breaking news
Urban Police Station
-
భూ మాఫియాపై ఉక్కుపాదం
అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ మంగళగిరి : గుంటూరు, మంగళగిరిలతో పాటు అర్బన్ జిల్లా పరిధిలో భూ మాఫియా ఎక్కువైందని, వీటికి పాల్పడేవారిపై రౌడీషీట్లు తెరిచి, పీడీ యాక్ట్ అమలు చేస్తామని అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ పేర్కొన్నారు. పట్టణ పోలీసుస్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ భూ మాఫియాను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. భూముల ఆక్రమణ, దౌర్జన్యాల్లో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తప్పవన్నారు. అర్బన్ జిల్లా పరిధిలో సిబ్బంది కొరత వుందని, రోజు రోజుకి క్రైమ్‌రేటు పెరుగుతోందన్నారు. సిబ్బంది రిక్రూట్మెంట్ తోపాటు రూరల్ నుంచి కొంతమంది సిబ్బందిని తీసుకుని నేరాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ మధ్య కాలంలో ప్రకాశం బ్యారేజి వద్ద చోటుచేసుకుంటున్న పలువురి ఆత్మహత్యల నేపథ్యంలో అక్కడ 24 గంటల నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. బ్యారేజ్‌పైన, దిగువన ప్రత్యేక లైటింగ్ , ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆత్మహత్యల నివారణతోపాటు అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రకాశం బ్యారేజి నుంచి కనకదుర్గవారధి వరకు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. చైన్‌స్నాచింగ్‌ల నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేస్తున్నామన్నారు. గతంలో చైన్‌స్నాచింగ్‌లు పాతనేరస్తులు చేసేవారని.. ఇప్పుడు జల్సాలకు అలవాటుపడి ఉన్నత చదువులు చదివిన యువకులు ఈ తరహా నేరాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. చైన్‌స్నాచింగ్‌లు, బ్యాంకుల వద్ద నగదు కాజేసే వారిని పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఆయన వెంట పట్టణ సీఐ రావూరి సురేష్‌బాబు, ఎస్ఐలు జిలానిబాషా, కృష్ణయ్య, సిబ్బంది ఉన్నారు. -
జల్సా రాయుళ్లు
తిరుపతి క్రైం, న్యూస్‌లైన్: తిరుపతి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాన్స్ఫార్మర్లలో రాగివైర్లను అపహరించే ఏడుగురి ముఠా సభ్యులను ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7 లక్షల విలువ చేసే రాగి వైరును స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను అలిపిరి, తిరుచానూరు సీఐలు రాజశేఖర్, సాయినాథ్ విలేకరులకు వివరిం చారు. కేవీపల్లె మండలం వగళ్ల గ్రామానికి చెందిన కృష్ణయ్య కుమారుడు రెడ్డెప్ప, బసవయ్య కుమారుడు జీవీ.రమణయ్య, వెంకటరమణ కుమారుడు గుణశేఖర్, రాజన్న కుమారుడు నాగరాజు, రెడ్డెప్పకుమారుడు రవితో పాటు రొంపిచెర్ల మండలం చిన్నగొట్టిగల్లు గ్రామానికి చెందిన మల్లయ్య కుమారుడు దేవయ్య, తిరుపతి జీవకోనకు చెందిన షేక్‌సికిందర్ కుమారుడు షేక్ మహేష్ ముఠాగా ఏర్పడి, జల్సాలకు అలవాటు పడ్డారు. రాత్రిపూట వ్యవసాయ పొలాల వద్దనున్న ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వైరును చోరీ చేసేవారు. తిరుపతి, రేణిగుంట, చంద్రగిరి, శ్రీకాళహస్తి, తిరుచానూరు, రామచంద్రాపు రం, గాజులమండ్యం, వడమాలపేట, ఏర్పేడు, ముత్యాలరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్ల పరిధిలోని 86 ట్రాన్సఫార్మర్లలో రాగివైరును అపహరించుకెళ్లారు. దీన్ని అమ్మగావచ్చిన డబ్బును అందరూ పంచుకునే వారు. దాదాపు రెండేళ్లుగా 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో 36 చోరీలకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ముఠాలోని సభ్యులందరూ ఆదివారం జూపార్కు రోడ్డులో వెళుతుండగా అటుగా వెళుతున్న సీఐలు రాజశేఖర్, సాయినాథ్, ఎస్ఐలు హరి ప్రసాద్, సురేష్‌కుమార్, ప్రవీణ్‌కుమా ర్, పీఎస్ఐ ఈశ్వరయ్య, ఈస్ట్ సబ్‌డివిజ న్ క్రైంపార్టీ పోలీసులు రాజు, రవిప్రకా ష్, వెంకటేశ్నాయుడు, శ్రీనివాసులు, ర విరెడ్డి, పండరీనాథ్, ముజీబ్, షాజహా న్లు వారిని ఆదుపులోకి తీసుకుని విచారించారు. అపహరణకు గురైన రూ.7 లక్షల విలువైన రాగి వైరును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐలు వెల్లడించారు.