల్లో జరుగుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నెత్తీ నోరూ బాదుకుంటున్నది. అలాగే చిన్న వయసులో పెళ్లై కాపురానికి వెళ్లిన బాలి కలపై లైంగిక దాడులు అధికంగా ఉన్నట్లు మన దేశ నేరాల నమోదు సంస్థ తేటతెల్లం చేసింది. అలాగే 21 ఏళ్ల లోపు జరిగిన పెళ్లిళ్లలో విడాకులు అధిక శాతంగా ఉన్నాయని కేంద్ర మహిళా కమిషన్ స్పష్టం చేసింది. ఇన్ని అనర్థాలకు కారణమవుతూ, బాలికల జీవి తంలో అడ్డంకులు కల్పించే కనీస వివాహ వయ స్సును 18 నుంచి 21 ఏళ్లకు ఎందుకు మార్చ కూడదు? బాలికలకు 18, బాలురకు 21 అని లింగ వివక్షను ఇంకా ఎంతకాలం కొనసాగిద్దాం? నేటి సమాజంలో సహితం కొనసాగుతున్న వందేళ్ల కింది నాటి ‘అష్ట వర్షాత్ భావేత్ కన్య’లాంటి భావనలు మన మనస్సులోనుంచి ఎప్పుడు తొలగిపోతాయి? శాసనాలు చేసేవారు బాలికలపట్ల వివక్షతకు కూడిన భావజాలంతో ఉంటే బాలికలకు అనుకూల మైన చట్టాలు వచ్చేది ఎప్పుడు? అమ్మాయిలకు, అబ్బాయిలకు వివాహ వయస్సులో తేడా ఉండాలన్న అశాస్త్రీయ, పురుషాధిక్య భావజాల వైఖరిని పక్కన పెట్టి బాలికల మేలు కోరి వారు ఇటు ఆర్థిక స్వావలం బన ఆరోగ్య ఆలోచన పరిపుష్టి కలిగాకే వివాహాలు జరిగేలా అమ్మాయిల కనీస వయస్సు 18 ఏళ్ల నుండి 21 ఏళ్లకు మార్చాలన్న బాలల హక్కుల సంఘం వాదనను బలపరచి బాలికలను చిన్న వయస్సులో వివాహ బలిపీఠం బారినుండి కాపాడండి. వ్యాసకర్త అచ్యుతరావు గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం మొబైల్: 93910 24242 -
బాల్యం భవిష్యత్తు సంకేతం
పుట్టిన పిల్లలు ఇంత దుర్భరమైన స్థితిలో ఉంటూండగా, వారికి కనీసం రక్షిత మంచినీరు ఇవ్వడం బాధ్యతగా గుర్తించని పెద్ద మనుషులు.. మరింత మంది పిల్లలని కనండహో అంటూ సిగ్గు లేకుండా చాటింపు వేయడం దారుణం. బాల్యం చాలా అమూల్యమైనది. గనిలో, పనిలో, కార్ఖానాలో నలిగిపోకూడదు. బిచ్చగాళ్లు కాకూడదు. బాలికా వధువులై దుర్భర జీవితం గడపకూడదు. అసాంఘిక శక్తుల చేతులలో బాలబాలికలు కీలుబొమ్మలు కాకూడదు. విద్యాగంధానికి దూరమై వింత పశువుల్లా మారకూడదు. వారి విజ్ఞాన సాధనకు, వినోదానికి, చదువు, ఆటపాటలు అందుబాటులో ఉండాలి. పిల్లలు ఎదగడానికి పౌష్టికాహారం, వైద్య సదుపాయాలు ఉండాలి. రక్షిత మంచినీరు లభించాలి. వెరసి పిల్లలకు అన్ని సదుపాయాలు ఉండి మంచి జాతి పౌరులుగా ఎదగాలి. జాతికి గర్వకారణమై ముద్దుబిడ్డలుగా మారాలి. ఇదంతా జరగాలి అంటే పిల్లలకంటూ కనీసం సంవత్సరంలో ఒక రోజైనా కేటాయించి వారి పరిస్థితులను సమీక్షించి, సమస్యలు ఉంటే చక్కదిద్దాల్సిన బాధ్యతను ప్రపంచ దేశాలు నెత్తిన ఎత్తుకోవాలని ఆలోచిం చారు రెవరెండ్ డా. చార్లెస్ లియోనార్డ్. మాంచెస్టర్‌కు చెందిన ఈ పాస్టర్ ఒకటిన్నర శతాబ్దం క్రితం అంటే 1856లోనే ఈ ఆలోచన చేశారు. ఆయన ప్రతిపాదన మేరకు ప్రతి సంవత్సరం జూన్ రెండో ఆదివారాన్ని ‘రోజ్ డే’ లేదా బాలల దినోత్సవంగా గుర్తించారు. తదనంతరం ఆయా దేశాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ ‘రోజ్ డే’ లేదా ‘చిల్డ్రన్స్ డే’ ను ప్రపంచంలోని అత్యధిక దేశాలు జూన్ 1న లేదా వారికి అనుకూలమైన తేదీల్లో నిర్వహిస్తున్నాయి. మన దేశంలో భారత నిర్మాత, ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి పిల్లలంటే అపార ప్రేమ. వారికోసం ఏదో ఒకటి చేయాలనే తపన ఆయనలో ఉండేది. అందుకే ఆయన జ్ఞాపకార్థం నెహ్రూ జన్మదినాన్ని బాలల దినోత్సవంగా భారత ప్రభుత్వం గుర్తించింది. అందరూ అనుభవించే బాల్యం.. ప్రకృతి మనుషులకు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూదోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. ‘పిల్లలతో ఉన్నప్పుడు మనసు హాయిగా ఉంటుంది. నాకు ఏ పవిత్ర స్థలంలోనూ కూడా అంతటి శాంతి, సంతృప్తి లభించవు’ అని నెహ్రూ అనేవారు. పిల్ల లను జాతి సంపదగా భావించి అందరూ వారి భవితవ్యానికి కృషి చేయాలని ఆయన తరచూ చెప్పేవారు. నెహ్రూకు పిల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ నవంబర్ 14న బాలల దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి సంవత్సరమూ నవంబర్ 14న దేశవ్యాప్తంగా ప్రభుత్వపరంగా బాలల దినోత్సవం సంబరాలు ఐతే ఘనంగానే జరుగుతున్నాయి. కానీ, ఇంకా పిల్లలు పీడన నుంచి విముక్తి చెందలేదు. 46 శాతం మంది పిల్లలు పౌష్టికాహారం లోపంతో బాధపడుతుంటే 74 శాతం మంది పిల్లలు, రక్తహీనతతో 90 శాతం మంది పిల్లలు నివారించగలిగే డయేరియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్నారు. హెచ్.ఐ.వి లాంటి ప్రమాదకర పరిస్థితుల్లో 2,20,000 మంది పిల్లలు ఉంటే ప్రతి సంవత్సరం ఈ సంఖ్యకు అరవైవేల మంది అదనంగా తోడవుతున్నారు. ప్రపంచంలో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న ప్రతి ముగ్గురు పిల్లలలో ఒకరు భారతదేశానికి చెందిన వాళ్లంటే ఆశ్చర్యపోనవసరం లేదు. దేశంలో 1,000 మంది పిల్లలు జన్మిస్తే 79 మంది పుట్టగానే మృత్యువాత పడుతున్నారు. ఈ విషయంలో ప్రపంచ సరాసరి కంటే మనం అత్యంత హీనమైన స్థితిలో ఉన్నాం. ఇక దేశం మొత్తంగా చూస్తే 1,30,00,000 మంది పిల్లలు ప్రమాదకర పరిస్థితుల్లో బాల కార్మికులుగా జీవనం సాగిస్తున్నారు. మరోవైపున విద్యకు దూరమై కుల, మత, ప్రాంత, భాష, లింగ వివక్షతో ఎంతో మంది చిన్నారులు మగ్గిపోతున్నారు. ఈ 21వ శతాబ్దిలో కూడా దేశంలో బాలికా వధువుల సంఖ్య గణనీయంగా ఉంది. ఇన్ని అరిష్టాలు ఉండగా, మరోవైపున చదువుల పేరుమీద పిల్లలపై జరుగుతున్న దౌర్జన్యాలు అంతా ఇంతా