కామాంధునికి ‘దిశ’ బేడీలు | Women Complaint On Her Husband With Disha App | Sakshi
Sakshi News home page

కామాంధునికి ‘దిశ’ బేడీలు

Mar 3 2020 4:23 AM | Updated on Mar 3 2020 4:23 AM

Women Complaint On Her Husband With Disha App - Sakshi

టి.అనిల్‌కుమార్‌

తాడేపల్లిరూరల్‌ (మంగళగిరి):  గౌరవప్రదమైన ఉద్యోగం, మంచి కుటుంబం ఉన్నా కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు పాల్పడ్డాడు. డబ్బు, వస్తువులు ఆశ చూపి అభంశుభం తెలియని యువతులను మోసం చేశాడు. శృతిమించిన అతని చేష్టలతో విసిగిపోయిన భార్య దిశ యాప్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్టు చేయించింది. అతని బారి నుంచి ఓ విద్యార్థినిని కాపాడింది. కామాంధుడి చెర నుంచి విద్యార్థినిని రక్షించినందుకు మేరీ జెస్సికాను అందరూ అభినందించారు. 

వివరాలివీ.. 
- గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన టి.అనిల్‌కుమార్‌ విజయవాడలో రైల్వే గార్డు.  
- మాయమాటలు చెప్పి, డబ్బు ఆశ చూపి ఆడపిల్లలను వలలో వేసుకుంటాడు. వారి జీవితాలను నాశనం చేస్తాడు.  
తన ఇంటి సమీపంలోనే డిగ్రీ చదివే ఓ విద్యార్థినికి మొబైల్‌ ఫోన్‌ ఆశ చూపి వశపరుచుకున్నాడు. ఏకాంతంలో ఉండగా తీసిన ఫొటోలను చూపి బెదిరించి తన కోరికలు తీర్చుకున్నాడు.  
- విషయం తెలుసుకున్న భార్య మేరీ జెస్సికా వారించింది.  
- అతనిలో మార్పు రాకపోవడంతో ఆ విద్యార్థిని కుటుంబాని అక్కడి నుంచి దూరంగా పంపేసింది.  
అయినా అనిల్‌ ఆ విద్యార్థినిని వదలలేదు. ఆదివారం మధ్యాహ్నం విజయవాడలో ప్రైవేటు క్లాసుకు వెళ్లి వస్తున్న విద్యార్థినిని బెదిరించి, హోటల్‌కు తీసుకువెళ్లేందుకు యత్నించాడు.  
విషయం తెలుసుకున్న భార్య మేరీ జెస్సికా అక్కడికి చేరుకుంది. దిశ యాప్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది.  
- రెండు నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనిల్‌కుమార్‌ను, విద్యార్థినిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 
- ఆరు నెలలుగా అనిల్‌కుమార్‌ తనను ఏ విధంగా వేధిస్తున్నదీ విద్యార్థిని పోలీసులకు వివరించింది.  
- విద్యార్థిని ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం స్టేషన్‌ మహిళా ఎస్‌ఐ స్వాతి కేసు నమోదు చేశారు. అనంతరం కేసును  తాడేపల్లి స్టేషన్‌కు బదిలీ చేశారు. 
- అనిల్‌కుమార్‌ను అరెస్టు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement