తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: తిరుపతి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాన్స్‌ఫార్మర్లలో రాగివైర్లను అపహరించే ఏడుగురి ముఠా సభ్యులను ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7 లక్షల విలువ చేసే రాగి వైరును స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను అలిపిరి, తిరుచానూరు సీఐలు రాజశేఖర్, సాయినాథ్ విలేకరులకు వివరిం చారు.
కేవీపల్లె మండలం వగళ్ల గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు రెడ్డెప్ప, బసవయ్య కుమారుడు జీవీ.రమణయ్య, వెంకటరమణ కుమారుడు గుణశేఖర్, రాజన్న కుమారుడు నాగరాజు, రెడ్డెప్పకుమారుడు రవితో పాటు రొంపిచెర్ల మండలం చిన్నగొట్టిగల్లు గ్రామానికి చెందిన మల్లయ్య కుమారుడు దేవయ్య, తిరుపతి జీవకోనకు చెందిన షేక్‌సికిందర్ కుమారుడు షేక్ మహేష్ ముఠాగా ఏర్పడి, జల్సాలకు అలవాటు పడ్డారు. రాత్రిపూట వ్యవసాయ పొలాల వద్దనున్న ట్రాన్స్‌ఫార్మర్లలోని రాగి వైరును చోరీ చేసేవారు.
తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి, శ్రీకాళహస్తి, తిరుచానూరు, రామచంద్రాపు రం, గాజులమండ్యం, వడమాలపేట, ఏర్పేడు, ముత్యాలరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్ల పరిధిలోని 86 ట్రాన్సఫార్మర్లలో రాగివైరును అపహరించుకెళ్లారు. దీన్ని అమ్మగావచ్చిన డబ్బును అందరూ పంచుకునే వారు. దాదాపు రెండేళ్లుగా 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో 36 చోరీలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది.
ముఠాలోని సభ్యులందరూ ఆదివారం జూపార్కు రోడ్డులో వెళుతుండగా అటుగా వెళుతున్న సీఐలు రాజశేఖర్, సాయినాథ్, ఎస్‌ఐలు హరి ప్రసాద్, సురేష్‌కుమార్, ప్రవీణ్‌కుమా ర్, పీఎస్‌ఐ ఈశ్వరయ్య, ఈస్ట్ సబ్‌డివిజ న్ క్రైంపార్టీ పోలీసులు రాజు, రవిప్రకా ష్, వెంకటేశ్‌నాయుడు, శ్రీనివాసులు, ర విరెడ్డి, పండరీనాథ్, ముజీబ్, షాజహా న్‌లు వారిని ఆదుపులోకి తీసుకుని విచారించారు. అపహరణకు గురైన రూ.7 లక్షల విలువైన రాగి వైరును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐలు వెల్లడించారు.
జల్సా రాయుళ్లు
Published Mon, Oct 14 2013 4:04 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM
Advertisement
Advertisement