కాదు. జ్ఞాన సముపార్జన మాట దేవుడెరుగు కాని పాఠశాలల్లో పిల్లల ప్రాణాలు పోకుంటే చాలు అన్న చందంగా చదువులు తయారయ్యాయి. ఇక మాఫియా ముఠాల చేతుల్లో బిచ్చగాళ్లుగా, దొంగలుగా, వ్యభిచార గృహాల్లో దుర్భరమైన జీవనం సాగిస్తున్న చిన్నారుల సంఖ్యకు కొదవలేదు. పైన ఏకరువు పెట్టిన విషయాలన్నీ ప్రభుత్వాలకు, పెద్దలకు తెలియని కొత్త సంగతులేమీ కావు. కానీ వారికి బాలబాలికలంటే పట్టదు. వారి సమస్యలు అంటే గిట్టదు. పుట్టిన పిల్లలు ఇంత దుర్భరమైన స్థితిలో ఉంటే వారికి కనీసం రక్షిత మంచినీరు ఇవ్వడం కూడా తమ బాధ్యతగా గుర్తించని పెద్ద మనుషులు.. తగుదునమ్మా అంటూ మరింత మంది పిల్లలని కనండహో అని సిగ్గూ ఎగ్గూ లేకుండా చాటింపు వేస్తున్నారు. మన సమాజంలోని పెద్ద మనుషులందరికీ బాలల హక్కుల సంఘం సవినయంగా విన్నవిస్తున్నది ఏమిటంటే పిల్లలకు మంచి జీవితం అందాలి, అందించాలి. లేకపోతే మంచి సమాజాన్ని చూడటం ఎన్నటికీ ఫలించని కలగానే మిగిలిపోతుంది. బాలల హక్కుల సంఘం, సాక్షి దినపత్రిక నేడు హైదరాబాద్ కేంద్రంగా బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. పిల్లలకు చాచా నెహ్రూ కలలు కన్న సమాజాన్ని సమకూర్చాలంటూ పెద్దలందరినీ కోరుతున్నాం. (నేడు జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా) అచ్యుతరావు వ్యాసకర్త గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం ‘ 93910 24242 -
ఎన్టీఆర్ బిగ్ బాస్‌పై హెచ్ఆర్సీలో ఫిర్యాదు
టాలీవుడ్ బిగ్ బాస్ పై వివాదాలు మొదలవుతున్నాయి. ఎన్టీఆర్ వ్యాఖ్యాత రూపొందుతున్న ఈ షోలో కంటెస్టెంట్ లకు విధించే శిక్షలు అమానవీయం గా ఉన్నాయంటూ సామాజిక కార్యకర్త అచ్యుతరావు రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బిగ్ బాస్ షోపై తనకు అభ్యంతరాలను తెలియజేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. షోలో పాల్గొంటున్న కంటెస్టెంట్స్ చేస్తున్న పనులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. షోలో బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు ఇస్తున్న టాస్క్‌లపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. శిక్షల పేరుతో నోటికి ప్లాస్టర్లు వేయడం, స్విమ్మింగ్ పూల్‌లో 50 సార్లు మునిగి లేవమనడం, రాత్రి సమయాల్లో గార్డెన్లో పడుకోమని ఆదేశించటం, గంటల తరబడి ఉల్లిపాయలు కోయమనటం వంటివి అమానవీయ చర్యలని ఆరోపించారు. ఈ చర్యలు పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని అచ్యుతరావు వాదిస్తున్నారు. ఈ పిటీషన్ పై మానవ హక్కుల సంఘం స్పందించలేదు. ఒకవేళ పిటీషన్ ను హెచ్చార్సీ విచారణకు తీసుకుంటే బిగ్ బాస్ నిర్వాహకులకు నోటీసలు పంపే అవకాశం ఉంది.