
యావత్ భార తదేశాన్ని నిర్భయ ఘటన తర్వాత మళ్లీ ఉలిక్కిపడేలా చేసిన ఘటన తెలంగాణలో చోటు చేసుకున్న దిశ ఘటన. అమ్మాయిని పథకం ప్రకారం కదలనివ్వకుండా చేసి సామూహిక అత్యాచారం, ఆపై తగలబెట్టి హత్య చేసిన ఘటన ప్రజలందరికీ గల్లీ నుండి ఢిల్లీ దాకా వణుకు పుట్టించింది. అలాగే బాధితురాలికి న్యాయం చేయా లంటే నిందితులను చంపెయ్యాల్సిందే అని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో అన్నారు, చివరకు అదే జరిగింది. కానీ నిందితులను చంపడం ద్వారా నేరాలు అరికట్టలేమన్నది విజ్ఞతతో ఆలోచించిన ప్పుడే తెలుస్తుంది.
చాలామంది అరబ్ దేశాల్లో నేరం చేసిన వాళ్లను అక్కడికక్కడే చంపేస్తారని చెబుతుంటారు కానీ అలా చంపేసినా నేరాలు ఆగడం లేదన్న నిజాన్ని గమ నించాలి. అంతేకాకుండా ఆ దేశాలు ఇంకా రాజరికపు ఫ్యూడల్ వ్యవస్థల్లోనే ఉన్నాయి. భారతదేశం అలా కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో నడుస్తున్న ఫెడరల్ యూనిటరీ వ్యవస్థగా కొనసాగుతున్న దేశం అలాంట ప్పుడు ఓ ప్రజాస్వామ్య దేశాన్ని రాచరికపు దేశాలతో పోల్చలేము. కానీ విజ్ఞతతో ఆలోచించి నేరాలకు పాల్ప డిన వారిని విచారణ లేకుండా అనాగరి కంగా చంపడం సరైన పద్ధతి కాదని గ్రహించి చట్టాలను మార్చాలి.
పౌరులను విద్యావంతులను చేసే దిశగా అడుగులు వేస్తే నేరాలను నిరోధిం చవచ్చు. సరిగ్గా ఇదే సూత్రాన్ని పాటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తితో తమ రాష్ట్రానికంటూ ఇలాంటి నేరాలు తగ్గించాలనే స్ఫూర్తితో ‘దిశ’ చట్టాన్ని తీసుకువచ్చింది. ఘటన తెలంగాణలో జరిగినా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తమ రాష్ట్రంలో జరగకుండా కట్టడి చేయడానికి దిశ చట్టాన్ని తెచ్చిన జగన్ సర్కారుకు జేజేలు.
గణాంకాల ప్రకారం ఆడపిల్లలపై 2014లో 13,549 నేరాలు జరుగగా, వరుసగా 2015లో 13,088, 2016లో 13,948, 2017లో 14,696 ఘటనలు.. 2018లో 14,048 ఘటనలు చోటు చేసు కున్నాయి. ఇంకా ఈ నేరాల సంఖ్యను తగ్గించి సమస్యను పరిష్కరించే దిశగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 173, 309ని సవరించి, నేరం జరిగిన ఏడు రోజుల్లో విచారణ పూర్తి చేయడం పద్నాలుగు రోజుల్లో చార్జిషీట్, సాక్షుల విచారణ చేసి కేవలం మూడు వారాల్లో నిందితులకు శిక్ష ఖరారు చేసే దిశగా చట్ట సవరణ చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో వేధిస్తే రేండేళ్ల శిక్షపడేలా, అత్యాచారాలకు మరణదండన పడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, వెనువెంటనే శాసనసభ ఆమో దం హర్షించదగ్గది.
ఈ చట్టాన్ని ఇతర రాష్ట్రాలలో సహితం అమలుచేస్తే మంచి ఫలితాలు ఇస్తుందన్న దాంట్లో అనుమానం లేదు. కేవలం శిక్షలు వేస్తామనడమే కాకుండా చిన్ననాటి నుండి ఉపయోగమైన ఇంగ్లిష్ మీడియం విద్యను పేద పిల్లలకు సహితం అందుబాటులోకి తేవడం, ప్రతి నేరం వెనుక మద్యం ఉత్ప్రేరకంగా ఉంటున్నం దున దశలవారీ మద్య నిషేధం బాలి కలకూ, మహిళలకూ శ్రీరామరక్షగా నిలు స్తుందనడంలో సందేహం లేదు.
వ్యాసకర్త : అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం
మొబైల్ : 93910 24242