సందర్భం
శాసనాలు చేసేవారు బాలికలపట్ల వివక్షతో కూడిన భావజాలంతో ఉంటే బాలికలకు అనుకూలమైన చట్టాలు వచ్చేది ఎప్పుడు? బాలికలను చిన్న వయస్సులో వివాహ బలిపీఠం బారినుండి కాపాడటం అత్యంత ఆవశ్యం.
మా సంస్థ లక్ష అమ్మా యిల సంతకాలు సేకరిం చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు రాష్ట్ర గవర్నర్ గారికి ఆ సంతకాలు సమర్పించడా నికి సహకరించాల్సిందిగా నాకు అత్యంత సన్నిహితు డైన ఓ ఎంపీ గారిని కోరగా, అమ్మాయిల వివాహ వయస్సు 21కి మార్చాలా, పురు షులపై అమ్మాయిలు చేస్తున్న అకృత్యాలు చాలవా అంటూ హేళనగా మాట్లాడారు. సరే పురుషుల అభి ప్రాయం దాదాపు ఇలానే ఉంటుందనుకుని, ఒక రాజ్యాంగ సంస్థకు అధినేతగా ఉన్న ఓ మహిళా నాయ కురాలిని అడిగాను ‘తల్లీ, అమ్మాయిల కనీస వివాహ వయస్సు 21 సంవత్సరాలకు మార్చాలని లక్ష సంత కాలు సేకరించాం తీసుకుంటారా’ అనగానే వెంటనే వచ్చిన సమాధానం ‘నాకు వల్లమాలిన పనులు న్నాయి కానీ మరి పురుషుల కనీస వివాహ వయస్సు 30 ఏళ్లకు చేయాలంటారా’ అని ప్రశ్నించారు.
ఈపై రెండు ఉదాహరణలు ఎందుకిచ్చానంటే ఒకరు పార్లమెంటులో చట్టం చేయగలిగిన వ్యక్తి, మరొకరు స్త్రీల సమస్యలను ఎత్తిచూపి పరిష్కారం చూపగలిగిన వ్యక్తి, వీరి భావజాలమే ఇలా ఉంటే ఇక సామాన్యుల సంగతి ఏంటి? పురుషుల కన్నా స్త్రీల వయస్సు పెళ్లి విషయంలో కచ్చితంగా తక్కువకే ఉండాలా? ఇది ఏ శాస్త్ర ప్రకారం? ఇది పురుషాధిక్య సమాజంలో కరడుగట్టిన భావజాలం తప్ప ఎలాంటి శాస్త్రీయత లేదు, పైగా వివాహ వయస్సులో స్త్రీ, పురుషులకు తేడా ఉండాలన్నది అశాస్త్రీయమైన పురు షాధిక్య భావజాలం తప్ప మరోటి కాదు.
1929లో బ్రిటిష్ ఇండియా పార్లమెంట్‌లో రావ్ సాహెబ్ హరవిలాస్ శారద.. కనీస వివాహ వయస్సు అమ్మాయిలకు 14 సంవత్సరాలు, అబ్బాయిలకు 16 సంవత్సరాలు ప్రవేశ పెట్టకముందు, అసలు కనీస వివాహ వయస్సు అనేదే లేకుండా అష్ట వర్షాత్, భావేత్ కన్య అంటే 8 సంవత్సరాల అమ్మాయిని కన్యగా భావించి పెళ్లిళ్లు చేయాలన్నది నాటి ఆచా రంగా ఉండేది. అలాగే 8 ఏళ్లను గర్భాష్టకాలుగా అంటే తల్లి కడుపులో బిడ్డ పడ్డప్పటినుండి లెక్కించి అంటే 7 సంవత్సరాల వయస్సును 8 ఏళ్లుగా పరి గణించవచ్చని సెలవిచ్చారు.
ఇది సైన్స్ శాస్త్ర సాంకేతిక విద్యారంగాల్లో ఎలాంటి అభివృద్ధిలేని రోజులనాటి మాట, అలాగే స్త్రీకి ఎలాంటి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు లేని సమా జంలో భావన, కానీ నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి అంటున్నారు, స్త్రీ పురుషులకు లింగభేదం లేదు అంటున్నారు. స్త్రీ జనోద్ధరణ, స్త్రీ విద్యను ప్రోత్సహి ద్దామని, ఆకాశంలో సగం అవకాశాల్లో సగం లింగ భేదాలు లేవు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడు తున్నారు. కానీ అసలు విషయానికి వచ్చేసరికి లింగ వివక్షతో పెళ్లిళ్ల కనీస వయసును అమ్మాయిలకు 18 సంవత్సరాలుగా, అబ్బాయిలకు 21 సంవత్సరాలుగా నిర్ణయించుకున్నాం. కానీ దీనికేమైనా శాస్త్రీయత ఉందా, 18 సంవత్సరాలకు పెళ్లైతే కనీసం గ్రాడ్యు యేషన్ విద్య అయినా బాలికలు పూర్తి చేసుకోగలుగు తున్నారా? గ్రాడ్యుయేషన్ వరకైనా చదవంది తమ జీవితంలో వచ్చే విపత్కర పరిస్థితుల్లో, సొంత కాళ్లపై ఆర్థికంగా నిలబడగలరా? ఇక వ్యక్తిగత సమస్యలకు వస్తే 18 ఏళ్ల వయస్సులో లైంగిక సంపర్కానికి మానసికంగా సంసిద్ధులై ఉండరని మానసిక నిపు ణులు చెబుతుంటే, ఈ వయసులో పెళ్లైతే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్‌లు అధికమని గైనకాలజిస్ట్‌లు చెబుతున్నారు. 18 ఏళ్లకు పెళ్లైతే వెంటనే పిల్లలు పుట్టిన పిల్లల్లో 47 శాతం మంది పురిటిలోనే చని పోతున్నారని, 69 శాతం మంది తల్లులు ప్రసవ సమ యంలో చనిపోతున్నారని.. ఇది అన్ని అభివృద్ధి చెందని, చెందుతున్న దేశాల్లో జరుగుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నెత్తీ నోరూ బాదుకుంటున్నది. అలాగే చిన్న వయసులో పెళ్లై కాపురానికి వెళ్లిన బాలి కలపై లైంగిక దాడులు అధికంగా ఉన్నట్లు మన దేశ నేరాల నమోదు సంస్థ తేటతెల్లం చేసింది. అలాగే 21 ఏళ్ల లోపు జరిగిన పెళ్లిళ్లలో విడాకులు అధిక శాతంగా ఉన్నాయని కేంద్ర మహిళా కమిషన్ స్పష్టం చేసింది.
ఇన్ని అనర్థాలకు కారణమవుతూ, బాలికల జీవి తంలో అడ్డంకులు కల్పించే కనీస వివాహ వయ స్సును 18 నుంచి 21 ఏళ్లకు ఎందుకు మార్చ కూడదు? బాలికలకు 18, బాలురకు 21 అని లింగ వివక్షను ఇంకా ఎంతకాలం కొనసాగిద్దాం? నేటి సమాజంలో సహితం కొనసాగుతున్న వందేళ్ల కింది నాటి ‘అష్ట వర్షాత్ భావేత్ కన్య’లాంటి భావనలు మన మనస్సులోనుంచి ఎప్పుడు తొలగిపోతాయి? శాసనాలు చేసేవారు బాలికలపట్ల వివక్షతకు కూడిన భావజాలంతో ఉంటే బాలికలకు అనుకూల మైన చట్టాలు వచ్చేది ఎప్పుడు? అమ్మాయిలకు, అబ్బాయిలకు వివాహ వయస్సులో తేడా ఉండాలన్న అశాస్త్రీయ, పురుషాధిక్య భావజాల వైఖరిని పక్కన పెట్టి బాలికల మేలు కోరి వారు ఇటు ఆర్థిక స్వావలం బన ఆరోగ్య ఆలోచన పరిపుష్టి కలిగాకే వివాహాలు జరిగేలా అమ్మాయిల కనీస వయస్సు 18 ఏళ్ల నుండి 21 ఏళ్లకు మార్చాలన్న బాలల హక్కుల సంఘం వాదనను బలపరచి బాలికలను చిన్న వయస్సులో వివాహ బలిపీఠం బారినుండి కాపాడండి.
వ్యాసకర్త
అచ్యుతరావు
గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం
మొబైల్: 93910 24242
Comments
Please login to add a commentAdd a comment